ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేట వాణిజశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు క్షేత్ర పర్యటనలో (జిజ్ఞాస విద్యార్థుల స్టడీ ప్రాజెక్ట్‌లో) భాగంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇండెల్ మనీ నర్సంపేట శాఖను సందర్శించారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలియజేశారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన ప్రాయోగిక జ్ఞానం విద్యార్థులకు అందించడమే ముఖ్య ఉద్దేశ్యం అని విద్యార్థులు క్షేత్ర పర్యటన ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని విద్యార్థులను ఇలాంటి పర్యటనలు అవసరమని విభాగాధిపతి ఎం.సోమయ్య తెలియజేశారు.ఇండెల్ మనీ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ శ్యామల రాజు మరియు శాఖ సిబ్బంది విద్యార్థులకు ఆర్థిక సేవలు, రుణాల విధానం, బంగారం రుణాలు, కస్టమర్ సేవలు, మరియు శాఖ నిర్వహణ విధానాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. విద్యార్థులు వాళ్లతో మమేకమవుతూ ఆసక్తిగా ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా వాణిజ్య విభాగం తరఫున ఇండెల్ మనీ నర్సంపేట శాఖ మేనేజర్ శ్యామల రాజు గారికి మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ విద్యా పర్యటనకు అనుమతి ఇచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గారికి వాణిజ్య విభాగం తరుపున వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం సోమయ్య ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన పెరిగి, భవిష్యత్తులో వారి విద్యా ప్రయాణానికి ఉపయోగపడే విలువైన అనుభవం లభించిందని డాక్టర్ రాజీరు తెలియజేశారు.

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు..

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు

ఉత్సాహంగా పంట చేళల్లో తిరిగిన విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శనివారం వ్యవసాయ పంటలను పరిశీలించారు.డిసెంబర్ 23 న ప్రపంచ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట,నాగుర్లపల్లి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.ఈసందర్భంగా కూరగాయల పంటలను,మిర్చి తదితర పంటలను విద్యార్థులు పరిశీలించి వాటియొక్క సాగు చేసే విదానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంటచేనులో కలియ తిరిగారు.గ్రామం నుంచి ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి, పంటచేను వద్ద ట్రాక్టర్ పై విద్యార్థులు కూర్చోని ఆనందంగా గడిపారు.

ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ డిసెంబర్ 23 న రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా విద్యార్థులకు వ్యవసాయ పంటల పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు, రైతుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మిధున్, గుడిపాటి సౌజన్య, ఫీల్డ్ విజిట్ ఇంచార్జిలు ఆస్య , నూకల నాగ లక్షీ , ఉపాధ్యాయిని లు కుండె అనిత, శ్రీలక్ష్మీ, కావ్య,యాంకి , దేవిక, రాధిక పాల్గొన్నారు.

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు..

వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు

ఉత్సాహంగా పంట చేళల్లో తిరిగిన విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శనివారం వ్యవసాయ పంటలను పరిశీలించారు.డిసెంబర్ 23 న ప్రపంచ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట,నాగుర్లపల్లి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.ఈసందర్భంగా కూరగాయల పంటలను,మిర్చి తదితర పంటలను విద్యార్థులు పరిశీలించి వాటియొక్క సాగు చేసే విదానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంటచేనులో కలియ తిరిగారు.గ్రామం నుంచి ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి, పంటచేను వద్ద ట్రాక్టర్ పై విద్యార్థులు కూర్చోని ఆనందంగా గడిపారు.ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ డిసెంబర్ 23 న రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా విద్యార్థులకు వ్యవసాయ పంటల పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు, రైతుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మిధున్, గుడిపాటి సౌజన్య, ఫీల్డ్ విజిట్ ఇంచార్జిలు ఆస్య , నూకల నాగ లక్షీ , ఉపాధ్యాయిని లు కుండె అనిత, శ్రీలక్ష్మీ, కావ్య,యాంకి , దేవిక, రాధిక పాల్గొన్నారు.

పలిమల మహా ముత్తారంలో సివిల్ సర్వీస్ అధికారుల పర్యటన

పలిమల మహా ముత్తారంలో సివిల్ సర్వీస్ అధికారుల పర్యటన

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా పరిధిలోని పలిమెల, మహా ముత్తారాం మండలాల్లో ఈ నెల 8 నుండి 15వ తేది వరకు సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం పర్యతించనున్నందున అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్సోరి నుండి మొత్తం 12 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నారని, పలిమెల, మహా ముత్తారం మండలాల్లో వసతి, భోజన సౌకర్యాలు ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ఉంటుందని సంబంధిత శాఖలు విభాగాలవారీగా నోట్స్ సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల ఫీల్డ్ విజిట్ అనంతరం అధికారులు పర్యటనపై ఫీడ్ బ్యాక్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కోసం నివేదికలను తయారుచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version