కాలం మారినా ఆ గ్రామాల్లో మారని సంప్రదాయం!

కాలం మారినా ఆ గ్రామాల్లో మారని సంప్రదాయం!

జహీరాబాద్ నేతి ధాత్రి:

జీవిత శైలి ఎన్ని మార్పులు చెందినా.. ఆధునికత ఎంతగా విస్తరించినా.. మన పూర్వీకుల విలువలు, సంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో నేటికీ సజీవంగా ఉన్నాయి. తెలంగాణ – కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కంగ్టి, పిట్లం, బీదర్ (కర్ణాటక), నాందేడ్, దెగ్లూర్ (మహారాష్ట్ర) వంటి ప్రాంతాలు ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా నాగుల పంచమి అంటే పాములకు పూజలు చేసి, పుట్టలో పాలు పోయడం గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ నాగులపంచమికి అత్యంత విశిష్టత ఉంది.
కాలం ఎలా మారినా, ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ సంప్రదాయాలకు పట్టం కడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ సోదరీమణులకు, మేనకోడళ్లకు, తోబుట్టువుల కూతుళ్లకు జాకెట్ బట్టలు, రెండు కుడకలు వంటి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం ఓ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇంతకీ ఈ సంస్కృతి గొప్పతనం ఏంటంటే అన్నదమ్ములు లేని పరిస్థితుల్లోనైనా, వారి పిల్లలకు బహుమతులు తీసుకెళ్లడం ద్వారా బంధాలను కాపాడుతున్నారు. ఇది కేవలం ఆచారంగా కాకుండా, బంధాలను బలపరిచే ఒక ఆదర్శంగా మారింది. ఆడపడుచుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, ఇంటి పరంపరలను గౌరవంగా నిలుపుతూ సాగుతున్న ఈ పండుగ గతాన్ని తలపెట్టి, భవిష్యత్తును నిర్మించేలా మారుతోంది. సాంకేతిక యుగంలోనూ ఈ సాంప్రదాయ ధారలు మరింత శక్తివంతంగా ముందుకు సాగుతున్నాయి.

ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే.

ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే

◆ 70 ఏళ్లుగా పూరిగుడిసెల్లోనే జీవనం కొనసాగింపు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. గడిచిన 18 నెలల అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను విడుదల చేశారు. అందులో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేసిన ఇల్లు ఉన్న వారికే ఇల్లు రావడంతో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. వారి పక్షాన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పే నాయకులే లేకపోయారు. దీనికి నిదర్శనం మండల కేంద్రమైన మొగుడంపల్లి లోని వృద్ధురాని నీ ఉదాహరణగా తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితా ఎలా జరిగిందో అర్ధం అవుతుంది. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం కూడా నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే అవకాశం లేదు. ఫలితంగా పేదలు పేదలుగానే గుడిసెల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. 70 సంవత్సరాల వృద్ధు రాలుని పుట్టక ముందు నుంచి వారి తల్లిదండ్రులు సైతం అదే గుడిసెలో కాపురం చేశారు. ఈసారైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ స్థానిక నాయకుల పక్షపాతమో.. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ మొగుడంపల్లి మండల కేంద్రమైన గుడుపల్లి కు మంజూరైన 35 ఇండ్లలో 18 రిటన్ పంపుతున్నారని దాంట్లో ఎవరికైనా బీదవారి అవసరం ఉన్నవారికి మంజూరు చేయాలని కోరారు. ఇండ్లలో అత్యధికంగా ఉన్న వారికే ఇండ్ల జాబితాలో పేర్లు వచ్చాయన్నారు. గుడుపల్లి గ్రామానికి చెందిన ఖైరున్ బీ, భర్త ఇబ్రహీం షా. వీరికి ఆరు గురు కుమారుడు ఐదు గురు కూతురు ఉన్నారని కానీ పూరి గుడిసెలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ నాయకులకు, అధికారులకు మాత్రం బీద వారి ముసలి వయసు ఉండే చేయించే బాధ్యత పూరి గుడిసె కనిపించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు ఎకరాల కొద్ది భూములు ఉన్న వారికి సైతం ఇల్లు ఇచ్చారు. కానీ అలాంటిది నిరుపేదకు -మాత్రం మొండి చేయి చూపించారు. ఇది కేవలం ఒక గుడుపల్లి గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ చెందిన నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

 

KL Rahul:నేటి ధాత్రి:

 

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పేస్, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత భారత జట్టులో ఈ వికెట్లపై ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లూ తక్కువే. దీంతో ఇంగ్లండ్‌ ఆధిపత్యం తప్పదని అనుకుంటున్న తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్ట్‌లో థ్రిల్లింగ్ నాక్‌తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు హెచ్చరికలు పంపించాడు.

ఇది కదా కావాల్సింది..

ఇంగ్లండ్ లయన్స్‌తో పోరులో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు రాహుల్. ఇందులో 15 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావివ్వకుండా ఆడాడు. ప్రతి బంతిని అంతే కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. కరుణ్ నాయర్ (40)తో కలసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. నాలుగో వికెట్‌కు ధృవ్ జురెల్ (52)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యం జతచేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. తన ఫామ్, ఫిట్‌నెస్, మైండ్‌సెట్ ఎలా ఉందో రాహుల్ నిరూపించాడని మెచ్చుకుంటున్నారు. రాబోయే సిరీస్‌లో పరుగుల వర్షం కురిపిస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్‌కు ఇకపై అతడే మూలస్తంభం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

పంపిణీ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

గత ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు కుట్టు
మిషన్లు పంపిణీ చేయకుండా రైతు వేదికలో ఉంచిన 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పాడవుతున్నాయని వేంటనే తహాశీల్దార్ హేమ మహిళా దినోత్సవం రోజున అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ* చేయాలి.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
మంగళవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఉంచిన కుట్టు మిషన్లు పరిశీలించి అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని తహాశీల్దార్ కార్యాలయంలో ఎంపీఎస్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన మహిళలకు మండలంలో ఉన్న గ్రామాలల నుండి కొంతమందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషను ఇచ్చి వారి కుటుంబం అభివృద్ధి చెందడం కోసం కుట్టు మిషన్లు తెప్పించి రైతు వేదికలో ఉంచిందని మహిళలకు పంపిణీ చేయకుండా అది రైతు వేదికకే పరిమితం అయ్యిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తహశీల్దార్ హేమ చొరవ తీసుకుని తక్షణమే అర్హులైన మహిళలకు మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతు వేదికలో ఉన్న 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పోతాయని అన్నారు. మహిళలు వీటి ద్వారా సాధికారత సాధించి అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం వలన 60 కుటుంబాలను ఆదుకున్న వారిమి అవుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి కార్యవర్గం సభ్యులు పుల్యాల సురేష్ నద్దునూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version