నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

◆-: మహిళా సర్పంచ్ స్థానంలో వారి కుటుంబ సభ్యుల పెత్తనం ఏంటి

◆-: ఎంపీడీఓ షగుప్త ఇర్ఫాత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ – నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండల్ ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తదితర కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా ప్రోటోకాల్ ను పాటించాలని, ప్రోటోకాల్ ను ఉల్లంఘించి పనులు చేపడితే ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని న్యాల్కల్ మండల పరిషత్ అభివృ ద్ధి అధికారిణి షాగుప్త ఇర్ఫాత్ స్పష్టం చేశారు. ఓ ప్రకటన విడుదలaక్రమాలను చేపట్టాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానంలో వారి వారి కుటుంబ సభ్యులు, అధికార, విపక్ష పార్టీ శ్రేణులు, నాయకులు,తదితరులు తాజాగా ఎన్నికైన సర్పంచులకు బదులుగా ఇతరులు.. ప్రోటోకాల్ ను ఉల్లంఘించి ప్రారంభోత్సవాలు చేపడితే ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులపై శాఖా పరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయ తీరాజ్ శాఖాధికారులకు నివేదికలు పంపనట్లు పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రోటోకాల్ ను ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల సర్పంచులు తప్పనిసరిగా నియమావళిని అనుసరించాలని ఆదేశించారుa

గ్రామక్య సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం.

గ్రామక్య సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శ్రీ గణేష్, శాలిని మిశ్రా, ఝాన్సీ, స్వశక్తి గ్రామక్య సంఘాల సభ్యులు మరియు ఐకెపి,సిసి రమణాదేవి ఆధ్వర్యంలో గురువారం రోజున సర్పంచి తౌటం లక్ష్మి ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ ని మరియు వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ మాట్లాడుతూ మహిళ సంఘాలు పొదుపు ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు, అనంతరం ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆర్థికంగా బలోపేతం కావాలిని మహిళా సాధికారత సాధించాలని వారికోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందని అన్నారు, అనంతరం సీసీ రమణా దేవి మాట్లాడుతూ చిట్యాల గ్రామైక్య సంఘాల మహిళలు సమావేశాలు పెట్టుకోవడానికి భవన నిర్మాణం కోసం స్థలం కావాలని కోరగా సర్పంచి ఉప సర్పంచ్ సానుకూలంగా స్పందించి గ్రామంలో సర్వే చేయించి స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో
ఇంచార్జీ ఎపిఎం రాజేందర్,శ్రీగణేష్ వివో, ఝాన్సీ వివో,శాలిని మిశ్రా వివో స్వశక్తి వివో ల అధ్యక్షులు సుమలత, ఉమ,కల్పన, అనూష కార్యదర్శులు సంధ్య, అనూష,శారద, వివో లీడర్లు సుజాత, మౌనిక, వివో ఏ లు షాహ్నాజ్ ,లత, రామ్ చందర్ మరియు సంఘాల లీడర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

దేశ సమగ్రతకు ఉక్కు మహిళ ఇందిర గాంధీ..

దేశ సమగ్రతకు ఉక్కు మహిళ ఇందిర గాంధీ

పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

 

పరకాల,నేటిధాత్రి

 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి,దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని వారి సేవలను దేశంలోని పేదలకు భూములను పంచి, నిరుపేదలకు ఇండ్లు కట్టించిన ఘనత ఇందిరా గాంధీది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,చిన్నాల గోనాథ్,బండి సదానందం,మార్క రఘుపతి గౌడ్,బొచ్చు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కోసి నేతలకు తినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు. ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు. గత ప్రభుత్వ పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగు అయిందని, కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత గృహ విద్యుత్ అందించి అండగా నిలిచిందన్నారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు…

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు

అభివృద్ధికి డోకా లేదు

ఇక నుంచి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారని తెలిపారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అక్కడి ప్రజలు నిరూపించారనీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ కు రాజేందర్ రావు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి సింపతి ఏమాత్రం పని చేయలేదని ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం రికార్డని రాజేందర్రావు అన్నారు. నవీన్ యాదవ్ అతని తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేశారనీ, వాటిని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టారని బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి జూబ్లీహిల్స్ లో అన్ని వర్గాల ప్రజలు మైనార్టీలు సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీ యమని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తారని రాజేందర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు పునరావృతం అవుతాయనీ, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని రాష్ట్రంలో తిరుగులేదని రాజేందర్రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు…

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం పైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులుమంత్రులు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సానుభూతిపరులను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనకు పట్టం కట్టి వారికి మరింత బలం చేకూర్చాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

యూరియా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

యూరియా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

రాయపర్తి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన..తనిఖీలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

 

 

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘాల, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను మంగళవారం
కలెక్టర్ డాక్టర్ సత్య శారద వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.దుకాణాల్లోని యూరియా, ఇతర ఎరువులు నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా సక్రమంగా జగేటట్లు చూడాలన్నారు.

 

 

వ్యవసాయ సంఘం వారు వారి సొసైటీల ఎదుట ఎక్కువ జనం ఉండకుండా ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగానే ప్రకటిస్తూ టోకెన్లు అందజేసి యూరియా పంపిణీ మేనేజ్మెంట్ చేయాలన్నారు.ఈ సందర్భంగా రైతులకు స్వయంగా కలెక్టర్ సత్య శారద యూరియా బస్తాలను అందజేశారు.మన జిల్లా రైతులకు మాత్రమే యూరియా అందేటట్లు,పక్క జిల్లాకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతు పాస్ పుస్తకం చూసి ఎవరికి ఎంత యూరియా కావాలో అంత తగు మోతాదులోనే ఇవ్వాలన్నారు.యూరియా బస్తాలను పక్కదారి పట్టించి కృత్తిమ కొరత సృష్టిస్తూ వ్యక్తులచే అమ్మిస్తున్నారని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వ్యవసాయ అధికారులు అనునిత్యం పర్యవేక్షింస్తూ, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో యూరియా కొరత లేదని తగినంతగా అందుబాటులో ఉందని, అవసరం మేరకు ప్రతి రైతుకు యూరియా అందిస్తామని కలెక్టర్ తెలిపారు.ప్రైవేట్ షాపుల వద్ద అధికారుల ఉండి యూరియా పంపిణీ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్సిడీ యూరియా ఎక్కడ పక్కదోవ పట్టకుండా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు.యూరియాకు ప్రత్యామ్నాయంగా రైతులకు నానో యూరియా ఎలా ఉపయోగకరంగా ఉంటుందని, నానో యూరియా ధర తక్కువ ఉండడంతో పాటు 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని అన్నారు.

 

 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ చేసిన కలెక్టర్

రాయపర్తి మండల కేంద్రం, పిరికెడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్వయంగా నిర్వహించారు.ఎంపీడీవో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో నుండి కొందరి లబ్ధిదారుల వద్దకు కలెక్టర్ నేరుగా వెళ్లి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి అద్దె ఇంట్లో ఉంటున్నారా,తదితర అర్హత వివరాలను పరిశీలించారు.

 

 


అనంతరం లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్

రాయపర్తి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోర రక్ష ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహంలో ఇంటర్మీడియట్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న విద్యార్థులచే కలెక్టర్ రక్త పరీక్షలు చేయించారు.రెసిడెన్షియల్ పాఠశాలలో పరిసరాలు, వంట గదులు, నిలువ చేసే ఆహార పదార్థాలు, కూరగాయలు పళ్ళను పరిశీలించారు. తాజా నాణ్యమైన
కూరగాయలు పళ్లు నిత్యము అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని సూచించారు. హాస్టల్ ఆవరణతో పాటు వంట గదులు కచ్చితంగా శుభ్రంగా ఉంచాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతిరోజు అందిస్తున్న భోజనం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.భోజన నాణ్యతను పరిశీలించి,విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, గృహ నిర్మాణాల శాఖ పిడి గణపతి శ్రీనివాస్,ఎంపీడీవో కిషన్,మండల తాసిల్దార్ మండల వ్యవసాయ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version