హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా దత్తు రెడ్డి నియామకం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాలు మేరకు హుగ్గెల్లి గ్రామం నూతన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కమిటీ ని నియమించిన జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఈ సంధర్బంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు దత్తురెడ్డి,వైస్ ప్రెసిడెంట్ గా ఎండీ అహ్మద్ ,జనరల్ సెక్రటరీ గా బొడ తుకారాం లకు మరియు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, గ్రామ పార్టీ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు సన్మానించి ,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ మోసపూరిత 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దేనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ తరపున తమ పోరాటం తప్పదన్నారు సమీష్టగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు
ఈ కార్యక్రమంలో పీజీ శంకర్, కిష్టా రెడ్డి,రాథోడ్ భీమ్ రావు నాయక్,మధు, అహ్మద్,కసిం,షకీల్,అడ్డు,బాబ్బు తదితరులు పాల్గొన్నారు.