ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమము పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వర్దన్నపేట (నేటిధాత్రి )
వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండలంలోని కట్రీ యాల గ్రామములో, పంచాయతీ కార్యాలయా లో ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమము నిర్వహించడం జరిగింది.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆహ్వానం మేరకు, వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు సూచనల మేరకు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య హాజరై ఓటర్ ముసాయిదా కార్యక్రమంలో పాల్గొని,ఓటర్ ముసాయిదా ను, పంచాయతీ కార్యదర్శి తో కలిసి ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ…
వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ లిస్టును క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బూతు కమిటీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,ఈ నెల 30 వ, తేదీలోప ల పరిశీలించాలని ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు పిలుపు నిస్తున్నాం.
ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుజ్జ రవీందర్ రెడ్డి,ఎండి అక్బర్,నాంపెల్లి రవీందర్,తీగల సునీత గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలికట్టే చిన్న రాజు లు పాల్గొన్నారు.