ఘనంగా రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాలలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. అనంతరం కమిషనర్ గద్దె రాజు మాట్లాడారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము, ప్రాముఖ్యత, భారతదేశ పౌరులందరూ విధిగా పాటిస్తూ దేశం యొక్క సమగ్రతను పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేనేజర్ సతీష్, రెవెన్యూ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
