ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లందర్నీ పర్మినెంట్ చేసి,కనీస వేతనం నెలకు26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాదులో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి యాసారపు వెంకన్న పిలుపునిచ్చారు. శనివారం గుండాల మండల కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజాల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు.రెక్కలు తప్ప ఆస్తులు లేని ఈ కార్మికులకు కనీస వేతనాలు కూడ అమలు చేయడం లేదని విమర్శించారు.మురికిలో మునిగి వీధులను శుభ్రం చేస్తున్న సపాయి కార్మికులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వకపోవడం చాలా విచారకరమని అన్నారు.పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మిక సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 7న హైదరాబాదులో నిర్వహించే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నాగేష్,తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింత నరసయ్య కార్మికులు పాల్గొన్నారు.