సరిహద్దు బ్రిడ్జ్ పరిశీలన

సరిహద్దు బ్రిడ్జ్ పరిశీలించిన కామారెడ్డి పీఆర్డీఈ

నిజాంపేట: నేటి ధాత్రి

జిల్లాలో సరిహద్దులో గల బ్రిడ్జి ప్రమాదంలో ఉంది. నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామం నుండి ఇస్సానగర్ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న బ్రిడ్జ్ గత కొన్ని నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కింది భాగం పూర్తిగా కొట్టుకుపోయి కూలిపోయే దశలో ఉంది. దీంతో స్పందించిన కామారెడ్డి పీఆర్డీఈ స్వామిదాస్ బ్రిడ్జినీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్రిడ్జ్ కింది భాగం పూర్తిగా కొట్టుకుపోవడంతో ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్ళవద్దని ఆయన హెచ్చరించారు. సమస్యను వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాతూరి బాల్ రెడ్డి, నందగోకుల్ సర్పంచ్ పాతూరి భాను ప్రకాష్ రెడ్డి, ఇస్సానగర్ సర్పంచ్ ధర్మాగారి రాజా గౌడ్, కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు.

దళారులను నమ్మి మోసపోవద్దు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
డిపిఎం యాదయ్య.

నిజాంపేట: నేటి ధాత్రి

 

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలని డిపిఎం యాదయ్య అన్నారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. 48 గంటలలో రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. అకాల వర్షాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఏం అశోక్, సీసీ వెంకటరాజం, రవీందర్, నిర్వాహకులు బురాని మంగమ్మ, వాణి, రజిత రైతులు ఉడేపు మహేష్, అందే స్వామి, పిట్ల రమేష్ తదితరులు ఉన్నారు.

ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభం…

ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభం

నిజాంపేట: నేటి ధాత్రి

 

ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఐకెపి, రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. సీరియల్ పద్ధతిలో కొనుగోలు జరపడం జరుగుతుందని పేర్కొన్నారు. తేమశాతం 14 ఉండేలా చూడాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బురాని మంగమ్మ, వాణి, రజిత, కావేరి, రైతులు చాకలి రవి, అందే స్వామి, మ్యాదరి ప్రభాకర్, పట్ల స్వామి, బోయినీ బాలరాజు, రమేష్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version