సజావుగా రైతులకు యూరియా పంపిణీ…

సజావుగా రైతులకు యూరియా పంపిణీ…

రైతు భరోసా పోర్టల్ నుంచే రైతులకు యూరియా

రైతులు ఎవరు అధైర్య పడవద్దు… మండల వ్యవసాయ అధికారి వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు, ప్రైవేటు డీలర్ల ద్వారా కేసముద్రం మండల రైతులకు గ్రామాల వారిగా రైతు భరోసా పోర్టల్ నుంచి రైతుల లిస్టులు
ఒకరోజు ముందు గ్రామాలకు పంపించి మరుసటి రోజు శనివారం సుమారు 2844 బస్తాలను రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ చేయడం జరిగింది.
కేసముద్రం మండల లోని వివిధ యూరియా పంపిణి సెంటర్ల ను మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న పంపిణి విధానాన్ని పరిశీలించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఎవరు యూరియా కోసం ఆందోళన చెందవద్దని మండలానికి కావలసినటువంటి యూరియా రైతులకు విడతలవారీగా తెప్పించి పంపిణీ చేయడం జరుగుతుందని కావున రైతులు ఎవరు అధైర్య పడవద్దని వారు సూచించారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా పంపిణీ చేసే విధానంలో రెండో విడతలో ఉన్నందున త్వరలో యాప్ అందుబాటులోకి వస్తుందందున కేసముద్రం మండలంలోని ప్రతి రైతు గూగుల్ ప్లే స్టోర్ నుండి యూరియా బుకింగ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీసు శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవోలు వ్యవసాయ విస్తరణ అధికారులు జిపిఓ పాల్గొన్నారు.

సహకార సంఘం ద్వారా బీమా చెక్కు పంపిణీ..

సహకార సంఘం ద్వారా బీమా చెక్కు పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ద్వారా బాధిత కుటుంబానికి భీమ చెక్కును డిసిఓ కార్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రారు రాజేశ్వరి చేతుల మీదుగా అందజేశారు.కుందారం గ్రామానికి చెందిన బొమ్మన మధుమోహన్ రెడ్డి ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జైపూర్ లో మృతుడు పంట రుణం తీసుకున్నాడు.అతని పేరుతో భీమా కంపెనీకి సొసైటీ ద్వారా ఇన్సూరెన్స్ చేయించారు.దీనితో రూ2 లక్షల ఇన్సూరెన్స్ బీమా కంపెనీ ద్వారా మంజూరు కాగా మృతునికి నామినిగా ఉన్న అతని తండ్రి బాపురెడ్డికి శనివారం స్థానిక సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ అధికారులు ఏడిసిసి బ్యాంక్ సిబ్బంది చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో ఏడిసిసి బ్యాంక్ మేనేజర్ కోన శ్రీనివాస్,పిఏసిఎస్ సీఈవో డేటి అర్జున్ కుమార్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ సంతోషం, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

రాజ్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మల్లాపూర్ నవంబర్ 3 నేటి దాత్రి

 

కొత్త ధాం రాజ్ పల్లి గ్రామంలో పాక్స్ ఆద్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పుస్పలత నర్సయ్య,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు లు కలిసి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి,పాక్స్ సీఈవో భూమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దం రాధ సుధాకర్ రెడ్డి ,పాక్స్ డైరెక్టర్ నారాయణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం. నర్స రెడ్డి, నిగ రవి,ఏలేటి లింగా రెడ్డి,ఉత్కం.హన్మంతు,రోండ్ల.రాజ రెడ్డి, పతకాల.కిరణ్,సురేష్,ఎల్లా రెడ్డి,నత్తి రాం తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభానికే పరిమితమైన మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం

ప్రారంభానికే పరిమితమైన మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మచ్చ తెచ్చే విధంగా పిఎసిఎస్ నిర్వాకం.

గోదాములు ఓపెన్ చేయడం లేదంటూ సాకు చెపుతున్న సొసైటీ సిబ్బంది

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు కేంద్రం వద్ద చెల్లించేందుకుగాను మార్క్ పెడ్ ద్వారా నర్సంపేట వ్యవసాయ ప్రాథమిక సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో గత నెల 22న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించగా అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. రైతులు మొక్కజొన్న కోసిన నాటి నుండి అకాల వర్షాలుతో అష్ట కష్టాలు పడుతూ వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ.. మొక్కజొన్నలను ఎండబెట్టగా ఆ రైతు కుటుంబాలు మార్కెట్ యార్డు వద్ద ఎప్పుడు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారో అని గత 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంపై కొనుగోలు కేంద్ర నిర్వాహకులైన నర్సంపేట సొసైటీ సిబ్బందిని మొక్కజొన్నల కొనుగోలు అనంతరం వాటిని నిలువ పెట్టేందుకు గోదాములు తెరవడం లేదంటూ చుక్కలు చూపిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ద్వారా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అక్కడే మొక్కజొన్నలను ఆరబోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మహిళా రైతుతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం

చేయించారు.ఐతే ప్రారంభం చేయించేటప్పుడు మహిళా రైతుతో మొక్కజొన్నలను గోనే సంచుల్లో నింపి కాంటా పెట్టినట్లుగా సంబంధిత కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఫోటోలు దింపించుకొని పలు పత్రికలలో ,సోషల్ మీడియాలో ప్రచురణ చేసుకున్నారు. కానీ ప్రారంభం చేసి పది రోజులైనా ఆ మహిళా రైతు బాణోతు శాంత అనే కుటుంబం యొక్క మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మొక్కజొన్నలు అమ్ముకోవడం గమనార్హం.గత 20 రోజుల క్రితం నుండి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్నలు ఎండబెట్టుకున్నాం.వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ మార్క్ పేడ్ సహకారంతో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభం చేయడంతో మాకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశపడ్డాము.కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం అయినప్పడినుండి

సొసైటి వాళ్ళను అడుగుతున్నాము.మొక్కజొన్నలు కొన్న తర్వాత వాటి స్టాక్ ( నిల్వ) చేయడానికి గోదాములు ఇవ్వడం లేదని అందుకు కొనుగోలు చేయడం లేదని నర్సంపేట సొసైటి సీఈఓ రాజు తెలిపారని దుగ్గొండి మండలం రేకంపెల్లి గ్రామానికి చెందిన గాదం లలిత అనే మహిళా రైతు ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ నర్సంపేట నియోజకవర్గ రైతుల శ్రేయస్సు కోరే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం అక్కడికే పరిమితం కావడం ఎమ్మెల్యేకు తీరనిమచ్చ అని పలువురు రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో. మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా. మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం తాడూరులో తడిసిన ధాన్యాన్ని . పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలని. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా. ప్రభుత్వ అధికారులు ఆరబెట్టిన వడ్లపై టార్పిలిన్లుకవర్లు. వరి ధాన్యం తడవకుండా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు అవసరమైన సహాయం చేయాలని. కోరారు. అలాగే మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లిన బిజెపి నాయకులతో ఐకెపి మహిళ వాగ్వాదానికి దిగిందని. 17%. తేమ ఉంటేనే. కొనుగోలు చేస్తామని. వరి ధాన్యాన్ని కలెక్టర్ అధికారులు వచ్చి ఎవరు నేర్పారని బిజెపి నాయకులను ఎదురు.బెదిరించే ప్రయత్నం చేసిందని. తడిసిన ధాన్యాన్ని పాక్స్ ఆధ్వర్యంలో. అయితే కొనుగోలు చేస్తుందా. అని . ఐకెపి మహిళ వాదించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు. కౌన్సిల్ మెంబర్ కుల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. బూత్ అధ్యక్షులు బో ల్గం. భాస్కర్ గౌడ్. ఇటుకల మహేందర్. కన్నె అరుణ్ కుమార్. బక్క శెట్టి రాజేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

అకాల వర్షానికి తడిసిన వడ్లు..

అకాల వర్షానికి తడిసిన వడ్లు

ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాక పోవడంతో రోడ్లపైనే ఆరబోత-బోయిని తిరుపతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్ల పైన ఆరబోసిన వడ్లు రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంతవరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఐకెపి, డిసిఎంఎస్, పిఎస్సిఎస్, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు మొదలు కాకపోవడంతో రైతులు వడ్లను రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఇదే అదునుగా భావించి దళారులు ప్రభుత్వ రేటు కన్నా క్వింటాలకు మూడువందల నుండి నాలుగు వందల తక్కువ రేటుకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాల నుండి కాపాడుకోలేక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగం పైన దృష్టి సారించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసి మిల్లర్ల మాయాజాలం నుండి రైతాంగాన్ని కాపాడవలసిందిగా సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి పక్షాన ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version