శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రసాదాలు

°శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
శ్రీవారి ధనుర్మాస ప్రసాదాలు..

*భక్తులకు ప్రతి శనివారం భోజనాలు…

తిరుపతి(నేటిధాత్రి:

 

ధనుర్మాసోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఇచ్చేటువంటి ధనుర్మాస ప్రసాదాలను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం శ్రీవారి భక్తులు జగన్నాథం మిత్ర బృందం ప్రసాదాలను పంచిపెట్టారు. శనివారం శ్రీ కోదండరాముల వారి గుడి వెనక ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరం వద్ద ప్రతి శనివారం శ్రీవారి భక్తులు జగన్నాథం దూడల జయగోపాల్ ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ శనివారం దాతగా డాక్టర్ రామబాన రమేష్ స్వామి అన్న ప్రసాదాలను పంచిపెట్టారు . ఈ సందర్భంగా టిడిపి బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు మరియు శ్రీవారి భక్తులు జగన్నాథం మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పదమైన రోజున శనివారం రోజున శ్రీవారి ఆలయం నుంచి ధనుర్మాస ప్రసాదాలను తెప్పించి భక్తులకు పంచిపెట్టామని శ్రీవారి పాదాల చెంత ఉన్న భక్తులందరూ ఆకలితో ఉండకూడదని ఈ ఒక్క రోజైనా అందరికీ భోజనాలు అందించడం ఆ దేవుని అనుగ్రహంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ గోవింద నామాలను జపిస్తూ ఆనందంగా అన్న ప్రసాదాలను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగన్నాథం మిత్రబృందం ప్రముఖ కళాకారులు శ్యాంబోల హరి, వారాహి డెవలపర్స్ ఏ.సునీల్ కుమార్ , శివాజీ , తదితరులు పాల్గొన్నారు .

చిన్నచెల్మెడలో దుర్గాభవాని జాతర ఉత్సవాలు

చిన్నచెల్మెడలో దుర్గాభవాని జాతర: 12 నుంచి 16 వరకు వైభవంగా ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ దుర్గాభవాని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రుద్ర గాయత్రి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

12న సోమవారం పీర్ల గంధం, 13న మంగళవారం బేతాళ స్వామి పూజలు, 14న బుధవారం గ్రామ దేవతలకు పూజలు, ప్రవచనాలు, భజన కార్యక్రమాలు, 15న గురువారం బండ్లు, బోనాలు, 16న శుక్రవారం దుర్గామాత కళ్యాణం, పెద్ద పూజలు, గౌరంగాలు ఉంటాయని వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో అంగారక చతుర్థి సందడి…

రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో అంగారక చతుర్థి సందడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జనవరి 6, 2026న సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రేజింతల్ గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు స్వామివారికి అభిషేకం, అలంకరణ, పుష్పార్చన, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.

ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చ కులు ఆరుట్ల కృష్ణమాచార్య ప్రత్యేక పూజలు చేసినారు అర్చకులు మాట్లాడుతూ నెలకు రెండు చొప్పున ఒక సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయని అందులో అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి లతో సమాన మని అందుకోసమే ఈ పర్వది నాన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో కార్య క్రమంలో దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి చిందంరవి, వినుకొండ శంక రాచారి,సామల శంకర్ స్వా ములు కందగట్లరమేష్ సామలనాగరాజు,వనం విశాల్ నామనిశివ,కొత్తపెళ్లి రవీందర్ భాసని బాలకృష్ణ మామిడి రాజు మార్తసుమన్ గట్టు కిషన్ సురేష్ గన్నువేణు, కాంబత్తుల ప్రకాష్, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సభ్యులు .

ప్రత్యేక పూజలు

వనపర్తి నేటిధాత్రి.

 

వనపర్తి జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథ శర్మ,ఆలయ పురోహితులు ఆశీర్వదించారు. పూజలో వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 33 వ వార్డు ఎస్ ఎల్ ఎన్ మీడిదొడ్డి రమేష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు వనపర్తి టౌన్ ఎస్. ఐ హరి ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రమేష్ కన్నా స్వామి శబరిమల పాదయాత్ర పూర్తి

శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న స్వామికి ఘన సన్మానం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ విజయగణపతి ఆలయంలో అయ్యప్ప దీక్షలో భాగంగా మాల ధరించి పాదయాత్ర ద్వారా యాత్రను పూర్తి చేసుకున్న రమేష్ కన్నా స్వామిని ఆలయ అయ్యప్ప బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ గత అక్టోబర్ నెలలో మాల ధరించి పాద యాత్రతో అయ్యప్ప స్వామిని దర్శించుకొని పట్టణానికి రావడం శుభకరమన్నారు. ఇప్పటికి ఆరుసార్లు పాదయాత్ర చేసిన రమేష్ కన్నా మరో 14 సార్లు యాత్రను దిగ్విజయం చేయాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో స్వాములు కుమార్ స్వామి, రమేష్ సదానందం, దేవేందర్ చారి, శ్రీధర్ రెడ్డి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

సుభ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు వైభవంగా

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం గుడి ఆవరణలో గల అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి పూజలు వైభవంగా సాగాయి. అయ్యప్ప దీక్ష పరులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప పూజ, నాగ దేవత లకు అభిషేకాలు నిర్వహించారు. ఈ మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు సుబ్రహ్మణ్య షష్టిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు.శివ పార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించడానికి ఆవిర్భవించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడొచ్చని వేద పండితులు చెబుతున్నారు. అంబ ప్రసాద్, శరత్ అయ్యగారు, గురు స్వాములు గడ్డం రమేష్,కట్కూరి శ్రీనివాస్,లంక రామస్వామి, నట రాజ్,వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, కన్నె స్వాములు, కత్తి స్వాములు,గంట స్వాములు, గద స్వాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version