కర్ణాకర్ ని సన్మానించిన పిసిసి అధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరై మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ లో కస్టపడి పని చేస్తే అవకాశాలు వస్తాయి ఉదాహరణ మీ అందరితో కలిసి పనిచేసిన బట్టు కర్ణాకర్ రే నిదర్శనం రాబోయే స్థానిక గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని అత్యధిక మెజారిటీ తో రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలిని సూచించారు
అనంతరం జయశంకర్ భూపాలపల్లి నూతన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
