పంట నష్టం కౌలు చట్టాలపై రైతులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు…

పంట నష్టం కౌలు చట్టాలపై రైతులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండలంలోని, కట్రీ యాల గ్రామములో ఉన్న రైతు వేదిక నందు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ చంద్ర ప్రసన్న గారు హాజరై రైతులకు పంట నష్టం,భూమి పట్టా దారు , ఇనామ్ భూములు, కౌలు రైతు చట్టాల పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమములో డిపెన్స్ కౌన్సిల్ మెంబర్ సురేష్,ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ శృతి,వర్ధన్నపేట తహిసిల్ధర్ విజయ సాగర్, ఎ.ఓ విజయ్ కుమార్, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,ఎస్సై సాయిబాబు,రైతులు పాల్గొనడం జరిగింది.

రైతులకు వయ్యారిభామ నిర్మూలనపై అవగాహన…

రైతులకు వయ్యారిభామ నిర్మూలనపై అవగాహన
చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలంలోని మూడపెల్లి గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వయ్యారిభామ కలుపు మొక్కల నిర్మూలన వారోత్సవాల సమావేశం ఏర్పాటు చేసారు, మహిళా వ్యవసాయ కళాశాల కరీంనగర్ రావెప్ విద్యార్థినులు రైతులకు వయ్యారిభామ కలుపు మొక్క నివారణపై, వయ్యారిభామ వలన మానవులకు, జంతువులకు, కలిగే ఆరోగ్య సమస్యల గురించి మరియు పంటలకు కలిగే నష్టాల గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిఖిత , భాగ్యశ్రీ , పూజశ్రీ , దీపిక , అనిత ,అంజలి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version