సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్..

సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ మహోత్సవం.శనివారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదారాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య గౌడ్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Former MPP Soujanya Goud

రాఖీ పండుగ సందర్భంగా సీఎం ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగించిందని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మాజీ ఎంపిపి,టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భీమాగాని సౌజన్య గౌడ్ తెలిపారు.

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు..

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పూల బొకే ఇచ్చి శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం రూ.42.64 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏటీసీలో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ అయిన భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలని ఎమ్మెల్యే తెలిపారు. ఏడాది కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, పార్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, రెండేళ్ల కాలపరిమితితో ఉన్న కోర్సులు బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్సుడ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ పురుషులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 172 సీట్లు ఉన్నాయని, నియోజకవర్గం విద్యార్థులు ఇటి అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు ఉదయం మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలను తెలిపే గోడపత్రికని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పం కిషన్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ కురిమిళ్ళ శ్రీనివాస్ తోట రంజిత్ ఉడుత మహేందర్ భౌతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

కరీంనగర్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తాం..

కరీంనగర్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తా

నగర ప్రజలు ఆందోళన చెందవద్దు

నిరంతరం అండగా ఉంటాం

బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే కరీంనగర్ లో ఈదుస్థితి

కరీంనగర్లో వర్షం వర్షపు నీరు వరద ఉధృతి వల్ల ముంపునకు గురైన ప్రాంతాల పరిశీలించిన వెలిచాల రాజేందర్ రావ్

నష్టపోయిన వారికి తక్షణమే సాయం అందించాలని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ కు సూచన

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్లో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా రోడ్లు, కాలనీలు తరచూ ముంపునకు గురవుతున్నాయనీ శాశ్వతంగా ఈవరద సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని అన్వేషిస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గురువారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షం, వరద ఉధృతి వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను వెలిచాల రాజేందర్ రావు పరిశీలించారు. సుభాష్ నగర్, వావిలాలపల్లి, ఆదర్శనగర్, మంచిర్యాల చౌరస్తా, కమాన్ ప్రాంతం, లక్ష్మీ నగర్, గాయత్రి నగర్, శర్మ నగర్లో మాజీ కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాసు, మెండి చంద్రశేఖర్ శ్రీలత, కట్ల సతీష్ తో కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాలను మొత్తం కలియతిరిగి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో రాజేందర్ రావు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోకి నీరు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇబ్బందులను గమనించి రాజేందర్ రావు కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ తో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యవసర సరుకులు అందించాలని సూచించారు. వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలనీ, తగిన వసతులు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే నగరంలో వరద ఉధృతి నివారణకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయా కాలనీల్లో పరిస్థితిని సమీక్షిస్తున్న మున్సిపల్ అధికారులకు రాజేందర్ రావు తగిన సూచనలు చేశారు. కరీంనగర్లో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద సమస్య ఒక ప్రహసనంగా మారిందని, దీనికి ఒక శాశ్వత పరిష్కారం మార్గాన్ని త్వరలోనే కనుక్కుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి ఈసమస్యను తీసుకెళ్లి దీన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతానని రాజేందర్ రావు పేర్కొన్నారు. నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనీ, అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే డ్రైనేజ్ సిస్టం పూర్తిగా అధ్వానంగా మారిందని రాజేందర్ రావ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలకుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల రోడ్లు, కాలనీలు ముంపునకు గురవుతున్నాయనీ, ఈదుస్థితి రావడానికి వారే కారణమని మండిపడ్డారు. వరద ఉధృతి వల్ల వర్షపు నీరు ఏలాంటి ఆటంకం లేకుండా ఎక్కడ నిల్వకుండా సాఫీగా వెళ్లిపోయేలా ఒక పరిష్కార మార్గాన్ని తప్పకుండా అన్వేషిస్తామనీ, ఈసమస్యకు ముగింపు పలుకుతామని ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాజేందర్రావు స్పష్టం చేశారు. నగర ప్రజలు ఎక్కడా ఎలాంటి సమస్య వచ్చినా మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, దృష్టికి తీసుకురావాలని, తమ దృష్టికి సైతం తీసుకురావచ్చని సూచించారు. ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని రాజేందర్ రావు తెలిపారు. కాలనీలో రోడ్లపై నీరు నిలవకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీలు, రోడ్లపై మురికి గుంతలు, మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ, రాత్రివేళలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాత్రివేళ విదీదీపాలు వెలిగేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు వరద బాధితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని పిలుపునిచ్చారు. ఏఆపద వచ్చినా ముందుకు వచ్చి తగిన సహాయమందించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోటగిరి భూమా గౌడ్, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు గుమ్మడి రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=1

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

 రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్.

 రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్…

 

రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు.

జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.

హైదరాబాద్:
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు.. రేవంత్ ప్రభుత్వ (Revanth Government) పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA HarishRao) ఆరోపించారు.
విద్యావ్యవస్థపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్త్‌ని ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా హరీష్‌రావు ట్వీట్ చేశారు.
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని హరీష్‌రావు అన్నారు.
జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.
బకాయిలు చెల్లించకుంటే జులై ఒకటోవ తేదీ నుంచి అన్నిరకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపి వేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి ఉందని చెప్పారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్‌రావు.
దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదపిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగులు తక్షణమే పంపిణీ చేయాలని హరీష్‌రావు కోరారు.

మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన.

మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోల నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర కార్మిక,ఉపాధి కల్పన,మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి గురువారం పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై మంత్రి తో చర్చించినట్లు తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకం.

జహీరాబాద్: సీఎం రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

వానాకాలం రైతు భరోసా రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేసి రికార్డు సృష్టించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మక్సుధ్ హైమద్ ఆన్నారు. మంగళవారం మొగుడంపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ అధ్యక్షతన రైతు భరోసా సంబరాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభి శేఖం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు అని, ఇప్పటి వరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికీ పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీపడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ పథకాన్ని కూడా ఇలాగే 2024 ఆగస్టు 15 లోగా పూర్తిచేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఎకరానికి 5 వేలు చొప్పున ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 6 వేల చొప్పున సంవత్సరానికి 12 వేలు చొప్పున రైతులకు అందించడం జరిగింది. కేంద్రం కొనుగోలు చేయలేని పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర రామచంద్రయ్య బుర్ర కొమురయ్య పిప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ ముంజల రవీందర్ అంబాల శ్రీను తోట రంజిత్ పద్మ కోమల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

shine junior college

జైపూర్ మండలం ఇందారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ముఖ్య సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా జైపూర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 75 వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మన రైతులు సుభిక్షంగా ఉండేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను ఇప్పటికి అమలు చేసి వివిధ రాష్ట్రాలకు ఒకదశ,దిశ చూపించారని అన్నారు. అదేవిధంగా రుణమాఫీ,సన్న ధాన్యానికి బోనస్,అన్ని రకాల పంటలకు మద్దతు ధర కొనుగోలు,అన్ని పంటలకు రాయితీపై సూక్ష్మ,సేంద్య పరికరాల సరఫరా వంటివి అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో శ్రీనివాసరావు,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏఈఓ మాళవిక,పంచాయతీ కార్యదర్శులు,ప్రజా ప్రతినిధులు,రైతులు ప్రజలు పాల్గొన్నారు.

పెరిగిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలి

పెరిగిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలి

ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ ప్రజలపై విద్యార్దుల బస్ పాస్ 20శాతం పెంపు వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందని పెంచిన చార్జీ లను వెంటనే ఉపసంహరించు కోవాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్ ప్రభుత్వాని డిమాండు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పెంచిన బస్ పాస్ చ్చార్జీలు ప్రజల పై ఒక్కరికీ నెలకు 200 నుండి 300రూపాల వరకు బారం మోపిందని ఆర్టీసీ బస్ లో పెద వాళ్లు మధ్యతరగతి ప్రజలు మాత్రమే ప్రయాణిస్తారని వారికి రాయితీలు ఇవ్వవలిసింది పోయివారిపై బారం పెంచేలాచార్జీలు పెంచారని పాలక ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితిలిస్తు ప్రజల పై చార్జీల భారం మోపుతునరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ లోకోట్లాది మందికి బస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పుకుంటు ఆర్టీసీ పై ఆధారపడి జీవన ప్రయాణం కొనసాగించే వారిపై ఆర్థికబారం పడేలా ఉందని వెంటనే ఈ చార్జీల పెంపు పై టీ జి ఆర్టీసిసంస్థ ఆలోచనచేసి పెంచిన చార్జీలను తగ్గించాలని ఈవిద్య సంవత్సర ప్రారంభం నుండీ ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత బస్పాస్

నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు.

నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం లో దేశాయి పల్లె బదనపల్లి తంగళ్ళపల్లి గ్రామాలలో నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని . తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి.మండల కేంద్రంలో ఇప్పటివరకు 210. ఇండ్లకు గ్రౌండింగ్ చేయడం తో పాటు పేదింటి కలల సహకారం.చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో డబుల్.బెడ్ రూమ్ పేరు మీద. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అటువంటి దానికి. తావు లేకుండా ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం. ప్రజా పరిపాలన అందిస్తుందని. గత ప్రభుత్వాలు చేసిన. అప్పులను తీర్చుకుంటూ. రేవంత్ రెడ్డి. ప్రజా పరిపాల సాగిస్తూ. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుందని. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని. మండలంలో పాపాయి పల్లె. రామన్నపల్లి. బస్వాపూర్. నేరెళ్ల. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేసిన మని. ప్రజలకు అండగా ఉండి ప్రజా పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అని ఆయన పాలనలో రాష్ట్రకాంగ్రెస్ ప్రజా పరిపాలన సాగిస్తుందని. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేస్తూ ఆరోగ్యారంటీలు అమలు చేస్తున్నామని. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు పాలభిషేకం చేయడం జరిగిందని . ఇట్టి ఇందిరమ్మ ఇండ్లురావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్ కి. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కే కే మహేందర్ రెడ్డికి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ నాయకులు మునిగల రాజు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్. అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు కిషన్ లక్కీ గారు తదితరులు పాల్గొన్నారు

ROB మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరు పెట్టడంపై హర్షం.

ఆర్ఓబికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరు పెట్టడంపై హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

జహీరాబాద్. గతకొద్దీ రోజులుగా పట్టణంలోని జాతీయ రహదారి నెంబర్ 65 పై గల రైల్వే లైన్ మీదుగా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి మాజీ మంత్రి స్వర్గీయ మొహమ్మద్ ఫరీదుద్దీన్, నామకరణం చెయ్యాలని డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించుకొని సీఎం పాల్గొన్న బహిరంగ సభలో స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఆర్బ్బ బ్రిడ్జిని జహీరాబాద్ ప్రాంత ముద్దు బిడ్డ మొహమ్మద్ ఫరీదుద్దీన్ పేరిట నామకరణం చేస్తున్నననే ప్రకటనను ఝరాసంగం మండల మైనారిటీ నాయకులు షేక్ సజావుద్దీన్ సద్దాం హుస్సేన్ స్వాగతిస్తు మాజీ మంత్రి పెట్టడంపై జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కార్, ఇంచార్జ్ చంద్రశేఖర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి మొహమ్మద్ ఫరీదుద్దీన్ గ్రామ సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు, ఓసారి శాసన మండలి సభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మైనారిటీ శాఖ, సహకార, మత్య్స శాఖ మంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సేవలు అందించి ప్రజలలో మంచిపేరు సంపాదించుకున్నారని షేక్ సజావుద్దీన్ సద్దాం హుస్సేన్ అన్నారు.

బసవేశ్వరుడు చూపిన మార్గంలో కాంగ్రెస్ సర్కారు.

బసవేశ్వరుడు చూపిన మార్గంలో కాంగ్రెస్ సర్కారు : సీఎం రేవంత్ రెడ్డీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్ర బాగంగానే బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు బాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు, ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

నిమ్స్ రైతుల ఆందోళన మామడ్దిలో ఉద్రిక్తత.

నిమ్స్ రైతుల ఆందోళన.. మామడ్దిలో ఉద్రిక్తత.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్: నిమ్డ్ రైతుల ముందస్తు అరెస్ట్ లతో
మామడ్దిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోనట్లు పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్డ్ ప్రాజెక్టుకు సారవంతమైన భూములు తీసుకోవద్దని వేడుకున్నా రైతుల అరెస్ట్ ను రైతు నాయకులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పేరు గ్రామానికి పోలీసులు రాగానే వందలాది మంది మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

నిమ్డ్ రోడ్డు జిగేల్.

నిమ్డ్ రోడ్డు “జిగేల్”

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
శుక్రవారం ప్రారంభించనున్న నిజ్జా (జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి) రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు ప్రాంతం వరకు నిర్మించిన రోడ్డు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. రోడ్డు మధ్యలో సుమారు 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి, 131 కెవి విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా సందర్భంగా గురువారం రాత్రి పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలను ప్రారంభించారు. దీంతో రోడ్డు ప్రాంతం మొత్తం కాంతులతో మెరిసిపోయింది. బర్దిపూర్, చిలేపల్లి, పొట్టిపల్లి, ఎల్గోయి, చిలేపల్లి తండా, వనంపల్లి మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు విద్యుత్ కాంతులను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి…

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి…

రాజీవ్ గాంధీ వర్ధంతి…చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ సెంటర్ నందు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి ,మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, సీనియర్ నాయకులు బండారు దయాకర్

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ:-స్వతంత్ర భారత యువ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి యువత రాజకీయాల్లోకి వచ్చేలా స్ఫూర్తి నింపిన నేత రాజీవ్ గాంధీ అని అన్నారు.

18సంవత్సరాల వారికి ఓటు హక్కు కల్పించడం పంచాయతీ రాజ్ నవోదయ విద్యాలయాలు లాంటి అనేక పథకాలు ఆయన హయంలో వచ్చాయి అని గుర్తుచేశారు.

టెలికాం ఐటీకమ్యూనికేషన్ రంగాలలో భారత్ అభివృద్ధి కి ఆయన చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు.

దేశానికి సాంకేతికతను తీసుకొని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ ను నిలిపింది రాజీవ్ గాంధీ నే అని అన్నారు.

దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెలు చిరకాల నిలిచిన ఘనత మహనీయుడు రాజీవ్ గాంధీ గాంధీ సొంతమన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య,మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ ఉప సర్పంచ్ బానోత్ వెంకన్న,దామరకొండ ప్రవీణ్,పోకల శ్రీనివాస్,గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,ప్రతాప చారి, గండి శ్రీనివాస్ గౌడ్,రాజులపాటి మల్లయ్య,సట్ల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలు,గోపాల్ రెడ్డి,ముల భూలోక్ రెడ్డి,కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,తరాల సుధాకర్, రషీద్ ఖాన్,బన్నిశెటి వెంకటేష్,ఎలేందర్,ఆగే చిన్న వెంకన్న,పరకాల కుమార్,చిన్న సాంబయ్య, బోడా విక్కి,బదవత్ శంకర్, ఎండీ అలీమ్,ఉప్పునూతల శ్రీను,కనుకుల రాంబాబు,సామల నరసయ్య, భూక్యా అరుణ్,హనుమ,సుందర్ వెంకన్న,బాధ్య,మామిడిశెట్టి మల్లయ్యా,నరసింహ రెడ్డి,రామ కృష్ణ,కార్యకర్తలు, మండల నాయకులు, జిల్లా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో 23 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సీఎం పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లను పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పంక్షన్ హల్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ద్వారా మైనారిటీలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా మంజూరు అయిన 150 కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ కలిసి మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ గారు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా &మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ సీఎం పర్యటన చరిత్రత్మకం కావాలి.

జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం పర్యటన చరిత్రత్మకం కావాలి

◆ సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి

◆ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలి — రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు.

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ ,బందోబస్తు, బారికేడ్లు , ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు,హెలిప్యాడ్ , హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి సభ లో పాల్గొంటారని తెలిపారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ శేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ,ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version