ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన..

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు, ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రి లో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరం ప్రబలిన ప్రాంతాలల్లో వైద్య క్యాంపు లు నిర్వహిస్తూ వ్యాధుల ను అరికట్టాలని తెలిపారు. ప్రబలిన వ్యాధులపై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ముఖ్యంగా వివిధ గ్రామాలలోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని వారు తెలుపగా వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారి కి ఫోన్ చేసి అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లు ను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డా. ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎం.పి.ఓ నాగరాజు
ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు,
పంచాయతీ సెక్రెటరీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం..

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు… ప్రసాద్‌‌ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని, చిన్న వయస్సులో మరణించడం బాధాకరమన్నారు.వారు మీడియా రంగంలో పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,
ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కెటీఆర్ కూడా టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని సంతాపం తెలియజేశారు. మరియు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రులు కూడా సంతాపం తెలియజేయడం జరిగినది.

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు.

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

యాకయ్య మృతదేహానికి ఎర్ర జెండా కప్పి పూలమాలలు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ సభ్యుడు పట్టణ నాయకుడు కామ్రేడ్ కుక్కల యాకయ్య ఆకస్మిక మరణం పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.
నర్సంపేట పట్టణంలోని జ్యోతిబసు నగర్ లో అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య అనారోగ్యంతో ఆకస్మికంగా ఆయన స్వగృహంలో చనిపోగా మృతదేహాన్ని సందర్శించి పార్టీ ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యాకయ్య పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడిగా నర్సంపేట పట్టణ నాయకుడిగా పనిచేసాడని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎర్ర జెండా పట్టి నిరంతరం పోరాడిన నిస్వార్థ జీవి అని ఆయన లేని లోటు పార్టీకి ప్రజా ఉద్యమాలకు ఎనలేనిదని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు వంగల రాగసుధ యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి మాశూక్, డివిజన్ కమిటీ సభ్యులు మోటం సురేష్, బండారి మల్లేశం, జ్యోతిబస్ నగర్ కాలనీవాసులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version