వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీ సెర్ప్ డిఆర్డిఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంక ,కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. తహసీల్దార్ అనుపమ కనపర్తి లో,ఎంపీడీఓ వీణవంక లో,ఇప్పలపల్లి గ్రామంలో ఏపీఎం సుధాకర్,బ్రాహ్మణపల్లి లో ఎం ఎస్ సి సి పద్మ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు రైతులు గమనించి ధాన్యం కొనుగోళ్లను ఐకెపి సెంటర్ ద్వారా నిర్వహించాలని కోరారు. రైతులు ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు సహకరిస్తే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందన్నారు సెంటర్ నిర్వాహకులు ప్రస్తుత వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో తార్పాలిన్ కవర్లు ఉంచి రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామిడి శ్రీపతి రెడ్డి,ఎం డి. రషీద్ పాషా, సీసీలు ఎన్. ఆనంద్,ఎస్.తిరుపతి,వి.తిరుపతి,ఎస్.ఘన శ్యామ్ అన్ని గ్రామాల అధ్యక్షురాలు,కొనుగోలు కమిటీ మెంబర్ లు గ్రామాల వి ఓ ఏ. లు, రైతులు ,హమలీలు పాల్గొన్నారు.

కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.

కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

రేగొండ, నేటిధాత్రి

 

రేగొండ మండలం కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీపతి మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా రమేష్, భరత్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ మరియు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కర్ణాకర్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version