అభివృద్ధి ప్రదాతలకు పాలాభిషేకం
వజ్జ సారయ్య
కొత్తగూడ,నేటిధాత్రి:
కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పల్లెలు పట్టణాల్లాగా తయారవుతాయని..ప్రజలు భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పూర్తి ఫలాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ ప్రజలు నమ్మకాన్ని నిజం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మంత్రివర్గానికి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు సంక్షేమ శాఖ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక కృషితో
ఏజెన్సీ మండలం మండలమైన కొత్తగూడ మండల కేంద్రంలో సుమారు 12 కోట్ల రూపాయలతో
సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయడం జరిగిందని..
త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే పల్లెల మరియు పట్నాలు అభివృద్ధి చెందుతాయని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,* మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ధనసరి అనసూయ సీతక్క
చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..