గడప సముద్రం లో గణేశుల నిమజ్జనం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-66-1.wav?_=1

గడప సముద్రం లో గణేశుల నిమజ్జనం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.

Gadapa Samudram.

ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.

ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి…

ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లందర్నీ పర్మినెంట్ చేసి,కనీస వేతనం నెలకు26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాదులో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి యాసారపు వెంకన్న పిలుపునిచ్చారు. శనివారం గుండాల మండల కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజాల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు.రెక్కలు తప్ప ఆస్తులు లేని ఈ కార్మికులకు కనీస వేతనాలు కూడ అమలు చేయడం లేదని విమర్శించారు.మురికిలో మునిగి వీధులను శుభ్రం చేస్తున్న సపాయి కార్మికులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వకపోవడం చాలా విచారకరమని అన్నారు.పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మిక సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 7న హైదరాబాదులో నిర్వహించే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నాగేష్,తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింత నరసయ్య కార్మికులు పాల్గొన్నారు.

అతిధి అధ్యాపక నియమాకానికి దరఖాస్తుల ఆహ్వాన తేదీ పొడగింపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-65-1.wav?_=2

అతిధి అధ్యాపక నియమాకానికి దరఖాస్తుల ఆహ్వాన తేదీ పొడగింపు

8వ తేదీన దరఖాస్తులు స్వీకరణ,9వ తేదీన ఇంటర్యూ నిర్వహణ

 

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025,26 విద్యా సంవత్సరానికి గాను ఆతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ తెలిపారు.విద్యాశాఖా కమీషనర్ ఆదేశాల మేరకు బోటనీ విభాగంలో 1,మరియు మాథెమాటిక్స్ విభాగంలో 1కి గాను ఆతిధి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని,సంబందిత సబ్జెక్టులో 55శాతం మార్కులు (ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు 50శాతం మార్కులు)కలిగి ఉంటే ధరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.పిహెచ్డి,నెట్,సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది తెలిపారు.దరఖాస్తులు ఈ నెల 08వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని,ఇంటర్వ్యూలు 09వ తేదీ ఉదయం నిర్వహించడం జరుగుతుందని అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని తెలిపారు.సమాచారం కోసం 9951535357 గల నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-64.wav?_=3

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీతా భాస్కర్ గత కొద్ది నెలల క్రితం బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళగా తిరిగి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సర్పంచ్ గీత భాస్కర్ తో పాటు పూజారి సాంబయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మారం రాము, గాదె భద్రయ్య, గుంటుక సోమయ్య,బండి సత్యనారాయణ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మోహన్ రెడ్డి, దొమ్మటి పురుషోత్తం, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

హత్యకు గురైన బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-63-1.wav?_=4

హత్యకు గురైన బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిలో పట్టణానికి చెందిన బాలయ్య కొడుకు బీరయ్య చేతిలో హత్యకు గురైన బాలయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వ హాస్పిటల్ లో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరం బాలయ్య భార్యను కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని అధైర్య పడద్దని అని అన్నారు.అదేవిధంగా అనంతరం హాస్పిటల్లో సందర్శించారు. వివిధ గ్రామాలకు చెందిన పాముకాటు గురైన చికిత్స పొందుతున్న యువకులను పరామర్శించి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలని అదేవిధంగా డాక్టర్లకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను సూచించారు అదేవిధంగా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘోరాలు చాలా ఎక్కువ అయ్యాయి దయచేసి కుటుంబ సభ్యులు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటనలు చేసేటప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాటన్ మిల్ యూనియన్ అధ్యక్షులు సూర్య ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బావుండ్ల మధు, మార్కెట్ మాజీ చైర్మన్ బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మనోహర్ రెడ్డి,బండారి శ్రీనివాస్, భగత్ సింగ్ ,కిషోర్ వరుణ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటి ధాత్రి ,

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు నేటి వరకు కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఉపాధి ఉపాధి కూలీలు ఎండను సైతం లెక్కచేయకుండా అర్ధాకలితో పస్తులు ఉంటూ ఉపాధి పనులు చేస్తే ప్రభుత్వం కూలి డబ్బులు మంజూరు చేయకపోవడం సరైంది కాదు అని తెలుపుతున్నాం. సంబంధిత మండల ఈజిఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదని ఆరోపిస్తున్నాం. కూలీలు పస్తులు ఉండి పనులు చేస్తే కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుపుచున్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు రావలసిన కూలీ డబ్బులు మంజూరు చేసే వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-62-1.wav?_=5

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్

వనపర్తి నేటిదాత్రి .

గత ప్రభుత్వం లో 8.19 లక్షల కోట్ల అప్పుల భారం చేసి న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ లను అమలు చేస్తున్నమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ ములో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభిం చారు ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూన్నామను రాష్ట్రంలో అభివృద్ధి, ఆపలే దని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు జేరుగు తున్నదని అన్నారు
అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, రూ. 21 వేల కోట్లతో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ, గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12 వేల చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వారి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల్లో పెళ్ళైన, పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు.
గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని, కనీసం సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టిన ఐదు సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టేవారని కానీ వారికి పేదల సంక్షేమం కంటే కమిషన్లే ముఖ్యమని కాలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు.
ప్రజాపాలనలో తొలి విడతగా రూ. 22,500 కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు . ప్రతి సోమవారం రాష్ల్
వనపర్తి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభి సేవలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు
రాష్ట్రంలోని 200 యూనిట్ల లో పు ఉచిత విద్యుత్ వనపర్తి జిల్లా లో 6127 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మహిళల కు ఉచిత బస్ ప్రయాణం రైతులకు భూ భారతి చట్టం అనేక అభివృద్ధి పనులు చేస్తూ న్న మని మంత్రి చెప్పారు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వనపర్తి నియోజకవర్గ ని కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రాని కొనియాడారుమంగంపల్లిలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు , మంత్రులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి వ్యక్తిగతంగా ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులకు బట్టలు పెట్టారు డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు వర్తింపు

యాక్సిడెంట్ డెత్ ఎక్స్గ్రేగే షియా రూ.5 లక్షల నుంచి రూ10 లక్షలకు

సహజ మరణానికి రూ 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం

ఐఎన్ టి యు సి శాయం పేట మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్

శాయంపేట నేటిధాత్రి:

 

 

నిర్మాణ రంగ కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంపు వలన రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు ఉపయోగ ఉంటుందని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తెలిపారు.మండల అధ్యక్షుడు మాట్లాడుతూ యాక్సిడెంటల్‌ చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ ఆరు లక్షల నుంచి రూ పది లక్షలకు, సహజ మరణానికి రూ లక్ష ముప్పై వేల నుంచి రూ రెండు లక్షలకు ప్రభుత్వం పెంచింది అన్నారు. దీనివలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణ యించిందని అన్నారు.ఇందు లో భాగంగా యాక్సిడెంటల్‌ డెత్‌ ఎక్స్‌గ్రేషియాను రూ పది లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ రెండు లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ నిర్ణయించిందని అన్నా రు . వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుం బాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించ నుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాల ని గత సర్కార్‌ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మ న్లు, టన్నెల్‌వర్కర్స్‌,బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్‌ వర్కర్లు, రాళ్లు కొట్టేవా ళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్‌ డ్రైనేజీ వర్కర్స్‌, మిక్సర్‌ డ్రైవ ర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్‌ వర్కర్స్ తదితర యాభై నాలు గు రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో అరవై ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగి న వారందరికీ ఈ బీమా వర్తిం చనుంది అన్నారు. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ ముప్పై వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ ముప్పై వేలు, ప్రమాదవశాత్తు గాయ పడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ నాలుగు లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ ఐదు లక్షలు అనగా భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంట ల్‌ డెత్‌, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై కార్మికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌ ఎక్స్‌గ్రేషియా ను పెంచడం ఆనందంగా ఉందన్నారు.రిజిస్ట్రేషన్‌ కు అర్హతలివే తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు కింద సభ్యులుగా పద్దెనిమిది ఏండ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు అన్నారు. వీరు ఏడాదిలో కనీసం తొంబై రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి అన్నారు.రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, వయస్సు నిర్ధారణ కు రుజువుగా స్కూల్‌ సర్టిఫికే ట్‌ లేదా డాక్టర్‌ సర్టిఫికెట్‌ను సమర్పించి మెంబర్‌ షిప్‌
సంబంధిత అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు అందజేసి లేబర్‌ కార్డును పొందొచ్చు అన్నారు . లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యూవల్‌ చేసుకో వాలి అన్నారు. ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచడం పట్ల ఐఎన్ టి యు సి మం డల అధ్యక్షు డు మారపల్లి రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

◆:- పి.రాములు నేత

*జహీరాబాద్ నేటి ధాత్రి:

జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కార్మిక నాయకులు వ్యవసాయ కార్మిక నాయకులు స్వచ్ఛందంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయగలరు సమావేశంలోని ముఖ్యంశాలు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశానికి సంబంధించిన వర్తకులు కార్మికులు మన రాష్ట్రానికి వలస వచ్చి మన యొక్క వర్తకులను మన కార్మికులను మరియు వ్యవసాయ కార్మికులను వ్యాపార రంగంలో శ్రామిక రంగంలో కృంగదీస్తున్నారు దీని మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని వర్తకులు కార్మికులు వ్యవసాయదారులు అనేక రకాలుగా నష్టపోతున్నారు ఈ విషయాల పైన ప్రత్యేకమైన చర్చా ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది ఉత్తరభారతీయులు రాష్ట్రం లోపల అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఉదాహరణకు నకిలీ వస్తువుల విక్రయం కల్తీ తినుబండ రాళ్ల తయారీ చేస్తూ మోసపూరితమైన స్కీమ్ లతో వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వారికి నకిలీ వ్యక్తులు విక్రయించి వారి ధనాన్ని కూడా దోచుకెళుతున్నారు అనేక సందర్భాలలో రకరకాల మోసపూరిత వ్యాపారాలు నిర్వహించి తెలంగాణ సామాన్య ప్రజానీకానికి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు ఇట్టి విషయాల మీద ప్రత్యేకమైన చర్చ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం అనేక రకాల ప్రజా సంఘాలు వారికి తోచిన విధంగా తమకు తామే వాళ్లకు ప్రజా సంఘాన్ని నామకరణం చేసుకొని ముందుకెళుతున్న సంగతి తెలిసినదే అయినప్పటికిని ఏది ఏమైనా ప్రతి సంఘం యొక్క లక్ష్యం తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాబట్టి ఎవరు ఏ రకంగా ముందుకు వెళ్లిన అందరం కూడా మాసానికి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏకమై ముందుకు కదలాలని కార్యచరణలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది ఇటి సమావేశానికి అందరూ కూడా సమయపాలన పాటించి స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము కార్యక్రమంలో జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బెడబుడగజంగం నాయకులు మాదినం శివ ప్రసాద్ ,పి.దేషరథ్ ,వడ్డెర సంఘం నాయకులు పల్లెపు శేఖర్ ,డివిజన్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ధనరాజ్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థి నాయకులు కార్తీక్ రామ్ చరణ్ బాలకృష్ణ రవి కిషోర్ విష్ణు గార్లు పాల్గొన్నారు,

గణనాధుని ప్రత్యేక పూజల్లో సమ్మి గౌడ్ చిలువేరు

గణనాధుని ప్రత్యేక పూజల్లో సమ్మి గౌడ్ చిలువేరు

సమ్మి గౌడ్ చేతులమీదుగా లడ్డు లక్కీ డ్రా -విజేతలకు అందజేత

సభ్యులందరికీ సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్ట్ లు అందజేత

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ లో కేసరి మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపానికి యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని గణనాధుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు కాంగ్రెస్ మండల నాయకులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసరి మిత్ర యూత్ సభ్యులు, విలేజ్ కేసముద్రం గ్రామ ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు ఆ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం లడ్డు పాట వేలం వేయగా లడ్డు, కలశం, పంచ కండువాలు చీటీ డ్రా సమ్మి గౌడ్ చేతుల మీదుగా తీసి గణపతి లడ్డు గెలుచుకున్న కొలిపాక గోపి,కలశం గెలుచుకున్న వేల్పుల శ్రీ హర్ష,పంచ,కండువా గెలుచుకున్న నార బోయిన రమేష్ లకు అందజేయడం జరిగింది.అన్నా అంటూ ఆదరిస్తున్న కేసరి యూత్ సభ్యులు అడిగిన వెంటనే స్పందించి వారికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్టులను అందజేశారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ… మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మా అన్న సమన్నకు ఎల్లవేళలా మేము తోడుంటామని, అదేవిధంగా ఆ ఏకదంతుని ఆశీస్సులు సమ్మి గౌడ్ అన్నకు తన ఆశయాలు నెరవేర్చడంలో తోడ్పడాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డొనికల రాజు, కొమ్ము నరేష్,ఎస్కే తాజా,ఎస్ కే యాకూబ్, నాగరాజు,సందీప్, సాయి,దాసరి సందీప్,సిహెచ్ సురేష్, శ్రీనాథ్,ఈశ్వర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

గల్లీకో బెల్ట్ షాప్….

గల్లీకో బెల్ట్ షాప్….!

బంద్ వైన్ షాపుల కేనా…!బెల్ట్ షాపులకు కాదా…?

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాప్ లు

బెల్ట్ షాపులను నియంత్రించే అధికారులు ఎక్కడ

హోల్ సేల్ ముసుగులో బెల్ట్ షాప్ లకు విక్రయాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండలంలో మద్యం బెల్ట్ షాపుల దందాలు రోజురోజుకు పుట్టగొడుగుల పెరిగిపోతున్నాయి వెనకటికి ఒక సామెత ఉండేది బ్రతకలేక ఏదో పంతులయ్యాడని దానికి విరుద్ధంగా ఈరోజు తక్కువ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే కష్టపడి చెమటోడ్చాల్సిన అవసరం లేకుండా నాలుగు మద్యం సీసాలు అమ్ముకుంటే డబ్బే డబ్బు ఈరోజు అధికంగా లాభాలు కురిపించేదంటే ఒక మద్యం అమ్మకాల మీదే మూడు ఫుల్ బాటిల్ ఆరు కాయలుగా కాసులు కురిపించేది బెల్టు షాప్ దందా అన్నట్టుగా పల్లె పల్లెల్లో పుట్టగొడుగుల్లా కిరాణం షాప్ మాటున బెల్ట్ షాపుల దందాలు కలకలలాడుతూ రోజుకు వేళల్లో సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాలలో ప్రజలు అంటున్నారు.

 

బెల్ట్ షాప్ నిర్వహించుకోవాలంటే ఎవరి పర్మిషన్ అక్కరలేదు వైన్ షాప్ వారికి క్వాటర్ సీసాల పైన అదనంగా రూపాయలు చెల్లిస్తే ఎవరి పర్మిషన్ లేకుండానే బెల్టుషాప్ దందా నిర్వహించుకోవచ్చు అని బెల్టు షాప్ యజమానులే చెప్తున్నారు. పల్లెల్లోని ప్రజలు బెల్ట్ షాప్ అందుబాటులో ఉండడంతో మద్యం కొనుగోలు చేయాలనుకుంటే క్వార్టర్ సీసా మీద 50 నుంచి 70 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక బీర్ సీసా మీద వంద నుంచి 150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని గ్రామాల్లోని మద్యంప్రియల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాప్ యజమానులు వైన్ షాపులలోనే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వ నియమాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టు వైన్ షాప్ యజమానులు ఒక సిండికేట్ గా మారి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వ విధించిన ధరలకంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు

బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వినియోగదారుడు వైన్ షాప్ తనకిష్టమైన బ్రాండ్ మద్యం అడిగితే లేదు అనే సమాధానమే ఎదురవుతుందని పలువురు మద్యం ప్రియులు అంటున్నారు. అదే బ్రాండ్ మాత్రం బెల్ట్ షాపులలో దర్శనమిస్తాయని బెల్ట్ షాపులలో మద్యం కొనుగోలు చేయాలంటే ఒక ఫుల్ బాటిల్ మీద 100 నుంచి 150 వరకు చెల్లిస్తేనే మనకు నచ్చిన బ్రాండ్ మద్యం దొరుకుతుందని బెల్టు షాపులలో లేని మద్యం అంటూ ఉండదని మద్యం ప్రియులే చెప్తున్నారు.

వైన్ షాప్ బంద్ రోజులలో బెల్ట్ షాపులు కలకల

ముఖ్యంగా ప్రభుత్వం మద్యం షాపులకు సెలవు రోజులలో వైన్ షాపులకు ప్రభుత్వ సంబంధిత అధికారులు వైన్ షాపులకు తాళాలు వేసి సీల్ వేసి పక్క పకడ్బందీగా అమలు చేస్తారని ప్రజలందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వ నియమాలు వైన్ షాపులకే కానీ మా బెల్ట్ షాపులకు కాదు అన్నట్టుగా ఇష్ట రాజ్యాంగ ఇదే అదునుగా భావించి బెల్ట్ షాప్ నిర్వాహకులు మాత్రం 24 గంటలు తలుపులు తెరుచుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా ఉంటాయని, ఆరోజు మద్యం ధర బెల్ట్ షాప్ నిర్వాహకుల నిర్ణయిస్తారని వారు ఎంత చెప్తే అంతే ధర చెల్లిస్తేనే మద్యం సీసా దక్కుతోందని గ్రామాల్లో బహిరంగ చర్చలు వినబడుతున్నాయి. శుక్రవారం గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రభుత్వం వైన్ షాపులకు సెలవు ప్రకటించి వైన్ షాపులు మూసుకున్నాయి, ఆరోజు మాత్రం బెల్ట్ షాపులు కలకలలాడుతూ జోరుగా మద్యం అమ్మకాలు సాగినట్టు సమాచారం. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పవిత్రమైన బంద్ రోజులలో మధ్య విగ్రహాలు జరుగుతున్నాయంటే వీళ్లు గాంధీ జయంతి రోజున కూడా మధ్య విక్రయాలు జరుపుతారేమోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ…?

మండలంలో రోజురోజుకు మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ముందు కిరాణం షాప్ వెనక బెల్టు షాప్ లు వెలుస్తున్నాయని మండలంలో కోడై కూస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం ఈ అక్రమ బెల్టు షాపుల దందాల వ్యవహారం కనిపించట్లేదా అని ప్రజలు అధికారుల తీరు పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాబోయే రోజులలో బెల్టు షాపుల దందాలు సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందని చదువుకునే యువకులు మధ్యానికి అలవాటు పడి బానిసలుగా మారతారని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాల్లో మద్యం చిచ్చు చల్లారట్లేదని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాళ్ల పిల్లల్ని ఉన్నతమైన విద్యను అందించలేక మద్యానికి బానిసైన కుటుంబాలు విలవిలలాడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లోని అక్రమ బెల్ట్ షాపులను నియంత్రించేలా రోజువారి మద్యం ప్రియులకు జేబులకు చిల్లు పడకుండా మద్యాన్ని ఒక ప్రభుత్వ అనుమతులు పొందిన వైన్ షాపులలో విక్రయాలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం మహిళలు యువతీ యువకులు భజనలు కోలాహాటాలతో బ్యాండ్ డీజే పాటలతో సాగింది చిన్న పెద్ద అంతా కలిసి శోభాయతులు ఉత్సాహంగా పాల్గొని ఆడి పాడారు చివరి రోజు కావడంతో గణనాధునికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.ఈ క్రమంలో మండలం లోని పలు గ్రామాల్లో చెరువు లు కుంటలు ప్రాజెక్టుల వద్ద గణేష్ నిమజ్జనాలు కోలాహా లంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండపాల యువతీ యువకులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు

ఎంపీడీవో ఆఫీసులో ఎలక్షన్ డ్రాప్టింగ్ లిస్ట్ ప్రచురణ.

ఎంపీడీవో ఆఫీసులో ఎలక్షన్ డ్రాప్టింగ్ లిస్ట్ ప్రచురణ.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శనివారం రోజున ఎంపీడీవో జయ శ్రీ ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ ఎంపిటిసి జెడ్పిటిసి ఎలక్ట్రోల్ లిస్ట్ మరియు పోలింగ్ స్టేషన్స్ వివరాలను ప్రచురించడం జరిగింది దీనికి సంబంధించి ఏవైనా అపోహలు సందేహాలు ఉంటే శనివారం నుండి ఈనెల 8వ తేదీ వరకు వినతులను స్వీకరించడం జరుగుతుందని. అదే రోజు కార్యాలయంలో మండల రాజకీయ పార్టీ ప్రతినిధులతో 11:30 కి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్పాజీపల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిష్ట..

అప్పాజీపల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిష్ట..

రామాయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

సగర సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో గణేశుని ప్రతిష్టించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మండపానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శనమిచ్చారు. గణేశ్ వద్దకు వచ్చిన భక్తులకు సగర సంఘం గుర్తింపుగా ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ చైర్మన్ సంధిల సత్తయ్య సగర, జిల్లా అధ్యక్షులు సంధిల సాయిలు సగర, గ్రామ అధ్యక్షులు శంకురి సాయిలు సగర, ఉపాధ్యక్షులు రుక్కముల సంగయ్య సగర, మాజీ అధ్యక్షులు చెట్టుకింది సాయిలు సగర, మాజీ సర్పంచ్ మర్క రాములు సగర, సగర బంధువులు ఎల్లంపల్లి జగన్ సగర, చెట్టుకింది లక్ష్మయ్య సగర తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో న్యాల్కల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ…

న్యాల్కల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ, క్రీడల్లో సత్తా చాటారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహిరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలో జరిగిన మండల స్థాయి అండర్ 14, 17 క్రీడల్లో న్యాల్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వాలీబాల్ సీనియర్స్ విభాగంలో బాలుర, బాలికల జట్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. జూనియర్ కోకోలో కూడా పాఠశాల ప్రథమ స్థానం సాధించింది. సీనియర్ కోకో, కబడ్డీ పోటీల్లో ద్వితీయ బహుమతులు దక్కించుకున్నారు. ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

దసరాకు నిరుపేదలకు చీరలు ఇవ్వాలి: జాగో తెలంగాణ డిమాండ్…

నిరుపేదలకు రానన్న దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి

◆:- జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటేనే తెలంగాణ పండుగ అంతటి ప్రాధాన్యత ఉన్న పండుగకు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నిరుపేద ప్రజలకు కెసిఆర్ గారి మంచి ఆలోచనతో తెలంగాణలో దసరా పండుగ అందరు జరుపుకోవాలని ప్రజలు ఆనందంగా సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్న బతుకమ్మ చీరలు బందు చేశారు నిరుపేద తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు మంచి నూనె సబ్బులు సరఫరా చేయాలి రాష్ట్రంలో నిరుపేద ప్రజలు లక్షలాదిగా ఉన్నారు అందరూ ఉన్నవాళ్లే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వము అని గొప్పలు చెప్పుకోవడం కాదు పేదలకు కడుపునిండా అన్నం పెట్టడం వారికి దసరా పండుగ జరుపుకోవడానికి అన్ని సదుపాయాలు చేయడం అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజలు నిర్ణయిస్తారు జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత మొహమ్మద్ ఇమ్రాన్ ప్రధాన కార్యవర్గ సభ్యులు, మరియు, మాదినం శివప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్యార్ల దశరథ్ జహీరాబాద్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది,

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ గ్రామా మాజి సర్పంచ్ వీర్శెట్టి పాటిల్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు వారి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అండగా ఉంటామని మనోధైర్యని కలగజేశారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి ,మాజి సర్పంచ్ మాజి ఎంపీటీసీలు చంద్రన్న పటేల్, వెంకట్ శశి వర్ధన్ రెడ్డి,నాగన్న సయీద్ ఆనంద్ తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయులకు సన్మానించిన సిద్దు పటేల్ మరియు చైర్మన్…

ఉపాధ్యాయులకు సన్మానించిన సిద్దు పటేల్ మరియు చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మేదపల్లి పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సిద్దు పటేల్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుల బృందానికి శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామపెద్దలు అభిలాష్ రెడ్డి గాలయ్య డాక్టర్ శ్రీకాంత్ నాగరాజు పటేల్ రఫిక్ పటేల్
హరి వంశీ మజర్ బంటు శేఖర్ బంటు శ్రీనివాస్ సంగమేశ్వర్ పాటిల్ వీరన్న మరియు ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు,

ఉపాధ్యాయులకు సన్మానించిన సిద్దు పటేల్ మరియు చైర్మన్…

ఉపాధ్యాయులకు సన్మానించిన సిద్దు పటేల్ మరియు చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మేదపల్లి పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సిద్దు పటేల్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుల బృందానికి శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామపెద్దలు అభిలాష్ రెడ్డి గాలయ్య డాక్టర్ శ్రీకాంత్ నాగరాజు పటేల్ రఫిక్ పటేల్

 

హరి వంశీ మజర్ బంటు శేఖర్ బంటు శ్రీనివాస్ సంగమేశ్వర్ పాటిల్ వీరన్న మరియు ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version