శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని శ్రీరంగాపురం గ్రామంలో డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య శిబిరం నిర్వహించే వ్యాధులతో బాధపడుతున్నవారు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా శానిటేషన్, నీటి నిల్వలు ఆయిల్ బాల్స్ రిలీజ్ , బ్లీచింగ్ చల్లించడం పంచాయితీ కార్యదర్శి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కాచి చల్లార్చి నీళ్లు మాత్రమే తాగాలని హారపదార్ధాలు వెచ్చగా ఉన్నప్పుడు తినాలని తెలిపారు. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, కరకగూడెం పి హెచ్ సి. హెచ్ ఈ ఓ కృష్ణయ్య, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ అరుణ్ బాబు, ఎం పి హెచ్ ఏ ఎం నరసింహారావు, సుజాత, ఆశాలు, హెల్త్ సూపర్వైజర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ

జైపూర్ నేటి ధాత్రి:

 

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో జైపూర్ మండలం లోని కాన్కూర్ గ్రామంలో మంగళవారం సోలార్ లైట్ అమర్చారు.టీజీ ఎఫ్ డీసీ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,ఫీల్డ్ సూపర్ వైసర్ రాజేష్,వాచర్ లు శంకర్,సాయికిరణ్, రాకేష్,గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది

రాత పుస్తకాలు అందజేసిన_మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వము అందించిన ఉచిత రాత పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము నుండి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలను అందజేస్తుందని అన్నారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు,రాత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,రాగి జావా,వారానికి మూడుసార్లు కోడిగుడ్లు,అన్ని ఉచితంగా కల్పిస్తున్నది. కావున విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని,ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి గ్రామ ప్రజలది మరియు తల్లిదండ్రులదని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒకటవ తరగతికి మూడు,రెండవ తరగతి మూడు,మూడో తరగతి నాలుగు,నాలుగవ తరగతికి ఐదు,ఐదవ తరగతి ఆరు నోటుబుక్కులను ఉచితంగా అందజేసిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా నోట్బుక్కులు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్ మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామాన M R P S జండా ఎగరవేయాలి.

గ్రామ గ్రామాన M R P S జండా ఎగరవేయాలి
భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు
అంబాల చంద్రమౌళి మాదిగ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో M R P S మొగుళ్లపల్లి మండల ఇంచార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ మరియు రేణుకుంట్ల సంపత్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్య కార్యాలర్తల సమావేశానికి ముఖ్య అతిధులుగా M R P S భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు అంబాల చంద్రమౌళి
ముఖ్య అతిథిగా హాజరైన
మాట్లాడుతూ
జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ జన్మదిన వేడుకలు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరపాలని పిలుపునివ్వడం జరిగింది
మహాజన నేత మంద కృష్ణ మాదిగ అన్న ఎస్సీ లలో మాదిగ , ఉపకులాల కు ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా అన్యాయం జరుగుతుందని గుర్తెరిగి మాదిగ దండోరా (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) స్థాపించి పల్లె పల్లేనా మాదిగలను, ఉపకులాలను ఏకం చేసి సబ్బండ వర్గాల ప్రజలందరి మద్దతు కూడగట్టి ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని అలుపెరుగకుండా ముప్పై ఏండ్లు సాగించి ఫలితాన్ని సాధించి పీడిత వర్గాల ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసాడని అన్నారు. మాదిగల, ఉపకులాల పక్షాన ఉద్యమిస్తూనే సమాజం లో ఏ వర్గం కు ఆపద వచ్చిన ఆయా సామాజిక వర్గాలకు అండగా నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంతడుపుల సారంగ పాణి జీడీ సంపత్ రొంటాల రాజ్ కుమార్ బండారి రామస్వామి నిమ్మల భద్రయ్య మంగళ పల్లి శ్రీనివాస్ గుడిమల్ల రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా

చర్ల నేటిధాత్రి:

 

చర్ల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజయకాలనీ గ్రామంలో అత్యధికంగా దళితులు నివసిస్తున్నారు మండలంలో అన్ని రోడ్లు వేసిన దళిత వాడలో రోడ్డు వేయకపోవడం ఎంతో హేయమైన చర్య అని దళిత సామాజిక వర్గానికి చెందిన జెట్టి శ్రీను ఆరోపించారు మా గ్రామంలో అన్ని సందుల్లో సిమెంట్ రోడ్లు వేసిన మా ఇండ్ల ముందు ఉన్న సిసి రోడ్డు వేయకపోవడం వల్ల వర్షం పడితే ఈ ప్రాంతం మొత్తం బురద అయ్యి ఇండ్లలోకి నీరు వస్తుందని అన్నారు ఇకనైనా చర్ల మండలం ఎంపీడీవో ఎంపీవో ఈ ప్రాంతంలో పర్యటించి మా ఇండ్ల ముందు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

నేడే అంత్యక్రియలు ముగిసిన 33 ఏళ్ల గాజర్ల కుటుంబ ప్రస్థానం.

సెంట్రల్ కమిటీ సభ్యుడు హోదాలో మరణం. జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు.

చిట్యాల నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామానికి ఓ చరిత్ర ఉంది ఆ చరిత్ర నేటితో ముగియనుందా అనే సందేహం కలుగుతుంది వెలిశాల తల్లడిల్లుతుంది ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు, వివరాల్లోకి వెళితే గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008 ఎన్కౌంటర్లో చనిపోగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి.

చెందిన విషయం తెలిసిందే దీంతో గాజర్ల కుటుంబ ప్రస్థానం ఉద్యమంలో ముగిసినట్లయింది, రవి మృతదేహం కోసం బయలుదేరిన గాజర్ల అశోక్ అలియాస్( ఐతు) ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం కు బయలుదేరి మృతదేహాన్ని తీసుకొస్తున్న క్రమంలో చిట్యాల చౌరస్తాలో రవి మృతదేహానికి గౌడ సంఘం నేతలు మరియు తన చిన్ననాటి స్నేహితులు బంధువులు ప్రజలు నివాళులర్పించి రవన్న అమరహే అంటూ నినాదాలు చేశారు ,ఈ సందర్భంగా గాజర్ల రవి అలియాస్ గణేష్ తమ్ముడు అశోక్ మీడియాతో మాట్లాడుతూ డెడ్ బాడీ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం అని కావాలని కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చనిపోయిన శవాలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావడం నిజంగా చాలా దురదృష్టకరం అని కనీసం డెడ్ బాడీనికూడా చూపించడానికి ఉదయం 8 గంటల నుండి వేడుకుంటే రాత్రి 12 గంటలకు డెడ్ బాడీని అప్పజెప్పారు అని ఫోరోనిక్స్ వాళ్ళు లేరని నిర్లక్ష్యం సమాధానం చెబుతూ చాలా కాలయాపన చేశారు అని.
ఈ ప్రాంత పోరాటం కోసం ఎన్నో పోరాటాలు చేసిన రవి మృతదేహాన్ని చూడడానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కడసారి చూపు కోసం నోచుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు, డెడ్ బాడీ కోసం ఆంక్షలు పెట్టి ఇచ్చారని ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ కు మరియు పోలీస్ శాఖ వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగిందని అట్లాంటి సంఘటనలు ఏమీ జరగవు అని ఈ సందర్భంగా తెలిపారు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానులు అందరూ శుక్రవారం రోజు జరిగే జరిగే అంత్యక్రియలో పాల్గొనాలని అన్నారు, మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించినవారు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి గౌడ్ ఉపాధ్యక్షులు తడక సుధాకర్ ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అభిమానులు బంధువులు తదితరులు ఉన్నారు.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక. చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
నేర్పటి శీను కుమ్మరి శ్రీనాథ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మొగులపల్లి మండల ఇన్చార్జి MRPS నేరెళ్ల ఓదెలు మాదిగ.కో ఇన్చార్జీలు రేణికుంట్ల సంపత్ మాదిగ. రామ్ రామ్ చందర్ మాదిగ . మొగులపల్లి మండల.ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి మాదిగ. జీడి సంపత్ మాదిగ ఆధ్వర్యంలోMRPS ముఖ్య కార్యకర్తల సమావేశ నికి ముఖ్య అతిథులుగా మొగులపల్లి మండల ఇన్చార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ. కో ఇన్చార్జి రేణికుంట్ల సంపత్ మాదిగ లు హాజరై వారు మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత , పద్మశ్రీ అవార్డు గ్రహీతమంద కృష్ణ మాదిగతన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లోవెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారామాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.
ఇసిపేట గ్రామ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది
గౌరవ అధ్యక్షులుగా. జన్నె సదయ్య.మాదిగ
అధ్యక్షులు : నేర్పట్టి శీను మాదిగ
ఉపాధ్యక్షులు : జన్నె క్రాంతి మాదిగఅధికార ప్రతినిధిగా. బొచ్చు రాకేష్ ముఖ్య సలహాదారులుగా. నేర్పాటి శ్రీను మాదిగ. జన్నెమొగిలి మాదిగ ప్రధాన కార్యదర్శి : బొచ్చు రాజు మాదిగ కార్యదర్శి : నేర్పట్టి అశోక్ మాదిగ కోశాధికారిక. గడ్డం చిరంజీవి మాదిగ.
ప్రచార కార్యదర్శిగా నేర్పటి రాజయ్య మాదిగ
సంయుక్త కార్యదర్శిగా. గడ్డం
రాజు. మాదిగ లను
చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.అధ్యక్షులుగా. కుమ్మరి శ్రీనాథ్ఉపాధ్యక్షులుగా. శ్రావణ్అధికార ప్రతినిధిగా. అజయ్ ప్రధాన కార్యదర్శిగా. ప్రభాస్కార్యదర్శిగా. రాంబాబు
కోశాధికారిగా. అంతడుపుల రాజు
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి జీడి సంపత్. రొంటాల రాజ్ కుమార్. జంపయ్య తదితరులు పాల్గొన్నారు

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు.

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు

 

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు వలస ఆదివాసి నిమ్మలగూడెం, నీలాద్రి పేట, గండి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆదివాసి ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించద్దని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించరాదని తెలిపారు. మావోయిస్టులని కాలం చెల్లిన సిద్ధాంతాలని యువత పిల్లలు విద్య ద్వారానే ఉన్నంత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అసంఘిక శక్తులకు సహకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా జైలు పాలై కేసులు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, మరియు స్పెషల్ పార్టీ టి జి ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

shine junior college

 

 

మహదేవపూర్ మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ లో నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అదేవిధంగా మండల ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సూచనకు మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు కాలువ మల్లయ్య గ్రామ అధ్యక్షులు పేట రాజు సమ్మయ్య ఉపాధ్యక్షులు అంబాల సంజీవ్ కార్యదర్శి నిట్టూరి అంకయ్య ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ ప్రచార కార్యదర్శి పేట రవి నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరగబోయే ఊరు ఊరునా దండోరా జెండా జూలై 7న ఘనంగా ఆవిష్కరించుకొని ఈ దేశంలోనే మాదిగ జాతి ఒక శక్తివంతంగా ఎదిగి సబ్బండ కులాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న మందకృష్ణ మాదిగ ఈ క్రమంలో జాతి చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయని సామాజిక న్యాయం సాధించిన తరుణంలో విజయోత్సవాలు చేసుకోవాలని మండలంలో గ్రామాల ప్రజలు యొక్క దండోరా విజయాలని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరు జూలై 7న జెండా కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్కూరి సారయ్య పేట దేవేందర్ మాదిగ యువసేన మండల అధ్యక్షులు మంత్రి రవితేజ చింతకుంట సదానందం చింతకుంట రాము తదితరులు పాల్గొన్నారు

పల్లె ప్రజా దవాఖాన అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా.

పల్లె ప్రజా దవాఖాన-అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా…

గార్ల నేటి ధాత్రి:

ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు నిధుల వెచ్చించి సుందరమైన సువిశాలమైన అన్నీ వసతులతో కూడిన పల్లె దవాఖానలను కట్టించి,సరిపడ సిబ్బందిని నియమించి,జీతాలు,పనిముట్లు,వైద్య సామాగ్రి,మందులు,మెయింటనెన్సు అలవెన్సులు ఇచ్చి ప్రజలకు కనీస ఆరోగ్య అవసరాలు తీర్చజూస్తుంటే స్థానిక గార్ల మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానతో మాత్రం తమకు ఏమాత్రం ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మీ సేవే మా లక్ష్యమని-మేమున్నాము,మీ రు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకొమ్మని ప్రజలకేనాడు నమ్మకం కల్గించిన పాపాన ఇక్కడి సిబ్బంది పోలేదంటున్నారు.ఈ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ నియామకమైనప్పటి నుండి నేటికీ స్థానికంగా నివాసముండక, అందుబాటులో అసలుండక,ఖమ్మం నుండి నిత్యం అప్ అండ్ డౌన్లు చేస్తుంటారు.విచిత్రమైన విషయం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రిలో ఒక్క డాక్టరు కూడా పనిచేయడం లేదు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముంచుకోస్తున్న వేళ గ్రామంలో విషజ్వరాలు,డెంగీ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.ఇక్కడి వైద్యులు, సిబ్బంది డియం అండ్ హెచ్ వో మెడికల్ క్యాంపులనేర్పాటు చేసినపుడు మాత్రమే కనపడి,మిగతా వేళల్లా అపరిచితమే అన్నట్టుంది.వేలకు వేల జీతాలు తీసుకుంటూ,ఏజన్సీ పల్లె ప్రజల అనారోగ్యాలను బేఖాతరు చేస్తూ వైద్య వృత్తికే కళంకం చేస్తున్నారని ప్రజలు నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.ఏదో ఒక సమయంలో హెల్మెట్ల ధరించుక వచ్చి,రిజిష్టరులో సంతకాలు చేసుకుని వెళుతున్నా,గిరిజన ప్రజలింకా చోద్యం చూస్తూనే ఉన్నారు.ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలు,సిరంజీలు,వైద్య వేస్టులు, కుళాయి లేని నల్లా కనెక్షను నీటితో నిండే నిరంతర మురికి గుంటలతో పరిసరమంతా మురికిమయమైనా ఈ సిబ్బందికి మాత్రం పట్టదు.కురుస్తున్న వర్షాలకు పల్లెలో ఇంటికో ముగ్గురు చొప్పున విషజ్వరాల బారినపడి గతంలో గార్ల, మహబూబాబాద్, ఖమ్మం వంటి పట్టణాలకు గిరిజనులు దారులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సూదిమందుకి గానీ మందుబిళ్ళకి గానీ ఆసరా లేక,ఏనాడూ తిమోఫాస్ వంటి దోమల మందులు పిచికారీ చేయక,దోమతెరల పంపిణీ చేయక,ఫ్రైడే-డ్రైడేలు,శానిటేషన్ నిర్వహించక,పేదలకు నెలవారీ బి.పి,షుగరు మాత్రలు ఇవ్వక,రోగాల నివారణపై ప్రజల చైతన్యపర్చని ఈ దవాఖాన గానీ,ఈ సిబ్బంది గానీ మాకెందుకని పల్లె ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దేనికీకొరగానిదానిగా ఆస్పత్రిని మార్చి,కర్తవ్యాన్ని మర్చిన ఈ సిబ్బందిమాకొద్దని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.అలాగే ఇక్కడి సిబ్బంది పనితీరుపై ప్రజాక్షేత్రంలో సమగ్ర విచారణ జరిపి,వారు ఏమాత్రం పనిచేయక తీసుకున్న జీతాలను,ప్రభుత్వం రికవరీ చేసి,తగు శాఖాపరమైన చర్యలు తీసుకుని,వారిని స్థానచలనం కలిగించాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు.

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాగేష్ సజ్జన్ బొగ్గుల నాగన్న సార్ మర్యాద పూర్వకముగా కలిసి
మల్లయ్య స్వామి గారికి పూలమాలలతో షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ తమ్మలి మరియు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.

 

 

 

 

Whether you choose to walk or run, you are a child.
Whether you choose to walk or run, you are a child.

ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున
ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.

ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.

రైతుల పండుగ ఎరువక.

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.

గ్రామ పంచాయతీలను సందర్శించిన.

గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో శ్రీపతి బాబురావు ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,

గ్రామంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని,13 వ తేదీన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా చేసి సర్టిఫికేట్ సమర్పించాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు.

రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ పైపులైన్ మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని సూచించారు.

గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు.

సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని,నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది.

వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.

అనంతరం పెగడపల్లి గ్రామ పంచాయతీని,నర్సరీని సందర్శించి ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీళ్ళు అందించాలని,వాటర్ ట్యాంకు చుట్టూ శుభ్రం చేయాలని తగు సూచనలు చేశారు.

గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఇరు గ్రామపంచాయతీల కార్యదర్శులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

పోతిరెడ్డిపల్లిలో భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు.

పోతిరెడ్డిపల్లిలో భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కోహిర్ మండల పోతిరెడ్డిపల్లి గ్రామంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న శంకర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదిక వద్ద భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలను అధికారుల వద్దకు తీసుకొచ్చారు. సత్వరమే భూ సమస్యలకు కృషి చేస్తామని తహశీల్దార్ జయరామ్ నాయక్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు రైతులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి :

 

 

భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించిందన్నారు.

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యల పరిస్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుమలత,జూనియర్ అసిస్టెంట్ రాజు,రెవన్యూ సిబ్బంది,కారోబార్ వెనుకమూరి ఆనందరావు, స్థానికులు పాల్గొన్నారు.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున కలెక్టర్ వినతి పత్రం అందజేత

మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో కెసీఆర్ హయాంలో ప్రతిష్టా త్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని నరికి వేసి అక్కడ గ్రామపంచాయతీ భవనం నిర్మించుటకు అధికా రులు సిద్ధమై గ్రామస్తులు వద్ద ని మొరపెట్టుకున్నా కొందరి కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల శంకుస్థాపన కూడా పూర్తి చేశారు.గతంలో గ్రామపంచా యతీ భవన నిర్మాణానికి ఎమ్మార్వో పరిశీలించి నిర్ధారణ చేసిన 0.06 గుంటల కాళీ స్థలం పల్లె ప్రకృతి వనానికి పక్కనే ఉన్నందున గ్రామస్తుల కోరిక మేరకు ఆ స్థలంలోనే నిర్మించాలేతప్ప పల్లె ప్రకృతి వనాన్ని నాశనం చేయకూడ దని గ్రామస్తుల సహకారంతో కలెక్టర్ వినతి పత్రం అందజే సిన మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి.ఈ కార్యక్రమంలో జాలిగాపు అశోక్, ఎండి మగ్దున్ పాషా, పోతు రమేష్, పెరుమాండ్ల కుమారస్వామి, సప్పిడి పోషాలు తదితరులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం

పరకాల నేటిధాత్రి

 

 

హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగ అని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, పంచాయతీ కార్యదర్శి సుమలత,పాఠశాల చైర్మన్ దుమాల లక్ష్మి, కారోబార్ ఆనందరావు,అంగన్వాడీ టీచర్ ఉప్పరి భద్రమ్మ ఆయాలు,తల్లిదండ్రులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

ముంగి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

ముంగి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శుక్రవారము నాడు నూతన రెవిన్యూ చట్టం భూ భారతిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ప్రబులు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్ర పరిధిలోని ముంగి గ్రామంలో శుక్రవారము భూ వివాదాల సమస్యల పరిష్కారానికై రెవిన్యూ సదస్సు కార్యక్రమాన్ని పంచాయితీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 20 వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. భూమి సంబందించిన సమస్యలు ఉన్నట్లు అయితే రెవిన్యూ సదస్సు సమావేశంలో దరఖాస్తులు ఇచ్చినట్లు అయితే తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రాజిరెడ్డి జూనియర్ అసిస్టెంట్ బి అశోక్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ రికార్డ్ అసిస్టెంట్ రాములు కంప్యూటర్ ఆపరేటర్ మొహమ్మద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

కొండూరు గ్రామంలో బడి బాట కార్యక్రమం.

కొండూరు గ్రామంలో బడి బాట కార్యక్రమం.

నేటిధాత్రి, రాయపర్తి.

 

 

 

 

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వ ఆదేశానుసారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కొండూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత మాట్లాడుతూ పాఠశాలలో మంచి నైపుణ్యము, ఉన్నత విద్యార్హతలు కల ఉపాధ్యాయులు ఉన్నారని పిల్లలకు అన్ని విధాల విద్యా సంబంధమైన విషయాలు, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందించుటకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేస్తూ వారు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా అన్ని విధాల వారికి సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రఘు, నాగరాజు, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్యా నాయక్, స్వామి, అమర స్వర్ణ, శివకృష్ణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, రజినీకాంత్, అనిత, గౌతమిలు పాల్గొన్నారు.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని కవేలి గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో బడిబాట గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ దొండి రావు పెట్లోళ్ల మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను ఉచిత పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం భోజనంలో వారానికి మూడుసార్లు గుడ్డు, రాగి జావ వడ్డిస్తారన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version