డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం…

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం
తొలి గ్రహీతగా డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందిస్తూ కవిగా, రచయితగా, విమర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సిరిసిల్ల వాస్తవ్యులైన డా. చిటికెన కిరణ్ కుమార్ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఎంపిక చేసింది.డా. కిరణ్ కుమార్ సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. చైతన్య స్ఫూర్తి వంటి ప్రథమ గ్రంథం, ఓ తండ్రి తీర్పు లఘు చిత్రకథ, వందలాది పత్రికలలో వెలువడిన అనేక కవితలు,వ్యాసాలు, సమీక్షలు, సంపాదకీయాలు—ఇవి అన్నీ తెలుగు పాఠకలోకంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి గర్వకారణంగా నిలిచింది.
ఈ అవార్డు, పద్మశాలి కుల భూషణులు, వేలాది లలితగీతాలు రచించిన సుప్రసిద్ధ సినీ గేయరచయిత, జాతీయ మహాకవి స్వర్గీయ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ స్మారకార్థం సంస్థ స్థాపించింది. తెలుగు సాహిత్యానికే కాదు, సంగీత, సినీ ప్రపంచానికీ ఆయన అందించిన విలువైన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది.
ఈ అవార్డును మొదటిసారిగా డా. చిటికెన కిరణ్ కుమార్ అందజేయడం తమ సంఘానికి గర్వకారణమని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు తుమ్మ సత్యనారాయణ, సూరేపల్లి రవికుమార్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో, ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారం ఘనంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండా రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బూర దేవానందం, యువజన కార్యదర్శి అంకారపు రవి, కవులు,కళాకారులు, రచయితలు అభినందించారు

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం మహిళలు యువతీ యువకులు భజనలు కోలాహాటాలతో బ్యాండ్ డీజే పాటలతో సాగింది చిన్న పెద్ద అంతా కలిసి శోభాయతులు ఉత్సాహంగా పాల్గొని ఆడి పాడారు చివరి రోజు కావడంతో గణనాధునికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.ఈ క్రమంలో మండలం లోని పలు గ్రామాల్లో చెరువు లు కుంటలు ప్రాజెక్టుల వద్ద గణేష్ నిమజ్జనాలు కోలాహా లంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండపాల యువతీ యువకులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు

శరవేగంగా మ్యూజిక్‌ సెషన్స్‌.

శరవేగంగా మ్యూజిక్‌ సెషన్స్‌

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘వీటీ15(వర్కింగ్‌ టైటిల్‌)’ సినిమా మ్యూజిక్‌ సెషన్లు…

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘వీటీ15(వర్కింగ్‌ టైటిల్‌)’ సినిమా మ్యూజిక్‌ సెషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్‌ – థమన్‌ కాంబినేషన్‌ మరోసారి అద్భుతమైన ఆల్బమ్‌ ఇవ్వబోతున్నారని, ఇప్పటికే రెండు పాటలు పూర్తయ్యాయని మేకర్స్‌ తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మూడు మేజర్‌ షెడ్యూళ్లను ఇండియా, విదేశాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. త్వరలోనే టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version