దేవాదుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి..

*దేవాదుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి

*వర్ధన్నపేట నియోజకవర్గంలోని దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని చెరువులను సత్వరమే నింపాలి
*ఈ విషయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే స్పందించాల
*లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పర్యటనను అడ్డుకుంటాం
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట (నేటిధాత్రి).:

గత పది రోజుల క్రితం ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి దేవదుల కెనాల్స్ కి నీళ్లు విడుదల చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గంలోని అయినవోలు వర్ధన్నపేట మండలాల్లో చుక్క నీరు లేక నెర్రెలు వారిన చెరువులను సందర్శించి దేవాదుల నీటి ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఆశించిన వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఏదో నాలుగు రోజులు నాలుగు చినుకులు పడ్డాయని వర్షాలు బాగా కురుస్తాయని ఆశించి రైతన్నలు వరి నాట్లు వేసుకున్నారని ఇప్పుడు అవి ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో కనీసం బోర్లు బావుల్లో నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి పరిస్థితి ఏర్పడితే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేసుకున్న రైతన్నలపై మునిగే నక్క మీద తాడిపండు పడ్డట్లు రైతు అన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుందని కాబట్టి ఇప్పటికైనా రైతుల సమస్యలను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని గ్రామాల చెరువులకు కెనాల్ ద్వారా నీటిని అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలని లేదంటే రైతుల తరపున రైతులను సంఘటితం చేసుకొని మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటనను రైతుల అందరితో కలిసి అడ్డుకొని ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను మీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను మీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గారికి తెలిసే విధంగా చేస్తామని హెచ్చరించారు. వారి పర్యటనకు ముందు దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపకపోతే తప్పకుండా రైతుల ఆక్రోసాన్ని మీరు మరియు మీ ప్రభుత్వం చూడక తప్పదని వెంటనే నీటిని విడుదల చేసి మీ చిత్తశుద్ధి చాటుకోవాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

గ్రామదేవతలకు పూజలు.

కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జేష్ట మాసం గ్రీష్మ రుతువు తదియ బుధవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 ప్రతినెల నిర్వహించే పూజా కార్యక్రమాలలో భాగంగా పంచామృతాలు సరస్వతి పుష్కర జలంతో అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు నిర్వహించారు.

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి..

– పాడి పంటలతో బేతిగల్ గ్రామం విరసిల్లాలి..
– బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్ బాబు.

వీణవంక, ( కరీంనగర్ జిల్లా ):

నేటి దాత్రి :వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి,మహలక్ష్మి,బొడ్రాయి,సహిత పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఊరిని కంటికి రెప్పలా కాపాడుకునే గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమపూజలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని,గ్రామంలోని ప్రజలందరూ పండగకు రావడం వలన గ్రామమంతా సందడిగా ఉందని అన్నారు.శ్రమ తీసుకుని ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.ప్రతిష్ఠ మహోత్సవానికి తనవంతు సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బేతిగల్ గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు,వీణవంక మండల నాయకులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version