సింగరేణి సంస్థలో ఎస్సీ& ఎస్టి కార్మికుల ఎదుర్కుంటున్న పలు సమస్యలపై చర్చించిన…

సింగరేణి సంస్థలో ఎస్సీ& ఎస్టి కార్మికుల ఎదుర్కుంటున్న పలు సమస్యలపై చర్చించిన.

ఎస్సీ & ఎస్టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిలుక రాజనర్సు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

ఈ రోజు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ని అలాగే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐ ఈ డి కిరణ్ కుమార్ ని, నూతనంగా ఏరియాకు బదిలీ పై వచ్చిన డీ.జీ.మ్ పర్సనల్ సిహెచ్.అశోక్ ని మర్యాద పూర్వకంగా కలిసి,సింగరేణి లోని కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపైన మాట్లాడడం జరిగినది
ముఖ్యంగా సింగరేణి సంస్థలో ఎస్సీ & ఎస్టి కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలు.అలగే సింగరేణి కార్మికులకు రావలసిన పదోన్నతుల విషయం ఆర్ ఓ ఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమోషన్లు వచ్చే విధంగా చూడాలని. జిఎం ని కోరడం జరిగినది. జిఎం సానుకూలంగా స్పందిస్తూ ఆర్ ఓ ఆర్ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తానని అర్హులైన కార్మికులకు తక్షణమే రిజర్వేషన్ ఫలాలు అందేలా చూస్తానని అన్నారు
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.

కార్మిక సంఘానికి కొత్త కమిటీ ఏర్పాటైంది…

కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ప్రజలు అందరూ రావాలి…

కాప్రా నేటిధాత్రి

 

 

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ఈసీఐఎల్ సిఐటియు కార్యాలయంలో జరిగినాయి
ఈమహాసభలో అధ్యక్షులు సిహెచ్ అశోక్ కార్యదర్శిగా జే వెంకన్నలు ఎన్నిక కావడం జరిగింది కార్యనిర్వహణ అధ్యక్షులు సి . కుమార్
ఉపాధ్యక్షులుగా డీకే దుర్గయ్య పి గంగారాం కే శ్రీనివాస్ కే యాదగిరి టి శ్రీనివాస్
సహాయక కార్యదర్శులుగా కార్యదర్శులుగా సిహెచ్ జంగయ్య ఎం కృష్ణమ్మ ఏ వేణు
కోశాధికారిగా పి ప్రభాకర్
మరియు 13 మంది కమిటీ సభ్యులు తో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని భవన నిర్మాణ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అశోక్ జె వెంకన్నలు ఒక ప్రకటనలో తెలిపినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version