కోర్టు ఆదేశాలతో మళ్లీ చైర్మన్ గా మారం రాము
#నెక్కొండ, నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో జాప్యం వల్ల కాలపరిమితి పూర్తయిన సహకార సంఘం చైర్మన్ లకు మళ్లీ కొనసాగించాలని ఆదేశించింది. అయితే వరంగల్ జిల్లా లోని చెన్నారావుపేట, నల్లబెల్లి, నెక్కొండ ,నాచినపల్లి, దుగ్గొండి, సహకార సంఘాల చైర్మన్ లను కొనసాగించుటలో సందిగ్ధం ఏర్పడడంతో ఆయా చైర్మన్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం వీరిని చైర్మన్గా కొనసాగించాలని ఆదేశించడంతో నెక్కొండ సహకార సంఘ చైర్మన్ మారం రాము, గౌరవ సభ్యులతో మంగళవారం సాయంత్రం విధుల్లో చేరారు.