మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి…

మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లక్షేట్టిపేట,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్,మండలాల తహసిల్దార్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తుందని,ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు.మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం,డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మందమర్రి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని,మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని 1 వేయి 618 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 43 లక్షల 61 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు

జైపూర్,నేటి ధాత్రి:

ప్రభుత్వం మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీలేని రుణాల పథకం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు.మంగళవారం జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో చెన్నూర్ నియోజకవర్గంలోని మండలాల తహసిల్దార్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యాపార రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,మహిళ సంఘం ప్రతినిధి మాలతి, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మృతి పట్ల సంతాపం…

మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మృతి పట్ల సంతాపం.

◆:- సంగారెడ్డి జిల్లా జమియత్ ఉలేమా కోశాధికారి హఫీజ్ ముహమ్మద్ అక్బరుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ జమియత్ ఉలేమా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మృతిపై, జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి కోశాధికారి హఫీజ్ ముహమ్మద్ అక్బరుద్దీన్ ఒక సంతాప ప్రకటన విడుదల చేస్తూ, మౌలానా హఫీలా పీర్ షబ్బీర్ అహ్మద్ మృతి పట్ల తన తీవ్ర విచారాన్ని మరియు విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ మత పండితుడు మరియు దేశ నాయకుడిగా మౌలానాను మరియు ఆయన చేసిన అత్యుత్తమ సేవలను ఇస్లామిక్ దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు. ముస్లింల విద్యా, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం మౌలానా షబ్బీర్ అహ్మద్ సాహిబ్ ఎల్లప్పుడూ సభలకు ప్రభావవంతమైన స్వరాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరణించిన వారిని క్షమించి, అతనికి స్వర్గంలో స్థానం ప్రసాదించాలని మరియు అతని కుటుంబానికి సహనాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version