వర్షాకాలం గ్రామ సమస్యలపై శ్రద్ధ వహించాలి
డిపిఓ డి.వెంకటేశ్వరరావు
జైపూర్,నేటి ధాత్రి:
శనివారం రోజున జిల్లా పంచాయితీ అధికారి డి.వెంకటేశ్వర రావు జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.వీధులన్నీ తిరుగుతూ గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, రోడ్డు ప్రక్కన,షాపుల ముందు ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి పంచాయితీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతీరోజూ తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు,ఇతర వ్యర్థాలు లేకుండా జాగ్రత్తగా శుభ్రపరచాలని తెలిపారు,షాపుల యజమానులు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను రోడ్డు ప్రక్కన పడవేయవద్దని,డస్ట్ బిన్ వాడాలని సూచించారు.సెగ్రిగేషన్ షెడ్ లో కంపోస్టు ఎరువు తయారు చేయాలని,స్మశాన వాటిక పరిశుభ్రంగా ఉంచాలని,పల్లె ప్రకృతి వనం మొక్కలను సంరక్షించాలన్నారు.త్రాగునీటి వాటర్ ట్యాంకు లను పరిశీలించి క్లోరినేషన్ చేయించి శుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, కురుస్తున్న వర్షాకాల దృష్ట్యా సరిపడా బ్లీచింగ్ పౌడర్,బై లార్వా నిల్వ ఉంచుకోవాలని,నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని,వర్షాకాలం గ్రామ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయితీ కార్యదర్శికి సూచించడం జరిగింది.అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు.ఈ పర్యటనలో డిపిఓ వెంకటేశ్వరరావు,జైపూర్ మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాపురావు,పంచాయతి కార్యదర్శి ఎం.విష్ణువర్ధన్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.