వెంకటాపూర్ గ్రామానికి మరొక రేషన్ షాప్ కొరకు వినతిపత్రం.
మందమర్రి నేటి ధాత్రి
వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వేల్పుల చిరంజీవి మందమర్రి బి వన్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామిని, కలిసి వెంకటాపూర్ గ్రామo ప్రజల తరపున రేషన్ షాప్ మరొకటి కావాలని మంత్రి వర్యులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకట్ స్వామి సానుకూలంగా స్పందించి సంబంధించిన ఆఫీసర్ కి సిపారస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
