ఇంగ్లండ్‌ నిలిచింది.

ఇంగ్లండ్‌ నిలిచింది

భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్‌ సివర్‌ సేన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన…

లండన్‌: భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్‌ సివర్‌ సేన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం సిరీ్‌సలో ఇరు జట్లు 1-1తో నిలవగా.. ఆఖరి మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది. వర్షం కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. మంధాన (42), దీప్తి శర్మ (30 నాటౌట్‌) మాత్రమే రాణించారు. ఎకెల్‌స్టోన్‌కు 3.. ఎర్లాట్‌, లిన్సే స్మిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 రన్స్‌గా నిర్ణయించారు. ఓపెనర్లు అమీ జోన్స్‌ (46 నాటౌట్‌), బ్యూమంట్‌ (34)ల ధాటికి ఇంగ్లండ్‌ 21 ఓవర్లలో 116/2 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది.

పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన..

పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన

దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను…

లండన్‌: దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను 54 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. కళ్లకు నల్లటి గ్లాసులు, తలకు పనామా టోపీ, పొడవాటి మీసాలతో విలక్షణంగా కనిపించే రస్సెల్‌ 90 దశకంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకునేవాడు. క్రికెట్‌ నుంచి వైదొలిగాక పెయింటింగ్‌లో బిజీ అయ్యానని చెప్పాడు. అంతేకాకుండా క్రికెట్‌ ఆడే సమయంలోకన్నా ఇప్పుడే ఎక్కువగా సంపాదిస్తున్నట్టు రస్సెల్‌ తెలిపాడు. అయితే ధన సంపాదన కోసమే పెయింటింగ్స్‌ వేయడం లేదని, బొమ్మలు గీయడం తనకో వ్యసనమని తేల్చాడు. భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నందున తాను రంజిత్‌ సింగ్‌జీ బొమ్మను సైతం చిత్రించినట్టు పేర్కొన్నాడు.

డబుల్ సెంచరీ కొట్టి తీరుతా..

డబుల్ సెంచరీ కొట్టి తీరుతా.. ఇంగ్లండ్‌కు సూర్యవంశీ వార్నింగ్!

ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్‌ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

14 ఏళ్ల వయసులోనే స్టార్‌డమ్ సంపాదించాడు వైభవ్ సూర్యవంశీ. అండర్-19లో ఆడుతూ వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాటర్.. ఐపీఎల్-2025తో ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన సూర్యవంశీ.. 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 252 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది పాత రికార్డులకు పాతర వేశాడు. అక్కడితో ఆగని వైభవ్.. ఇంగ్లండ్ టూర్‌లో భారత అండర్-19 జట్టుకు ఆడుతూ 52 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. 10 ఫోర్లు, 7 సిక్సులు బాదిన సూర్యవంశీ.. 78 బంతుల్లో 143 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అలాంటోడు ప్రత్యర్థులకు మరోమారు హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ వైభవ్ ఏమన్నాడంటే..

ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ ఇలా చేశారేంటి.

ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ ఇలా చేశారేంటి…

 

రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్‌ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

లీడ్స్ టెస్ట్‌లో విజయంతో ఫుల్ ఖుషీగా ఉంది ఇంగ్లండ్. టీమిండియాను 5 వికెట్ల తేడాతో ఓడించడంతో స్టోక్స్ సేన కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇదే జోరులో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో కూడా గెలుపుబావుటా ఎగురవేయాలని చూస్తోంది ఆతిథ్య జట్టు.
ఈ క్రమంలోనే ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఓ స్టార్ పేసర్‌ను పక్కనబెట్టేసింది.
అతడ్ని తీసుకుంటారంటూ బాగా ప్రచారం జరిగినా తుది జట్టులో మాత్రం అవకాశం కల్పించలేదు.
అతడు ఎవరనేది ఇప్పుడు చూద్

 

ఎందుకు తీసుకోలేదు?

తొలి టెస్టులో ఆడిన జట్టునే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కూ యథావిధిగా కొనసాగించింది ఇంగ్లండ్. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్ ఆడతారు.

హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకుంటారు. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా షోయబ్ బషీర్‌ బరిలోకి దిగుతాడు.

అయితే అంతా బాగానే ఉన్నా పేస్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కౌంటీల్లో అదరగొట్టిన ఆర్చర్.. ఫామ్, ఫిట్‌నెస్ రెండూ నిరూపించుకున్నాడు.

దీంతో అతడ్ని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం అవకాశం కల్పించలేదు.

ఆర్చర్ విషయంలో మరికొంత కాలం వేచి ఉండాలని పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే ఆడించాలనే ఆలోచనల్లో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్…

 

టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.

ఇంగ్లండ్ పర్యటనను పరాభవంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్టులో ఓటమి గిల్ సేనను నిరాశలో ముంచేసింది. అయితే వెంటనే తేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. స్టోక్స్ సేన బెండు తీసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూకు అండగా నిలబడుతున్నాడో ఇంగ్లండ్ స్టార్. సొంతజట్టుకు వ్యతిరేకంగా, గిల్ సేనకు అనుకూలంగా పని చేస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
మైండ్‌సెట్ ముఖ్యం..

భారత జట్టు ఆటగాళ్లకు సాయం చేస్తున్నాడు ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్. స్పిన్నర్లకు అంతగా అచ్చిరాని ఇంగ్లీష్ కండీషన్స్‌లో వికెట్లు ఎలా తీయాలో నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ బయటపెట్టాడు. ‘కెవిన్ పీటర్సన్ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లండ్‌లో ఎలా రాణించాలో చెప్పాడు. ఇక్కడి ఫీల్డింగ్ పొజిషన్స్, పిచ్‌ల గురించి అర్థం అయ్యేలా వివరించాడు. ఎలాంటి మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేయాలో సూచించాడు అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం..

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

 

నేటిధాత్రి:

 

 

 

 

 

 

ఇంగ్లండ్‌కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.

 ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం లండన్‌కు చేరుకున్న బుమ్రా.. అలా ల్యాండ్ అయ్యాడో లేదో సాధన షురూ చేసేశాడు. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో బుమ్రా పరుగులు తీస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమ్ క్యాంప్‌లో జాయిన్ అయిన స్పీడ్‌గన్.. రన్నింగ్‌తో పాటు బౌలింగ్ డ్రిల్స్ చేస్తూ కనిపించాడు. గ్యాప్‌లో బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌తో కలసి అతడు మాట్లాడటాన్ని కూడా వీడియోలో చూడొచ్చు. బుమ్రా సాధన చూసి ప్రత్యర్థి బ్యాటర్లు వణుకుతున్నారని తెలుస్తోంది.

 

వణుకుతున్న బ్యాటర్లు!

కోచ్‌తో బుమ్రా సుదీర్ఘంగా చర్చించడం, గ్రౌండ్‌లో రేసుగుర్రంలా పరుగులు తీయడం, ఫుల్‌ ఫిట్‌గా కనిపించడంతో ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఎక్కడ తమ పని ఫినిష్ చేస్తాడోనని ఇంగ్లీష్ బ్యాటర్లు భయపడుతున్నారట. అతడి ఫిట్‌నెస్ చూసి అవాక్కవుతున్నారట. 3 టెస్టులు ఆడితే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు 5 టెస్టులు పక్కా ఆడేలా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆతిథ్య జట్టుకు దబిడిదిబిడేనని అంటున్నారు. స్టోక్స్ సేన కాచుకో.. అంటూ సవాల్ విసురుతున్నారు. కాగా, ఇంగ్లండ్ టూర్‌ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించిన సమయంలో బుమ్రా మూడు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే భారత ట్రెయినింగ్ సెషన్‌లో మాత్రం పేస్ గన్ ఉత్సాహంగా పాల్గొనడం, ఫిట్‌గా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన టీమ్‌కు తిరుగులేదని అంటున్నారు.

 

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

 

KL Rahul:నేటి ధాత్రి:

 

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పేస్, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత భారత జట్టులో ఈ వికెట్లపై ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లూ తక్కువే. దీంతో ఇంగ్లండ్‌ ఆధిపత్యం తప్పదని అనుకుంటున్న తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్ట్‌లో థ్రిల్లింగ్ నాక్‌తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు హెచ్చరికలు పంపించాడు.

ఇది కదా కావాల్సింది..

ఇంగ్లండ్ లయన్స్‌తో పోరులో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు రాహుల్. ఇందులో 15 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావివ్వకుండా ఆడాడు. ప్రతి బంతిని అంతే కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. కరుణ్ నాయర్ (40)తో కలసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. నాలుగో వికెట్‌కు ధృవ్ జురెల్ (52)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యం జతచేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. తన ఫామ్, ఫిట్‌నెస్, మైండ్‌సెట్ ఎలా ఉందో రాహుల్ నిరూపించాడని మెచ్చుకుంటున్నారు. రాబోయే సిరీస్‌లో పరుగుల వర్షం కురిపిస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్‌కు ఇకపై అతడే మూలస్తంభం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version