42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు మెరుగు సురేష్ గౌడ్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి లో బిసి సంఘాల బందుకి కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ పెద్దకోమటిపల్లి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని వ్యాపార సంస్థలను, విద్యాసంస్థలను బందు చేయించడం జరిగింది , అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద రమేష్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి నిమ్మతి రాజేందర్ మంద దశరథం గడ్డం శ్రీనివాస్ మంద లక్ష్మయ్య ఆదిమూల సత్యనారాయణ మంద నవీన్ మెరుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
