జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
జమ్మికుంట (నేటిధాత్రి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి 19వ వార్డులో 5 లక్షల రూపాయల సీసీ రోడ్డును దేశ్ ని స్వప్న కోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ప్రారంభించారు సుంకరి రమేష్, ఎర్రం సతీష్ రెడ్డి,ఎలగందుల శ్రీహరి, పిట్టల రమేష్ ఉడత వెంకటేష్,సంకీస సురేష్,రాజ్ కుమార్,రామచంద్రం,శ్రీను ,ఆడపు రాజా నర్సు,ఎండి ఖాదిర్, ఎండి ఖాదీర్ ,రాజ కొంరయ్య,చక్రపాణి,, ఎండి ఇస్మాయిల్ ,జావిద్,ఉన్నారు
Tag: inaugurated
రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..
నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..
హన్మకొండ, నేటిధాత్రి:
గ్రేటర్ వరంగల్ నగర పరిధి, మడికొండ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య (సి ఎన్ జీ) గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, కార్పొరేటర్ లు సి.ఎన్.జీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన..
ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన హనుమంతరావు పటేల్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రముఖ హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలోఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది లింగాయత్ సత్రం, టెంపుల్ రోడ్ నిర్వహించిన ఉచిత శిబిరాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ప్రారంభించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ,ఆర్థో,కంటి,బిపి,డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు వచ్చిన రోగులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలను అవసరమైన టెస్టులు మందులు ఉచితంగా అందించడం జరిగింది. గ్రామస్తులు ఆయా గ్రామస్తులను ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
నూతన పోలీస్ స్టేషన్ కు తాత్కాలిక.!
నూతన పోలీస్ స్టేషన్ కు తాత్కాలిక భవనమును ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
కొత్తపల్లి గోరి మండలం కేంద్రంలో నూతనగా పోలీస్ స్టేషన్ కు అవసరమైన తాత్కాలిక భవనమును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.అదేవిధగా ఈ నెల చివరికల్లా నూతన పోలీస్ స్టేషన్ భవనము శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి లేదా వరంగల్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తారని ఎమ్మెల్యే జీఎస్సార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు చిట్యాల సీఐ మల్లేష్ రేగొండ ఎస్ఐ సందీప్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం
శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీశైలం మహా క్షేత్రంలో ఈరోజు నుండి గతంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉచిత దర్శనం గురించి భక్తులకు తెలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈవో ఎం శ్రీనివాసరావు. మై కానౌన్స్మెంట్ ద్వారా అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులు ఉచిత దర్శనానికి ఎలా వెళ్లాలి టికెట్స్ ఎలా పొందాలనే విషయాన్ని పొందుపరిచారు. మధ్యాహ్నం ఒకటి 15 నిమిషాలకు టోకెన్లు జారీ చేసి ఒకటి 45 నుంచి 3:45 వరకు ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దని బట్టి 1000 నుంచి 1200 మందికి ఈ ఉచిత స్పర్శ దర్శనం కల్పించే అవకాశం ఉందని వారంలో నాలుగు రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం ఈ ఉచిత స్పర్శ దర్శనానికి కేటాయించామని ఈవో తెలిపారు.
సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన.
సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
◆ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,
◆ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి
◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంకటి శుక్లవర్ధన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.
గిరిధర్‌రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹ సిద్దం.ఉజ్వల్‌రెడ్డి ప్రారంభించారు.
ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ టీ జీఐడీసీ చైర్మన్ మహ్మద్ తన్వీర్,సీడీసీచైర్మన్ ముబీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల అధ్యక్షులు పట్లోల్ల రాంలింగారెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి, కండెం.
నర్సింహులు,నర్సింహారెడ్డి,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు భీమయ్య,జమిలాలోద్దిన్,అక్తర్ గోరి,జావిద్,జాఫర్,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు మల్లారెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్ కుమార్,అక్బర్,అశ్విన్ పాటిల్,హర్షవర్ధన్ రెడ్డి,జి.కిరణ్‌కుమార్‌గౌడ్,నథానెయల్,జగదీశ్వర్ రెడ్డి,మల్లికార్జున్,నర్సింహా యాదవ్,సునీల్,రాజు,జుబేర్,ఇమామ్ పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన.
చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ కడియం. కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు
సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
సిసి కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పిరమిల్ కంపెనీ సహకారంతో.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93-సిసి కెమెరాలను శుక్రవారం రోజు జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ నందు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సిసి కెమెరాలు ఆధునిక సాంకేతికతను కలిగి, రాత్రి సమయంలో సైతం చూడకగలిగే విధంగా నైట్ విజన్ కలిగి ఉంటాయని, ఈ కెమెరాలను పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందిని ఇవన్నీ కూడా జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ కు అనుసందానం చేయబడి ఉంటాయని అన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ జిల్లా, రాష్ర్ట సరిహద్దు కావడంలో వివిధ రకాల ఆస్థి సంభందిత నేరాలు, ఇతర రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పిడియస్ రైస్ వంటి ఇతరములు అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉందని, సిసి కెమెరాల ఆధారంగా వీటిని అధిగమించడంతో పాటు, జరిగిన నేరాలను పరిశోధిండంలో ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకం అని అన్నారు. జిల్లా ప్రజలు సిసి కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి, అవగాహన కలిగి స్వచ్చంధంగా మీ, మీ గ్రామాలలో, పట్టణాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన.
శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు (ఆర్బివివిఆర్) నరహరి జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘ భవన నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రెడ్డి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్.
డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్ తో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే
వనపర్తి నేటిధాత్రి :
శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పాత భవనానికి రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఉండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.
ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.
భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.
వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.
అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని అన్నారు
పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్ ఎల్ ఏన్ మిడిదొడ్డి రమేష్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ టి శంకర్ ప్రసాద్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!
*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*
మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన.!
నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థల దాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు, అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయితీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేసారు అలాగే పంచాయతీలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురుంచి, ఇరిగేషన్, విద్య, వైద్యం,అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వారం లోగ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనీ అదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులయినా ప్రతీ ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేశారు అలాగే ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తనై చూసుకుంటానని అని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వినతి పత్రాలు అందజేశారు.
ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్ , మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి,, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం.
బుద్ధారంలో గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బుద్దారం గ్రామం లో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మి గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ పీపీసీ సెంటర్ ను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగపెల్లి భాస్కర్ వివో అధ్యక్షులు బిక్కినేని రజిత కలసి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ డీపీఎం నారాయణ సీసీ బాబా సభ్యులు బియ్యాల కవిత.. అల్లెపు మంజుల. మల్లెవెని పుష్పలిల. వివో ఏ పద్మ.విజేందర్. రైతులు హాజరైనారు
గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించిన.
గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జి.ఎస్.ఆర్
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.
గణపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు
వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయాలి
వరి ధాన్యం కొనే సెంటర్లో వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలల్లో కన్య బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీ ల ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, గణపురం మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఎండి చోట మియా మొలంగూరి రాజు అశోక్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, ఎమ్మార్వో ఎంపీడీవో కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
హాజరైన కలెక్టర్ సత్య శారదా , అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
#నెక్కొండ ,నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నెక్కొండ మండలంలోని గొట్ల కొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారద లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచనలు క్రమం తప్పకుండా పాటించి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యాసంగి పంటలో వరి సాగు పెరిగిందని వరి ధాన్యం కొనుగోలలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డి సి ఎస్ ఓ కిష్టయ్య, సివిల్ సప్లై డి ఎం సంధ్యారాణి, డి పిఎం భవాని, తాసిల్దార్ రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్, నెక్కొండ వ్యవసాయ అధికారి నాగరాజు, ఏపీఎం శ్రీనివాస్, లతోపాటు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పార్వతమ్మ, పెండ్యాల హరిప్రసాద్, చల్ల శ్రీపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, తిరుమల్ చౌహాన్, చల్ల పాపిరెడ్డి, సాయి కృష్ణ, భాను ప్రసాద్, సింగం ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దూదిమెట్ల కొమురయ్య, నైజాం, గొట్లకొండ వివో అధ్యక్షులు సునీత, సరోజ, పార్వతి, జ్యోతి, నీలమ్మ, వి ఓ ఏలు సూర్య, ఏకాంబరం, గొట్లకొండ గ్రామ రైతులు, మహిళా సంఘల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.!
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రాయపర్తి దుర్గభవాని గ్రామైక్య సంఘం, ముస్తాలపల్లి మారుతి ఐకేపి సెంటర్,రామకృష్ణాపూర్ మహేశ్వర గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు. ఈకార్యక్రమం లో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్లమలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సిసి కుమారస్వామి,మహిళా సంఘం సభ్యులు కావ్య, లక్ష్మి,రాధ,ప్రియాంక,రాణి, సుగుణ,చందన,ఎరుకల భారతి,పొన్నాల సునీత,యారా రజిత,పెళ్లి పద్మ, ఎరుకల సుకపాల,సిసి రాజు,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.!
‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’
అలంపూర్ / నేటి ధాత్రి.
గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించే వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా,లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.