రాష్ట్ర సాధకుడిగా చిరస్థాయిగా నిలిచిన కేసీఆర్

· ఒంటి చేత్తో ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనుడు

· తెలంగాణను ఒక్కతాటిపై నడిపిన నాయకుడు

· కష్టసాధ్యమైన లక్ష్యాన్ని కసిగా సాధించిన నేత

· తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన నాయకుడు

· బీఆరఎస్‌గా పేరు మార్పు తర్వాత మొదలైన కష్టాలు

· దెబ్బతీసిన తనకు తిరుగులేదన్న అతివిశ్వాసం

· మంత్రుల అవినీతిని పట్టించుకోకపోవడం పెద్ద తప్పిదం

· వాస్తు ప్రకారం కట్టిన సెక్రటేరియట్ నిర్మాణం

· అది పూర్తయింది…పార్టీ ఓడింది

· నమ్మకాలతో పాలన సాగదు

· వాస్తవ దక్పథంతోనే అది సాధ్యం

· స్వీయ తప్పిదాలే దెబ్బతీసిన వైనం

హైదరాబాదH, నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫిబవ్రరి 17న తన 722వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. తొలుత కాంగ్రెస్‌లో తన పొలిటిక్ కెరీర్‌ను ప్రారంభించినా,     

1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మహానటుడు ఎన్టీఆర్ వీరాభిమానిగా పార్టీలో చేరి 2001 వరకు కొనసాగి, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాష్ట్రసమితిని (టీఆరఎస్)ను స్థా పించి దాదాపు దశాబ్డన్నరకాలంపాటు అప్రతిహతంగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ యువ నాయకుడి స్థానంనుంచి ఆయన ప్రస్థానం తెలంగాణ రూపశిల్పి దశకు ఎదిగింది. తెలంగాణకు జరుగుతున్న నష్టంపై మొదట్లో కేవలం ఈ ప్రాంత మేధావులు మాత్రమే సుదీర్ఘ చ ర్చించేవారు. వీరిలో ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్థనరావు, కాళోజీ నారాయణ రావు వంటి ఉద్దండులుండేవారు. తర్వాత ఈ ఉద్యమాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి వీలుగా అప్పటికి తెలుగుదేశంలో వున్న కేసీఆర్‌ను వీరు మోటివేట్ చేయడంతో చివరకు ఉద్యమ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి అంగీకరించి, రంగంలోకి దిగారు. ఆయన ఉద్యమపథంలోకి ప్రవేశించిన కాలంలో ఎవరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం ఏకోశానా వుండేది కా దు. పైకి ఎవరైనా మద్దతు పలికినా ఇది సాధ్యమయ్యేది కాదని చాటుమాటున పెదవి విరిచిన రోజులవి. అంతటి అపనమ్మక పరిస్థితుల మధ్య చిమ్మచీకట్లో ఉద్యమం అనే లాంతరు పట్టు కొని ప్రత్యేక రాష్ట్ర సాధన అనే వేకువ వైపునకు ప్రయాణం సాగించారు. ఎవరు తోడున్నా లేకున్నాలక్ష్యం వైపు నిజాయతీగా సాగితే తర్వాతి కాలంలో క్రమంగా మద్దతు లభిస్తుందన్న సత్యం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ పథాన్ని గమనిస్తే తేలిగ్గా అర్థమవుతుంది.

తెలంగాణ తెలుగు యాసలో పదాల గారడీతో విషయాన్ని విడమరచి చెప్పి సమాజాన్ని తనవైపు కు తిప్పుకున్న ఆధునిక యుగ నాయకుడుగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం వుంటుందని కర్మసిద్ధాంతం చెబుతుంది. కానీ కొందరి పుట్టుక కొన్ని అనూహ్య మార్పులకు దోహదపడుతుంది. నిజానికి తెలంగాణ సమస్య మేధావుల మెదళ్లలో నానుతున్నా, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేధోమధనం చేసిన వారు, కేసీఆర్‌ను ఎంపిక చేసిన తీరు, సమయం అత్యద్భుతం! అంటే సరైన సమయంలో, సరైన నాయకుడిని ముందుకు తీసుకురావడంలో వారు అత్యద్భుత మేధస్సును ప్రదర్శించారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేయలేదు. రాష్ట్రాన్ని సాధించి, అంతకు ముందు ఎవరూ కలలో కూడా ఊహించని ఒక గొప్ప దశ్యాన్ని ఆవిష్కరించారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ సాధనకే జన్మించిన నాయకుడుగా చెప్పుకోవాలి. కేసీఆర్ దగ్గర గొప్పతనమేమంటే, పనిలోకి దిగే ముందు, దాని గురించి సంపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవడం. ఇది ఆయన వద్ద నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన లక్షణం. పనిపై అవగాహన ఏర్పరచుకున్నప్పుడు రాబోయే ఒడిదుడుకులను ముందుగానే అంచనా వేసి, తదనుగుణంగా తగిన వ్యూహంతో ముందుకు సాగవచ్చు. ఉద్యమంలో చావో రేవో అనే దశ వస్తుందన్నది, గొప్ప పో రాటాలు, ఉద్యమాలను పరిశీలించినవారికి, వాటిల్లో పాలుపంచుకున్నవారికి బాగా తెలుస్తుంది. అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాత్మాగాంధీ కూడా 1942లో క్విట్ ఇండియా ఉద్య మంలో ‘సాధించు లేదా మరణించు’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా ఆమరణ నిరాహారదీక్ష చేసి మరణం అంచుల వరకు వెళ్లిన తర్వాతే ఒక్కసారి పరిస్థితులు మారిపోయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవ డానికి మార్గం సుగమమైంది. అంతకుముందు ఉ ద్యమం ఎంతటి తీవ్రస్థాయికి చేరుకున్నా, రాజకీయాలు, ప్రతి రాజకీయాలు నడిచాయే తప్ప రా ష్ట్రోదయం జరుగుతుందన్న విశ్వాసం ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా రాజకీ యాలను ఒక్కసారిగా మలుపు తిప్పిన 2009లో కేసీఆర్ చేసిన 11రోజుల నిరాహారదీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

2014లో రాష్ట్రం ఆవిర్భవించి, తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీర్ 2023 వరకు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించారు. ఆయన పాలనా కాలంలో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తెచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, రైతుబం ధు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే ఒక గొప్ప మణిహార మని చెప్పాలి. తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మలచిన గొప్ప ప్రాజెక్టు. తక్కువ కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసిన లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దే. మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన ప్రాజెక్టు వైఫల్యం కాదు. మరమ్మతులు చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ప్రాజెక్టుకైనా నిర్మించిన తర్వాత కొన్ని సమస్యలు రాకమానవు. ఇది సహజం. వాటిని ఒక్కసారి పరిష్కరిస్తే ప్రాజెక్టులు అజరామరంగా నిలిచిపోతాయి! ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం రాజకీయ కక్షలను పక్కన బెట్టి, లక్షలాది రైతుల ప్రయోజనాన్ని దష్టిలో పెట్టుకొని కాళేశ్వరం మరమ్మతులను వేగంగా పూర్తిచేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో రాష్ట్రంలో విపరీతం గా విద్యుత్ కోతలుండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 24/7 కరెంటు సరఫరా చేసి శభాషఅనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇదే పద్ధతిని అనుసరించి, అక్కడి ప్రజలకు నిరంతరం విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడం చరిత్ర!

ఎంతటి గొప్ప నాయకులైనా, కొన్ని లోపాలుండటం సహజం. కేసీఆర్ అందుకు అతీతుడు కా దు. ఆయన తన కెరీర్‌లో చేసిన తప్పిదం, టీఆరఎస్‌ను, బీఆరఎస్‌గా మార్చడం. అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకాలంలో దాదాపు దశాబ్దన్నరపాటు ప్రజల నోళ్లలో విపరీతం గా నానిన తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో భారత రాష్ట్ర సమితిగా మార్చిన పేరు అంతగా ఆకర్షించలేకపోయింది. ఉద్యమకాలంలో టీఆరఎస్ అనేది రాష్ట్ర సాధనకు ప్రధాన అస్త్రంగా ఉపయోగపడింది. అదే బీఆరఎస్‌గా మార్చిన తర్వాత, ఉద్యమం నాటి స్థాయి పరిస్థితులు లేవు కనుక దీనిపై ప్రజల్లో పెద్దగా స్పందన కలగలేదు. ఒకరకంగా చెప్పాలంటే బీఆరఎస్ పేరు అచ్చిరాలేదే మోననిపిస్తుంది. ఇప్పటికైనా టీఆరఎస్‌గా మార్చుకొని రాజకీయాలు చేస్తే కలిసిరావచ్చునేమో. బీఆరఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ పతనం మొదలై 2024 నాటికి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోని స్థాయికి దిగజారిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కేసీఆర్ రాజకీయంగా చేసిన రెండు తప్పులు ప్రధాన కారణమని చెప్పాలి. మొదటిది ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నిర్లక్ష్యం చేయడం కాగా రెండవది రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయించడం. ఈ రెండూ కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చునేలా చేశాయి. తన మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తినా ఆయన పట్టించుకోలేదు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మాదిరిగానే తనకూ తిరుగుండదన్న అతి విశ్వాసాన్ని ప్రదర్శించారు. కనిమొళి అరెస్టయి తీహార్ జైలుకెళ్లినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఎంతగా విలవిలలాడారో, ఇక్కడ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లినప్పుడు కూడా కేసీఆర్ ఒక తండ్రిగా తీవ్ర మనోవేదనకు గురైవుంటారు. ఇప్పుడు అదే కుమా ర్తె కవిత తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండటం, వద్ధాప్యంలో ఆయనకు తీరని క్షోభ కలిగించే అంశం. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు, గతంలో కిందపడి తుంటి విరిగిన నేపథ్యంలో గతంలో చూపిన ఉద్యమ ఉత్సాహం, వ్యూహ ప్రతివ్యూహ చాతుర్యాన్ని ఇప్పుడు ఆయన ప్రదర్శించలేకపోవచ్చు. కాకపోతే కేటీఆర్, హరీష్‌రావులు కాంగ్రెస్‌ను సమర్థవంతంగా కాంగ్రెస్‌ను ఎదిరిస్తూ వస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ పట్ల ప్రజల్లో ఇంగా గట్టి సానుకూలత వున్నదన్న సంగతి స్పష్టమైంది. స్థానిక ఎన్నికల్లో దిగువస్థాయి నాయకుల్లో ఆ యారాం, గయారాంలు, కప్పదాట్లు, జంపింగ్‌లు సర్వ సాధారణం కనుక రాబోయే అసెంబ్లీ ఎ న్నికలకు వీటిని ప్రాంతిపదికగా కొంతవరకు మాత్రమే తీసుకోగలం కానీ, పూర్తిగా ఆధారపడి ఒక నిర్ణయానికి రావడం కష్టం. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే బీఆరఎస్ ఇంకా తెలంగాణ ప్రజల్లోతన బలాన్ని పూర్తిగా కోల్పోలేదన్నది సుస్పష్టం. ఇదిలావుండగా కేసీఆర్ తెలంగాణ భవన్‌లో తన 72వ పుట్టినరోజు వేడుకలను 72కిలోల కేక్ కట్‌చేసి మరీ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మద్దతుదార్లు ఆయన పునరాగమనాన్ని తీవ్రంగా ఆకాంక్షిస్తున్నా, ప్రత్యర్థి రాజకీయాలు, ప్రతికూలతలు ప్రస్తుతానికి అడ్డంకిగా వున్నాయి. రానున్న కాలంలో ఆయన మరింత ఉత్సాహంగా పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version