వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం గుడి ఆవరణలో గల అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి పూజలు వైభవంగా సాగాయి. అయ్యప్ప దీక్ష పరులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప పూజ, నాగ దేవత లకు అభిషేకాలు నిర్వహించారు. ఈ మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు సుబ్రహ్మణ్య షష్టిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు.శివ పార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించడానికి ఆవిర్భవించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడొచ్చని వేద పండితులు చెబుతున్నారు. అంబ ప్రసాద్, శరత్ అయ్యగారు, గురు స్వాములు గడ్డం రమేష్,కట్కూరి శ్రీనివాస్,లంక రామస్వామి, నట రాజ్,వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, కన్నె స్వాములు, కత్తి స్వాములు,గంట స్వాములు, గద స్వాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
