పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..నోడల్ అధికారులకు ఆదేశాలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా, నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.బుధవారం వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ పై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన లతో కలసి ఆర్డీఓ లు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, 2754 వార్డు సభ్యుల ఎన్నికలకు 3 విడతల్లో ఈ నెల 27, 30 మరియు డిసెంబర్ 3 తేదీల్లో నామినేషన్ స్వీకరణ ఉంటుందని, నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలన్నారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని.. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Panchayat Elections

ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువుల సీజ్ చేసిన సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. , జిల్లాలోని చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని అన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు రిపోర్ట్ లు నిర్ణిత ఫార్మాట్ లో సమర్పిచాలని తెలిపారు.జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, తదితర విభాగాల వారీగా నోడల్ అధికారులను నియమించామని,జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఎన్నికల నిర్వహణ జరగాలి. శాంతియుత, స్వేచ్ఛాత్మక మరియు పారదర్శక ఎన్నికలకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు.ఈ సమావేశం లో ఆర్డీఓలు సుమా రెడ్డి, ఉమారాణి, ఎన్నికల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఎంపిడివోలు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.

కార్తీక్ వైద్యం కోసం లక్ష రూపాయల సహాయం

కార్తీక్ వైద్య ఖర్చులకు లక్ష అందజేత

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పేద యువకుడు కార్తీక్ అనారోగ్యం పాలవగా, మెరుగైన వైద్యం కోసం సుమారు ఐదు లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కార్తీక్ కుటుంబం తమ నిరుపేద ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన చెందారు.​ ఈవిషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక తాజా మాజీ ఎంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ తక్షణమే స్పందించి, కార్తీక్‌కు సహాయం అందించడానికి దాతల సహకారం కోరారు. ​గుర్రం దేవిక రాజశేఖర్ చేసిన విజ్ఞప్తికి స్థానిక దాతలు, ప్రజలు ఉదారంగా స్పందించి తమ వంతు సహాయం అందించారు. ​దాతల నుంచి మొత్తంగా ఒక్క లక్ష రూపాయాలు విరాళంగా సమకూరింది.​ ఈవిరాళాన్ని రామడుగు మండల విద్యాశాఖాధికారి రంగనాథ శర్మ చేతుల మీదుగా కార్తీక్ కుటుంబసభ్యులకు అందజేశారు.​ ఈసందర్భంగా మాజీ ఏంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ మాట్లాడుతూ మానవత్వంతో స్పందించి కార్తీక్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసహాయం కార్తీక్ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమేష్, పి.డి,అనపురం తిరుపతి, తడగొండ రాజు, నాగం చంద్రమోహన్, చిలుముల శ్రీను, లక్ష్మణ్, నరసింహచారి, రాజమల్లయ్య, జనార్ధన్, సాయిలు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం భరోసా

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర రైతు వేదికలో మంగపేట గ్రామానికి చెందిన నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు సంబంధించిన పనులు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలోనే డెబ్బై శాతం పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు, వారికి ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు, రిజర్వాయర్లో తట్టెడు మట్టిని కూడా తీయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాను నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించిన సమయంలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇరవై మూడున్నర కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, నారాయణపూర్, చర్లపల్లి, ఇస్తారిపల్లి గ్రామాల్లో నిన్ను కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.

మొగుళ్లపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

* ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం*

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత & అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద
76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి
నివాళులర్పించారు అనంతరం మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం వల్ల నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో ఉన్న నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగని రాయడం జరిగింది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో మనిషిగా గుర్తించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు సమాన హక్కు కల్పించింది కుల మతాలకు అతీతంగా సమాజంలో ఉన్న మానవులంతా ఒకటేనని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఆరోజు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకుండా ఉండి ఉంటే భారత దేశంలోని ప్రజలు ఈ విధంగా ఉండేవారు కాదన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి రాజు, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్ తదితరులు పాల్గొన్నారు

స్వతంత్ర అభ్యర్థిగా గీత పోటీ

సూర్యనాయక్ తండా గ్రామ ప్రజలకు సేవలు చేయడమే నా లక్ష్యం

ఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: జర్పుల గీత

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా సూర్య నాయక్ తండాకు ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెం డెంట్ గా పోటీ చేయునట్లు జర్పులగీత ప్రకటించారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించి నట్లు తెలిపారు. గ్రామ అభి వృద్ధి, పారదర్శక పాలన, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధా న్యతలు అని పేర్కొన్నారు గ్రామానికి అవసరమైన ప్రతీ పనిని సాధించేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. నిరంతర ప్రజా సేవ చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజల హృదయా లలో నిలవడమే నా లక్ష్యం అంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. గ్రామ ప్రజల అభి మానం, సహకారమే తమ విజయం నిర్ణయిస్తుందని అన్నారు.

సీజనల్ వ్యాధులపై అవగాహన శిబిరం

సీజనల్ వ్యాధులపై
జాగ్రత్తలు పాటించాలి

నిజాంపేట: నేటి ధాత్రి

 

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. నిజాంపేట మండలం రజక్ పల్లి గ్రామంలో బుధవారం ఏఎన్ఎం అరుణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోరువెచ్చటి నీటిని త్రాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.

చిట్యాల పోలీసుల చేత తిరిగొచ్చిన మొబైల్

పోగొట్టుకున్న మొబైల్ ను భాదితునికి అందజేసిన ఎస్సై హేమలత.

చిట్యాల, నేటిదాత్రి

 

చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్య పల్లె గ్రామానికి చెందిన మర్రి రమేష్ సంవత్సరం క్రితం మార్గమధ్యంలో తన శామ్సంగ్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా చిట్యాల పోలీసులు రికవరీ చేసిబుధవారం రోజున బాధితునికి అందజేశారు.
బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ లాల్ సింగ్ అట్టి మొబైల్ ఫోన్ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఆ ఫోన్ గుర్తించి, చిట్యాల ఎస్సై హేమ లత బాధితులడి తిరిగి అందజేశారు.
తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి ఇప్పించినందుకు బాధితులు చిట్యాల ఎస్సైహేమలత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బాలాజీ స్కూల్‌లో సంవిధాన్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్ లో సంవిధాన్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్ (సీబీఎస్ఈ )లో సంవిధాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ వేషధారణతో వచ్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు- ప్రజల బాధ్యత గురించి చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం దేశ పౌరులకు అనుగుణంగా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు. ప్రజలందరికీ న్యాయం ,స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం నేడు ప్రత్యేకతని ,భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని రూపశిల్పి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యాంగా మారడానికి పునాదయిందని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విలువలు, బాధ్యతలపై ప్రజలలో అవగాహన పెంచడం లక్ష్యంగా తోడ్పడుతుందని గుర్తు చేశారు.స్కూల్( సీబీఎస్ఈ) ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015 ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు.అనంతరం ఎన్.సి.సి పదవ బెటాలియన్ థర్డ్ ఆఫీసర్ ఎం. డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ప్రజల బాధ్యత పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించినారు.ఈకార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు మరియు ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అనిల్ కుమార్ ,సతీష్ ,అర్లయ్య, చందు, కవిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ అవతరణ వేడుకలు ఘనంగా

ఘనంగా రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాలలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. అనంతరం కమిషనర్ గద్దె రాజు మాట్లాడారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము, ప్రాముఖ్యత, భారతదేశ పౌరులందరూ విధిగా పాటిస్తూ దేశం యొక్క సమగ్రతను పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేనేజర్ సతీష్, రెవెన్యూ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సుభ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు వైభవంగా

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం గుడి ఆవరణలో గల అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి పూజలు వైభవంగా సాగాయి. అయ్యప్ప దీక్ష పరులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప పూజ, నాగ దేవత లకు అభిషేకాలు నిర్వహించారు. ఈ మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు సుబ్రహ్మణ్య షష్టిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు.శివ పార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించడానికి ఆవిర్భవించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడొచ్చని వేద పండితులు చెబుతున్నారు. అంబ ప్రసాద్, శరత్ అయ్యగారు, గురు స్వాములు గడ్డం రమేష్,కట్కూరి శ్రీనివాస్,లంక రామస్వామి, నట రాజ్,వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, కన్నె స్వాములు, కత్తి స్వాములు,గంట స్వాములు, గద స్వాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల రాంలింగా రెడ్డి ఆధ్వర్యంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో స్వయం సహాయక సంఘం మహిళలకు ‘పుట్టింటి సారై’ మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

డిసిసి అధ్యక్షుడిని కలిసిన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు

డిసిసి అధ్యక్షుడిని కలిసిన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి నూతన డీసీసీ అధ్యక్షుడుని మర్యాద పూర్వకంగా కలిసిన కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అసోసియేషన్ కమిటీ సభ్యులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో నూతనంగా ఎన్నికైనా డీసీసీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు
ఈ కార్యక్రమంలో కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు
శిరూప అనిల్, ఉపాధ్యక్షుడు నాగపూర్ సమ్మయ్య గౌడ్ , ఆకుల శ్రీనివాస్ సెక్రెటరీ, రేకుల కుమార్, వెంకటాద్రి, మేనం తిరుపతి, చిర్ర రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐఎన్టియుసి, ఏఐటియుసి, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉద్యోగులకు గ్రాడ్యు టీ ప్రయోజనాలు తగ్గించడం, ట్రేడ్ యూనియన్ హక్కులు కాలరాయడం, సమ్మెలపై ఆంక్షలు విధించడం, 12 గంటల పని విధానాన్ని పెంచడం, భద్రత ప్రమాదాలు పెరగడం, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపునకు శ్రీకారం చుట్టడం వంటి పలు అంశాలపై సింగరేణి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జేఏసి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రఘు, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం…

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి వేస్తుందని, కార్మికులకు నష్టం కలిగించే నూతనంగా తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి షేకు హుస్సేన్, టీబీజీకేఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడి తల సమ్మయ్యలు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య స్మారక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడుతూ..
అనేక సంవత్స రాలుగా కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న
29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక సంఘాల ప్రమేయం లేకుండానే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను ఏర్పాటు చేయడం యావత్ కార్మిక లోకానికి తీరని నష్టమని అన్నారు.బిజెపి అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 25, 26న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బి ఎం ఎస్ తప్ప భారీ ప్రదర్శనలకు ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా మంగళవారం భూపాలపల్లి ఏరియాలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అనంతరం నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ ల ప్రతులను దహనం చేశారు. నేడు కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా 26 న జిల్లా కలెక్టర్, ముందు ఉదయం 10 :00 గంటలకు ధర్నా నిర్వహించి, సాయంత్రం 4 గంటల కు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 26న జరిగే ఆందోళన పోరాటాలలో కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు దేవరకొండ మధు, బాషనపల్లి కుమార్, బి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి…

మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లక్షేట్టిపేట,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్,మండలాల తహసిల్దార్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తుందని,ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు.మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం,డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మందమర్రి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని,మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని 1 వేయి 618 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 43 లక్షల 61 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు

జైపూర్,నేటి ధాత్రి:

ప్రభుత్వం మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీలేని రుణాల పథకం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు.మంగళవారం జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో చెన్నూర్ నియోజకవర్గంలోని మండలాల తహసిల్దార్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యాపార రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,మహిళ సంఘం ప్రతినిధి మాలతి, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం మండల ఉపాధ్యాయుల ఎస్ జి టి అసోసియేషన్ ఏర్పాటు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T163026.335.wav?_=1

 

ఇబ్రహీంపట్నం మండల ఉపాధ్యాయుల ఎస్ జి టి అసోసియేషన్ ఏర్పాటు

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలో పనిచేస్తున్న ఎస్ జి టి ఉపాధ్యాయుల సమస్యలు మరియు హక్కుల పరిరక్షణ కోసం ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్( పి టి ఏ) ను ఏర్పాటు చేయడం జరిగింది! గత చాలా సంవత్సరాల నుండి ఎస్ జి టి ఉపాధ్యాయులకు రావాల్సిన ఎమ్మెల్సీ ఓటు హక్కు గాని, పదోన్నతులు లేకుండా ఎస్ జి టి గా పదవి విరమణ చేయడం గాని , కేవలం ప్రాథమిక పాఠశాల లోనే విద్యార్థులు నిష్పత్తి ని పరిగణలోకి తీసుకోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యారంగ వ్యవస్థ కోసం శ్రమ దోపిడీ కి గురవుతున్న ఎస్ జి టి ల కోసం, తమ భవిష్యత్తు కోసం వాడుకుంటున్న వివిధ ఉపాధ్యాయ సంఘాలతో విసిగి తామే ప్రత్యేకంగా ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని అధ్యక్షులు శ్రీ అల్లాడి హరి ప్రసాద్ గారు అన్నారు! ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా అల్లాడి హరి ప్రసాద్ గారిని,ఉపాధ్యక్షులుగా శ్రేమతి సిహెచ్ వాణి , జి. విజయ లక్ష్మి ని, ప్రధాన కార్యదర్శి గా శ్రీ అల్లాడి కృష్ణ ప్రదీప్ ని, సంయుక్త కార్యదర్శి గా బి. గంగ మణి ని మరియు జి. రఘునాథ్ ని , కోశాధికారి గా జి. ప్రవీణ్ కుమార్ గారిని, ఆర్గనైసింగ్ సెక్రటరీ గా సిహెచ్. గంగ్గయ్య, శ్రీ A. నరేష్, జి. విశాల్, టీ. వేణుగోపాల్, ఆర్. శివ కుమార్, జి. శ్రీధర్, బి. కల్పన,ను మరియు అడ్వైసర్ లుగా అరిసె శంకర్, వి. వేంకటేశ్వర్ రావు ను మండలం లోని ఎస్ జి టి ఉపాధ్యాయులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారని.

ఎన్నికల కోసం బిజెపి తపన

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందాలీ మండల బిజెపి అధ్యక్షులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల బిజెపి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో పలు విషయాలపై చర్చించి వివరాలు వెల్లడించిన మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు సర్పంచ్ ఎన్నికల్లో మరియు వార్డ్ మెంబర్స్.పోటీ చేయడం కొరకు విధి విధానాల గురించి చర్చించడంతోపాటుప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించాలని అలాగే ప్రతి ఇంటికి వెళ్లి 420 హామీలు వాటి మోసాలను వివరించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి. బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇతర పార్టీల అందరికీప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి సంస్కరణ గురించి ప్రతి ఇంటికి గడప.గడపన తెలియజేయాలని ప్రతి కార్యకర్త తమ కర్తవ్యం గా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటిరాజు. మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోసినీ వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్.బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మోర్చా అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్చార్జులుమహిళా బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

కొనుగోలు కేంద్రాలు పారదర్శంగా వ్యవహరించాలి.

కొనుగోలు కేంద్రాలు పారదర్శంగా వ్యవహరించాలి.

#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం తెచ్చే రైతుల పట్ల సమన్వయం పాటించి కొనుగోలు చేయాలని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వి ఎఫ్ జి సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనసులు పొందాలని ఆయన అన్నారు. రైతులు దళారులు వద్ద మోసపోకుండా ప్రభుత్వ ఆమోదిత పొందిన కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించరలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ దామోదర్, ఏవో బన్నరజిత, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, డైరెక్టర్లు మార్తా మార్కండేయ, మంద రాజిరెడ్డి, లింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్, సభ్యులు నాన బోయిన రాజారామ్, వెంగల్ దాస్ రమేష్, గుండాల శ్రీశైలం, గోనె ల నరహరి, తిరుపతి రెడ్డి, ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, పురుషోత్తం సురేష్, ఏఈఓ శ్రీకాంత్, సిబ్బంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version