చేవెళ్లలో అక్రమ ఫామ్ హౌస్‌ల కూల్చివేతకు ఆదేశాలు

 

మున్సిపల్ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చర్యలు తప్పవు. కందవాడ వార్డు 269 అసైన్డ్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం పనులు ఆపివేశాము. జిల్లా ఉన్నత అధికారులకు రిపోర్ట్ పంపించి కూల్చివేస్తాము.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం.

అసైన్డ్ భూములలో అక్రమ ఫామ్‌హౌస్‌ నిర్మాణం….

అసైన్డ్ భూములలో అక్రమ ఫామ్‌హౌస్‌ నిర్మాణం

* మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్
•కందవాడ 269అసైన్డ్ లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలు
* పనులు ఆపివేసిన టౌన్ ప్లానింగ్ అధికారి
* అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం

చేవెళ్ల,నేటిధాత్రి:

 

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వంటి ప్రాంతాల్లో, నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములలో బహుళ అంతస్తుల భవనాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని కందవాడ వార్డులోని సర్వే నెంబర్ 269 లో సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్ పట్టాలను నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించింది. కాని ఇప్పుడు ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు పాగావేశారు. ప్రభుత్వ అసైన్డ్ పట్టాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నయాన బయానకు కొనుగోలు చేసి ఆ భూముల్లో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ పి.ఓ.టి చట్టానికి విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కందవాడ సర్వేనెంబర్ 269 లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సుమారు 100ఎకరాల అసైన్డ్ భూమి ఉంది.
ఇందులో సుమారు 80శాతం భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వ భూములు అమ్మకూడదన్న నిబంధన ఉన్న, యతేచ్చగా విక్రయిస్తున్నారు. పట్టా భూముల ధరలు కోట్లలో ఉండటంతో, ఐదుకో పదికో చౌక ధరకు ఈ ప్రభుత్వ అసైన్డ్ పట్టా భూములను కొనుగోలు చేసి, కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు.

అసైన్డ్ లో నిర్మాణాలకు అనుమతులు ఎలా..

పట్టా భూముల్లో నిర్మాణాలు చేయాలంటేనే మున్సిపల్ శాఖ నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టాలి. కాని కందవాడలో దర్జాగా అసైన్ భూముల్లో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణదారులు రెవెన్యూ చట్ట నిబంధనలను, అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా, దర్జాగా అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. పి ఓ టి చట్టానికి విరుద్దంగా అమ్మకాలు, కొనుగోలు చేసిన ప్రభుత్వ అసైన్డ్ భూములను పి ఓ టి యాక్ట్
కింద నోటీసులు ఇచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాని రెవెన్యూ శాఖ అధికారులు మండలపరిధిలో ఎక్కడ కఠినంగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారులు కఠినంగా వ్యవహరించకపోవటంతోనే ఇలా అక్రమనిర్మాణాలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ పల్లెలకు విస్తరించటంతో ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా వదలటంలేదు. అసైన్డ్ భూములను మూడవ పార్టీలకు విక్రయించడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ అండతో అసైన్డ్ భూములలో దందాలకు పాల్పడుతున్నారు. కందవాడ రెవెన్యూ మున్సిపల్ పరిది 269 అసైన్మెంట్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై సోమవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం చర్యలు చేపట్టారు. కమిషనర్ వెంకటేశం ఆదేశాలతో చేవెళ్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ అధికారి అమరేందర్ రెడ్డి చర్యలలో భాగంగా ఫామ్ హౌస్ నిర్మాణం పనులను నిలిపివేశారు. అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని నిర్మాణదారులను హెచ్చరించారు.

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ వేగవంతం చేయాలి…

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, అసైన్డ్ భూముల విచారణ, భూ భారతి, 22-ఏ తదితర కీలక అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా దరఖాస్తుల స్థితిని తెలుసుకున్న కలెక్టర్ దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలంటే అధికారులు వచ్చిన దరఖాస్తులు ఆదారంగా క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ రికార్డుల ప్రామాణికతను నిర్ధారిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

నేటిధాత్రి కథనానికి స్పందన

* అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
* అసైన్డ్ భూములపై విచారణ జరిపి అమ్మినట్టు తెలితే నోటిసులిచ్చి భూములు స్వాధీనం చేసుకుంటాం
* అసైన్డ్ భూముల కబ్జా చేస్తే చట్టపర చర్యలు తప్పవు
* చేవెళ్ల తాసిల్దార్ కృష్ణయ్య

చేవెళ్ల, నేటిధాత్రి:

కమ్మెట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 217 లొని ప్రభుత్వ అసైన్డ్ భూములలోనుండి ప్రైవేటు ఫామ్ హౌస్ లకు దారి వేశారన్నా ‘ నేటి ధాత్రి ‘ కథనానికి చేవెళ్ల తాసిల్దార్ స్పందించారు. చేవెళ్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ ఐ మోహన్ కబ్జాకు గురైన అసలు భూములను పరిశీలించారు. ఈ అసైన్డ్ భూములను ఆనుకుని ప్రహరీ గేటు నిర్మించిన ప్రైవేట్ వ్యక్తులకు గేటును తొలగించాలని ఆదేశించారు. దీనిపై సర్వే నిర్వహించి అసైన్డ్ భూముల హద్దులు కనుకుంటాం. ఈ అసైన్డ్ భూములను విక్రయించారన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. విచారణలో అసైన్ భూములు విక్రయించారని తెలితే 9/77 పి ఓ టి చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి భూములను స్వాధీనం చేసుకుంటామని తాసిల్దార్ కృష్ణయ్య తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు బతుకుదెరువు కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూమి ఇచ్చిందని, ఇందులో వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబం జీవనం సాగించాలి తప్ప మరొకరికి విక్రయించేందుకు అధికారం రైతుకు లేదన్నారు.రెవెన్యూలోని అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ అసైన్డ్‌ భూములను ఇతరులకు అప్పగిస్తే దాన్ని సాకుగా చూపి పీవోటీ కింద నేరుగా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు ఉందని స్పష్టం చేశారు. కొంతమంది లీజ్ పేరిట నోటరీ ద్వారా అసైన్డ్ క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు మాదృష్టికి వచ్చింది.ఒకవేళ నిజంగానే అసైన్డ్ భూములు అమ్మినట్టు తెలితే రెవెన్యూ చట్టం ప్రకారం నేరుగా భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version