గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మిక తనిఖీ..

గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మిక తనిఖీ

గ్యాస్ సరఫరాలో ప్రజలకు నిరంతర సేవలు

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లిలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, గ్యాస్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఆయన వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పాటించాలని సూచిస్తూ, గ్యాస్ సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.
ఎల్పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్ సీక్వెన్స్‌ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్ రీఫిల్స్‌ను సరఫరా చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు.
జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.
ఈ తనిఖీ సందర్భంగా తనిఖీలో భాగంగా రోజువారీ బుకింగ్స్, డెలివరీస్, రీఫిల్ గ్యాస్ సరఫరా విధానాన్ని సమీక్షించారు. అదేవిధంగా జిల్లాలో గ్యాస్ నిల్వలు, బుకింగ్స్, ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన సరఫరాపై పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

సింగరేణి సంస్థలో ఎస్సీ& ఎస్టి కార్మికుల ఎదుర్కుంటున్న పలు సమస్యలపై చర్చించిన…

సింగరేణి సంస్థలో ఎస్సీ& ఎస్టి కార్మికుల ఎదుర్కుంటున్న పలు సమస్యలపై చర్చించిన.

ఎస్సీ & ఎస్టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిలుక రాజనర్సు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

ఈ రోజు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ని అలాగే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐ ఈ డి కిరణ్ కుమార్ ని, నూతనంగా ఏరియాకు బదిలీ పై వచ్చిన డీ.జీ.మ్ పర్సనల్ సిహెచ్.అశోక్ ని మర్యాద పూర్వకంగా కలిసి,సింగరేణి లోని కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపైన మాట్లాడడం జరిగినది
ముఖ్యంగా సింగరేణి సంస్థలో ఎస్సీ & ఎస్టి కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలు.అలగే సింగరేణి కార్మికులకు రావలసిన పదోన్నతుల విషయం ఆర్ ఓ ఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమోషన్లు వచ్చే విధంగా చూడాలని. జిఎం ని కోరడం జరిగినది. జిఎం సానుకూలంగా స్పందిస్తూ ఆర్ ఓ ఆర్ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తానని అర్హులైన కార్మికులకు తక్షణమే రిజర్వేషన్ ఫలాలు అందేలా చూస్తానని అన్నారు
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.

ఘనంగా సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం..

ఘనంగా సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/G7hDJxL7XBE?si=_ZnV2GVLdYoOlJWo

 

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి అని, బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం సింగరేణి కాలరీస్ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జీఎం కార్యాలయ ప్రాంగాణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, జీఎం పూల వేసి నివాళులర్పించి, జెండావిష్కరణ చేశారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన కేకు కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకలా నిలుస్తుందని, కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ ఆధునికీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సింగరేణి మరింత ప్రగతి సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ఎమ్మెల్యే శాలువాలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు

ఆదానీ, అంబానీలకు లాభం చేయడం కోసమే బొగ్గు బ్లాకుల వేలం..

ఆదానీ, అంబానీలకు లాభం చేయడం కోసమే బొగ్గు బ్లాకుల వేలం

మణుగూరు పికె ఓసి2 ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కోల్ ఇండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలం వేయడాన్ని ఒప్పుకునేదే లేదని, మణుగూరు పికె ఒసి2 డిప్ సైట్ ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న మణుగూరు పికె ఓసి2 ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలైన ఆదా అని, ఏఎంఆర్ జెన్కో, మేఘ కృష్ణారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్కో కంపెనీలకు వేలం వేయడానికి ఏడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. పీకే ఓ సీ2ను సింగరేణి దక్కించుకోకుంటే మణుగూరులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే జెన్కో సంస్థ వేలం నుండి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మణుగూరు పీకే ఓసి 2 ఓసి బ్లాక్ లలో సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, 167 హెక్టార్లలో బొగ్గు ఉందని, కంపెనీకి ఆదాయాన్ని తెచ్చి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు వేలం వేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీలకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని, వారికి లాభం చేకూర్చడం కోసమే ఈ బొగ్గు బ్లాగులను వేలం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు పీకే ఓసి2 ని వేలం వేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోలేని సింగరేణి రక్షణ కోసం విశాఖ స్టీల్ ఉద్యమంలాగా రాబోయే రోజుల్లో కార్మిక సంఘాల ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జ్ నూకల చంద్రమౌళి, స్థానిక నాయకులు నల్ల సత్తి కుమారస్వామి బాబురావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు…

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో “భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి, ‘ఉక్కు మనిషి ’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సంధర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింధి ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొదటగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి, పూలతో నివాళులు అర్పించారు.
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ … “భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి, హోం మినిస్టర్ ‘ఉక్కు మనిషి ’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సంధర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం మన మందరం గౌరవంగా జరుపుకుంటున్నాం అన్నారు . దేశ సమైక్యతకు, జాతీయ ఏకతకు పటేల్ సేవలు అమూల్యం అన్నారు . ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మనం సమాజం మరియు దేశం అభివృద్ధికి పాటు పడాలన్నారు .
ఈరోజు గ్లోబల్ పోటీ కాలంలో , మన కార్యాలయంలోనూ ఐక్యత, పరస్పర గౌరవం, సహకారం అత్యంత అవసరంఅన్నారు . వివిధ ఆలోచనలు, భిన్న సంస్కృతులు ఉన్న మనమందరం ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేయడం మన బలం. ఉద్యోగులు తన బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చాలన్నారు . ఐక్యత భావనతో, సమైక్యతతో ముందుకు సాగితే సింగరేణి సంస్థ ఇంకా ఎన్నో విజయ శిఖరాలను అధిరోహిస్తుందన్నారు .
సమైక్యత ఒక్క రోజు కార్యక్రమం కాకుండా — అది మన రోజువారీ ఆచరణ. మనం కలిసికట్టుగా పనిచేయాలన్నారు , పరస్పరం ప్రోత్సహించుకొని , సామూహిక అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు . ప్రతి ఉద్యోగి సంస్థ పురోగతిలో ముఖ్య భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమములో ఏరియా ఎస్ఓటీజిఎం కవీంద్ర, , ఎస్ జోతి– రాజేశ్వర్ (క్వాలిటీ) కృష్ణప్రసాద్, ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, పోషమల్లు గుర్తింపు సంఘం ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ఇతర ఉన్నత ఆధికారులు,జియమ్ కార్యలయంలోని సిబ్భంది పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version