మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు గ్రామ పెద్దలు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆదివారము సాయంత్రం పగటి సవార్లు మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు.పీర్లకు చక్కెర,గంధం, కొబ్బరిగిన్నెలు, దట్టీలు, పూల దండలు సమర్పించి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. ధూపంతో ప్రత్యేక మొక్కులు చేశారు. పెద్ద సవారి కార్యక్రమంలో భాగంగా ఆదివారము సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి.11-00ల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల్లో పీర్లను ఊరేగించి, మసీదుకు దర్గాలకు.తీసుకెళ్లి మగ్గబెట్టి పూర్తి చేస్తారు
జహీరాబాద్ : పీర్ల పండుగ (మొహర్రం)ను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని నాగుల కట్ట దగ్గర ఏర్పాటు చేసే పీర్లను ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున ఊరేగించారు. అహ్మద్ సాహెబ్ సాయంత్రం పట్టణంలోని పీర్లు వెళ్లి కలవడంతో అక్కడ జాతరను తలపించింది.
ఝరాసంగం: మండల కేంద్రంతో పాటు చిలేపల్లి మేడపల్లి కంబాలపల్లి బొప్పనపల్లి కుడు సంఘం తుమ్మనపల్లి తదితర గ్రామాల్లో ప్రతిష్ఠించిన పీర్లకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆదివారం పీర్ల ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో పీర్ల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలకు షర్బత్‌ను పంపిణీ చేశారు.
మొగుడంపల్లి : మండల ధన సిరి జాడి మల్కాపూర్ ఇప్పేపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ వార్డు సభ్యుడు, ఉప సర్పంచ్ తదితరులు ఉత్సవాల్లో పాల్గొని పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కోహీర్: మండల పరిగిలో పీర్లతో నిర్వహించిన ఊరేగింపు వైస్ చైర్మన్ షాకేర్ పాల్గొని మాట్లాడారు. మొహర్రం మత సామరస్యానికి పత్రీకగా నిలుస్తుందన్నారు. ఈ ఉత్సవాల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.
న్యాల్కల్ : మండల డప్పూర్ మల్గి మెటల్ కుంట హద్నూర్ తదితర గ్రామాల్లో ఆటాపాటలతో అలావ్ ఆడుతూ పీర్లను ఊరేగించారు. సాయంత్రం సమీపంలోని చెరువుల్లో పీర్లను నిమజ్జనం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు.