ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటి ధాత్రి ,

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు నేటి వరకు కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఉపాధి ఉపాధి కూలీలు ఎండను సైతం లెక్కచేయకుండా అర్ధాకలితో పస్తులు ఉంటూ ఉపాధి పనులు చేస్తే ప్రభుత్వం కూలి డబ్బులు మంజూరు చేయకపోవడం సరైంది కాదు అని తెలుపుతున్నాం. సంబంధిత మండల ఈజిఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదని ఆరోపిస్తున్నాం. కూలీలు పస్తులు ఉండి పనులు చేస్తే కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుపుచున్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు రావలసిన కూలీ డబ్బులు మంజూరు చేసే వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వాలి…

ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వాలి

పీహెచ్సీ ముందు సిఐటీయు ధర్నా

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తమకు పారితోషకం వద్దని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతూ పిహెచ్సి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక డాక్టర్ సుధీర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. తమకు ప్రతి నెల వేతనం సక్రమంగా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ 20 తారీకు గడుస్తున్నప్పటికీ వేతనం ఇవ్వలేదని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట దాటి వేసిందని అందుకనే ఈనెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, 30 న హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు వజ్జ సుశీల తెలిపారు. జబ్బ ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నదని కనీస వేతనం అమలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూనేమ్ సరోజ, ఊకె విజయలక్ష్మి, లక్ష్మీనరసమ్మ కల్తీ వసంత ,వినోద, ఈశ్వరి ఈసం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version