న్యాల్కల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ, క్రీడల్లో సత్తా చాటారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహిరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలో జరిగిన మండల స్థాయి అండర్ 14, 17 క్రీడల్లో న్యాల్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వాలీబాల్ సీనియర్స్ విభాగంలో బాలుర, బాలికల జట్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. జూనియర్ కోకోలో కూడా పాఠశాల ప్రథమ స్థానం సాధించింది. సీనియర్ కోకో, కబడ్డీ పోటీల్లో ద్వితీయ బహుమతులు దక్కించుకున్నారు. ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.