థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై,బెల్ట్స్,గుర్తింపు కార్డులను ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ సౌజన్యంతో అందిజేశారు
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం గంగాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1000 పిల్లర్స్ లైన్ క్లబ్ అధ్యక్షులు పరికిపండ్ల వేణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకున్న వారికే ఉన్నత విద్యాభ్యాసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబద్ధత గల ఉపాధ్యాయులు చక్కని విద్యా బోధన చేస్తున్నారని అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత నిరుపేద విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోవడానికి వస్తారని వారికి సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని రాజ్ కుమార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాజగోపాల్, జోనల్ చైర్మన్ చొప్పరి సోమయ్య, మాజీ సర్పంచ్ పెండ్యాల మమతా రాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఓరుగంటి కవిత తిరుపతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయురాలు వీణ జ్యోతి, పెండ్యాల రాము మడతలపాటి కుమార్, రుదీర్, జటబోయిన రాజు, గుండెబోయిన కాజీ యాదవ్, పుట్టపాక భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

కొత్త రేషన్ కార్డులను పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T135201.153.wav?_=1

 

కొత్త రేషన్ కార్డులను పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవికుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో నర్సంపేట పట్టణానికి చెందిన 23, 24, వార్డుల్లో నూతనంగా మంజూరైన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు కోల చరణ్ రాజ్ గౌడ్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, వార్డు ఆఫీసర్లు మౌనిక, తరుణ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేల్లి సారంగం గౌడ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జానకమ్మ, సరోజన, మోహన్, బైరగోని రవి, మొగిలిచర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు

పంటలను పరిశీలించిన ఏడీఏ దామోదర్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T124621.190-1.wav?_=2

 

పంటలను పరిశీలించిన ఏడీఏ దామోదర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో పసుపు మొక్కజొన్న బంతి పంటలను నర్సంపేట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు దామోదర్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి తో కలిసి సందర్శించారు. ఆయా పంటలు వేసిన నల్ల వెంకట్ రెడ్డి, చెన్నూరు అచ్చిరెడ్డి, యార ప్రతాప్ రెడ్డి రైతుల పంటల క్షేత్రాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ పంటల్లో వ్యవసాయ శాఖ సూచనల మేరకు మోతాదును మించకుండా మందులు పిచికారి చేయాలని తెలిపారు.పలుసూచనలు సలహాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ వి.విజయ్ నాయక్ పాల్గొన్నారు.

చల్ల లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే దొంతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-5.wav?_=3

చల్ల లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే దొంతి

#నెక్కొండ, నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల పాపిరెడ్డి తల్లి చల్ల లక్ష్మి గత కొద్ది రోజుల క్రితం మరణించగా గురువారం చల్ల లక్ష్మి దశదినకర్మలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై లక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తిరుమల్ నాయక్, చల్ల శ్రీపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, రావుల తిరుపతిరెడ్డి, మెరుగు విజయ్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామారావు శిరీష, సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను ప్రసాద్, చిన్నూరి కార్తీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్…

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

పొలిటికల్ సైన్స్ లెక్చరర్ కానుగుల బాగ్యలక్ష్మి -సుదర్శన్ దంపతులకు చెందిన కూతురు లక్ష్మి వివాహం రాజకుమార్ తో దుగ్గొండి మండలం గిర్నీబావిలోని కనిష్క ఫంక్షన్ హల్ లో జరిగింది. ఈ వివాహనికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ, ప్రజ్ఞ కాలేజీల అధ్యాపకులు గడ్డం శ్రీనివాస్, నీలారాపు నరేందర్, సుదర్శన్, వెంకటేశ్వర్లు,సంఘాల నాయకులు ఎలకంటి రాజేందర్, మొగిలిచర్ల సందీప్,కందికొండ లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో యోగాపై సర్టిఫికెట్ కోర్సు

డిగ్రీ కళాశాలలో యోగాపై సర్టిఫికెట్ కోర్సు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో యోగాలో 30 రోజుల సర్టిఫికెట్ కోర్సును యోగ అభ్యాసకులు ఎస్ కమలాకర్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలియజేశారు. నవీన్ మాట్లాడుతూ యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ కూడా యోగ పై మక్కువ పెంచుకుంటున్నాయన్నారు.ప్రాచ్య, పాశ్చాత్య అనే తేడా లేకుండా ప్రతి దేశం యోగా ఉపయోగాలు తెలుసుకొని తమ జీవనగమనంలో భాగం చేసుకున్నారని తెలిపారు.యోగ ప్రయోజనాల పట్ల తెలుసుకొని ప్రతిరోజు యోగాసనాలు ద్యానం కోసం సమయం కేటాయించాలని విద్యార్థులు సూచించారు.యోగ అభ్యాసకులు ఎస్. కమలాకర్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతో మేలు చేస్తుందని ముఖ్యంగా విద్యార్థులకు మానసిక ఏకాగ్రతకు శారీరక దృఢత్వానికి అందివ్వడానికే ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేశారు.ఈకార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, స్టాఫ్ సెక్రటరీ ఎంఎంకె రహీముద్దీన్,డాక్టర్ ఎం సోమయ్య, డాక్టర్ రాజీరు, డాక్టర్ సంధ్య, రజిత,విద్యార్థులు పాల్గొన్నారు.

నర్సంపేటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు.

నర్సంపేటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు.

సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నర్సంపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఆ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఫోటోగ్రాఫర్లు, ఫ్లెక్సీ షాపులు డిజైనింగ్ షాపులు, ఫోటోగ్రఫీ అనుబంధ రంగాలకు చెందినవారు స్వచ్ఛందంగా షాపులు బంద్ పాటించి వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్ సమ్మయ్య, చిలువేరు సుదర్శన్ లకు శాలువా సన్మానించి మెమొంటోతో అందజేశారు. అధ్యక్షులు గిరగాని దుర్గేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం పతాకావిష్కరణ చేశారు. అనంతరం డాగురే పుట్టినరోజు సందర్భంగా చిత్రపటం ముందు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా దుర్గేశ్ గౌడ్ మాట్లాడుతూ ఫోటో రంగంలో ఉన్నవారు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఫోటోగ్రాఫి రాష్ట్ర సంఘం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకాన్ని వినియోగించుకొని మన కుటుంబాలకు భరోసాగా ఉండాలని అందరూ కుటుంబ భరోసా పథకంలో చేరాలని కోరారు.సాంప్రదాయ ఫోటో రంగం నుండి నూతన టెక్నాలజీ ఏఐ కి మారాల్సిన అవసరం ఉందని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసేశిక్షణ తరగతులలో పాల్గొనాలని కోరారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దొంతి సంతోష్ గౌడ్, కోశాధికారి సోమేశ్వర్, సహాయ కార్యదర్శి ఎస్ డి జావిద్,ప్రచార కార్యదర్శి బేతి కన్నయ్య,తాటికొండ శివ,ముఖ్య సలహాదారులు కుసుమ శంకర్,బేతి విశ్వబంధు,బండారి సురేష్,అలంపల్లి నరేష్,సతీష్,రాజు, గిన్నరపూ అనిల్, అమ్మ రాజు,కక్కెర్ల రంజిత్ కుమార్ గౌడ్,దయ్యాల బాలరాజు,అంబాల బిక్షపతితో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

ఇంటర్నేషనల్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ లోని ఓసిటీ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థులు ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈనెల 20, 21న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీట్ హై స్కూల్ జరిగే పోటీలలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎ. చందన, 9వ తరగతికి చెందిన బి. రాంప్రసాద్ పాల్గొననున్నారు.రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో రాణించడం తమ లక్ష్యమని విద్యార్థులు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ ఫహీం సుల్తాన, కోచ్ రాజేష్, మధు, ప్రశాంత్ కుమార్, రియాజ్ లతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

స్థానిక సమస్యలు పరిష్కరించాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T160607.508-1.wav?_=4

 

స్థానిక సమస్యలు పరిష్కరించాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

స్థానిక సమస్యలపై సర్వేలు చేసి సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య అన్నారు.నర్సంపేట పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి గ్రామీణ ప్రాంత వర్క్ షాప్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.నాగయ్య మాట్లాడుతూ
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని మంచినీరు,రోడ్ల ధ్వంసం,డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు,కుక్కల,కోతుల బెడద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీల అమలు నెరవేర్చలేదని ఆరోపించారు.అందుకు జిల్లావ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, నమిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య మండల నాయకులు అక్కపెల్లి సుధాకర్, పుచ్చకాయల నర్సింహ రెడ్డి, ఎస్కె అన్వర్, పెండ్యాల సారయ్య, కందికొండ రాజు, కొంగర నర్సింహ స్వామి, కలకోట అనిల్, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ ఉదయగిరి నాగమణి బిట్ర స్వప్న గణిపాక విలియం కెరీ, జన్ను రమేశ్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో కలెక్టర్ పర్యటన.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T165113.038.wav?_=5

వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో కలెక్టర్ పర్యటన.

అధికారులతో కలిసి వాగులు,లో లెవల్ కాజ్ వేలు,వరద ఉధృతిని పరిశీలన

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు,వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు.
వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలసి నర్సంపేట డివిజన్లోని ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటిలో లెవల్ కాజ్ వే ను,నల్లబెల్లి మండలంలోని లేంకాలపెల్లి నందిగామ గ్రామాల మధ్య కాజ్ వే,నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు. కాజ్ వే ల వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి రెడ్ అలర్ట్ గా మారే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెరువులలో నీటిమట్టం ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో భారీ వర్షాలపై టామ్ టామ్ చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో,లో లెవెల్ కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వెళ్లడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు. చెరువులలో ప్రజలను చేపలు పట్టే వారిని రైతులను పశు కాపరులను సందర్శకులను అనుమతించవద్దని అన్నారు.ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారని,విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాల సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువల్ని దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలకు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి,ఆర్డిఓ ఉమారాణి డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, తాహసిల్దారులు రవిచంద్రారెడ్డి, ఎంపీడీవోలు,పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-5.wav?_=6

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

పరవళ్ళు తొక్కుతున్న పాకాల సరస్సు,మాదన్నపేట చెరువు మత్తడి నీరు..

అశోక్ నగర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన పాకాల వరదనీరు..

వట్టేవాగు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మాదన్నపేట చెరువు అలుగు వరద*

కాకతీయ నగర్ కాలనీ వాసుల్లో మొదలైన ఆందోళన.

నర్సంపేట నుండి మాదన్నపేట,,నర్సంపేట నుండి పాకాల కొత్తగూడ రాకపోకలు బంద్.

ప్రమాదాలు జరుగకుండా పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు..రెవెన్యూ మున్సిపల్ ,పంచాయితీ రాజ్ అధికారుల చర్యలు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

నర్సంపేట,నేటిధాత్రి:

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నర్సంపేట డివిజన్ పరిధిలోని సరస్సు,చెరువులు,కుంటులు మత్తల్లు పోస్తున్నాయి.ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పాకాల గత రెండు రోజులుగా అలుగుపోస్తున్న ది.సరస్సులో 31 ఫీట్ల పైబడి వరదనీరు చేరడంతో ఓక ఫీట్ ఎత్తుగా మత్తడి పరవళ్ళు తొక్కుతున్నది.నర్సంపేట మాదన్నపేట చెరువు గత ఐదు రోజులుగా మత్తడి పోస్తూ నేడు వరద ఉదృతం పెరుగుతున్నది.శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి డివిజన్ పరిధిలోని చెరువులు,కుంటలు,వాగులు,వంకలు వరద నీటితో పారుతున్నాయి.నర్సంపేట నుండి పాకాల మీదుగా కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై అశోక్ నగర్ వద్ద ఉన్న పాకాల నీటి ప్రవాహం తీవ్రస్థాయిలో పరవళ్ళు తొక్కుతుంది.

అటువైపు రాకపోకలు పూర్తిస్థాయిలో బంద్ అయ్యాయి.వాగువద్ద ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఖానాపూర్ పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.మాదన్నపేట రోడ్డు వాగు వద్ద వరద నీటి ప్రవాహం ఉదృతం కావడంతో మున్సిపల్,పోలీస్ ,రెవెన్యూ శాఖల అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు.మాదన్నపేట చెరువు ఉగ్రరూపం దాల్చి మత్తడి పడితే చాలు..నర్సంపేట పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలని వాసుల్లో గుబులు పుట్టిస్తోంది.నర్సంపేట నుండి నేక్కొండ వైపు ముగ్దుంపురం కాజ్ వే వద్ద వరద భీభత్సం పెరుగడంతో అటువైపు వెళ్లే వాహనాలను చెన్నారావుపేట పోలీసులు,అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.నల్లబెల్లి మండలం నుండి నందిగామ వైపు వెళ్లే ప్రధాన రహదారి లెంకాలపల్లి నందిగామ గ్రామాల మధ్య ఉన్న లో లెవర్ కాజ్ వే పై వరద నీటితో భయంకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రమాదాలు జరుగకుండా నల్లబెల్లి ఎస్సై,రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు.దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట,ఖానాపూర్,చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చెరువులు,కుంటలు నిండి మత్తళ్ళు పోస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.కొన్ని చోట్ల వాగుల వద్ద చేపలవేట చేస్తున్నారు.అనుకోకుండా ప్రమాదాలు
జరగవచ్చని అధికారులు హెచ్చరించినప్పటికి అవేవీ పట్టించుకోవడం లేదు.

Ashok Nagar

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్ వ్యాప్తంగా చెరువులు,కుంటలు నిండు కుంటల్లా మారి శుక్రవారం అర్థరాత్రి కురిసిన భారీ వానకు అతలాకుతలం అయ్యింది.17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇప్పటికే చెరువులు,కుంటలు వాగులు నిండి భారీ ఎత్తున వరద భీభత్సం సృష్టించింది.ఐతే 17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిస్తే పంటల పరిస్థితి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

*ఋతుపవనాలు ముందుగానే వచ్చినట్లు వచ్చి వెనక్కివెళ్లడంతో సుమారు 20 నుండి నెల రోజుల ఆలస్యంగా రైతులు వరినాట్లు సాగుచేసుకున్నారు.వరినాట్లు జోరందుకుంటున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు,కుంటలు నిండడం వరదలకు వరినాట్లు నీట మునుగడం,కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.మరిన్ని రోజులు వర్షాలు కురిస్తే పంటలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నాయని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి ప్రవాహం వద్ద పోలీస్ అధికారుల సేవలు భేష్..

*నర్సంపేట డివిజన్ పరిధిలోని కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీటి వద్ద ప్రమాదాలు జరుగకుండా రేయింబవళ్లు పహారా కాస్తున్న పోలీస్ అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈలాంటి సేవలు అందించడంలో నర్సంపేట డివిజన్ పోలీసులు ముందుంటారని ప్రజలు పేర్కొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సిద్దిపేట శాసనసభ్యులు,మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు నర్సంపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాగా నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో
బారాస పార్టీ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపి జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి,పట్టణ కమిటీ నాయకులు, యూత్ కమిటీ సభ్యులు,మహిళా విభాగం నాయకులు,మాజీ కౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి,రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మాజీ తన్నీరు హరీష్ రావు నర్సంపేట పట్టణంలో
నెక్కొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన గ్రీన్ స్టార్ హాస్పిటల్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ప్రాంతంలో కిడ్నీ,గుండె,బ్రెయిన్ తదితర అత్యాధునిక పరికరాలతో సర్జరీలు,వైద్య సదుపాయం సేవలు చేయనున్నట్లు తెలిపారు.ఆసుపత్రికి ఆరోగ్య శ్రీ పథకం వచ్చే వరకు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ రోగికి ఉచిత ఓ.పి సేవలు అదుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు.

Green Star Hospital

ర్యామినార్ ఆపరేషన్ దియేటర్ ఏర్పాటు ద్వారా అడ్వాన్స్డ్ శస్త్ర చికిత్సలు నర్సంపేటలో మొదటిసారి వచ్చాయని డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.ఎన్నారై,ఆసుపత్రి డైరెక్టర్ శానబోయిన రాజ్ కుమార్ మాట్లాడుతూ నర్సంపేట పరిదిలో ప్రజలకు తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో తెచ్చమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సుంకరి సంతోష్ రెడ్డి,స్వప్న సుదర్శన్ రెడ్డి, గోనె యువరాజు,డాక్టర్ శ్రీకృష్ణుడు, డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి,డాక్టర్ ఓం ప్రకాష్,డాక్టర్ రాహుల్,డాక్టర్ విద్య,డాక్టర్ కిరణ్ రెడ్డి,రాష్ట్ర మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్,వై.సతీష్ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు,ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ,పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,నియోజకవర్గ యూత్ కన్వీనర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్ లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,ప్రజాసంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

బెజ్జంకి ప్రభాకర్‌కు సీఎం సహాయ నిధి సాయం..

బెజ్జంకి ప్రభాకర్ కు రూ.21 వేల చెక్కు అందజేత.*

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు బెజ్జంకి ప్రభాకర్ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోగా ఎక్కువ మొత్తంలో ఖర్చులు అయ్యాయి.కాగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 21 వేలు మంజూరు అయ్యాయి.ఎమ్మెల్యే సూచనల మేరకు పట్టణ 21వ వార్డ్ ఇంచార్జి, మాజీ వార్డ్ మెంబర్స్ కొయ్యడి సంపత్, గాజుల రమేష్ లు ఆ చెక్కును బెజ్జంకి ప్రభాకర్ కు అందజేశారు.నిరుపేద కుటుంబాలకు చేయూతగా ముఖ్య మంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని బెజ్జంకి ప్రభాకర్ తెలియజేశారు.కార్యక్రమంలో గిరగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయుల పురావస్తు శాఖ ప్రభుత్వ భూములను కాపాడాలి

కాకతీయుల పురావస్తు శాఖ ప్రభుత్వ భూములను కాపాడాలి

పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయాలి

ప్రభుత్వ భూములను కబ్జా చేసే రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

కాకతీయుల కాలం కోట పురావస్తు ప్రభుత్వ భూములను రక్షించి పేదల స్వాధీనంలో ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేసి వివిధ రకాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి క్రయవిక్రయాలకు పాల్పడుతున్న రియాల్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.బుదవారం ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి బృందం గీసుకొండ మండలం మొగిలిచర్ల శివారు పోగుల ఆగయ్య నగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను అందులో నివసిస్తున్న పేదల నివాసాలను అక్రమంగా కూల్చివేసిన ఇండ్లను సందర్శించారు.

ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నీడకోసం వివిధ రకాల ప్రభుత్వ భూములను గుర్తించి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల పట్ల రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం యంత్రాంగం ఆ ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉండడం ఆందోళనకరమన్నారు.అనేక సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే ఇంటి పట్టాలు,కరెంటు, రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాల్సిందిపోయి దుర్మార్గంగా ఇండ్లనే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.పురావస్తు శాఖకు సంబంధించిన అనాటి కాకతీయుల కోట భూములను రక్షించకపోవడం వల్ల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు యెదేచ్ఛగా ఆక్రమించి క్రయవిక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసులు పెట్టిన నేటికీ నమోదు చేయకపోవడం,అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా తక్షణమే పేదల ఇండ్లను కూల్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని పేదలకు వారి ఇండ్లకు రక్షణ కల్పించి ప్రభుత్వ భూముల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే పేదలను సమీకరించి భూ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గణిపాక రేణుక,సదానందం,ఆకులపెళ్లి చంద్రమౌళి, గణిపాక అరుణ్, మిట్టపల్లి మరియా కుమారస్వామి, రాజేశ్వరి, శ్రీకాంత్, రవి, స్వప్న, వనమ్మ, వినోద తదితరులు పాల్గొన్నారు.

సోలార్ లైట్ బ్యాటరీల చోరీ.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-13T141959.423-1.wav?_=7

సోలార్ లైట్ బ్యాటరీల చోరీ.

#సుమారు రూ.20 వేల విలువల బ్యాటరీలు

#పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పంచాయితీ సెక్రటరీ.

#సిసి కెమెరాలు ఉంటే దొంగతనాలు జరిగుండేవి కావు..గ్రామస్తులు

నర్సంపేట,నేటిధాత్రి:

రోడ్డుపై ఉన్న సోలార్ విద్యుత్ స్తంభం బ్యాటరీలు చోరికి గురైన సంఘటన నర్సంపేట మండలంలోని బాంజిపేట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది.గ్రామస్తులు,గ్రామ పంచాయితీ సెక్రటరీ స్నేహాలత తెలిపిన వివరాల ప్రకారం బాంజిపేట గ్రామంలో ప్రధాన కూడలి బొడ్రాయి వద్ద గల సోలార్ లైట్ విద్యుత్ స్తంభంకు ఉన్న సుమారు 20 వేల రూపాయల విలువ గల రెండు బ్యాటరీలను స్తంభం బాక్సులు ధ్వంసం చేసి దొంగతనం చేశారని తెలిపారు.దొంగతనం పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని కార్యదర్శి స్నేహాలత పేర్కొన్నారు.


సిసి కెమెరాలు ఉంటే దొంగతనాలు జరిగుండేవి కావు…

గ్రామంలో అన్ని ప్రాంతాల్లో సీసి కెమెరాలు ఉంటే దొంగతనానికి పాల్పడిన వారిని సులభంగా గుర్తించవచ్చునని గ్రామస్తులు తెలిపారు.అలాగే మున్ముందు చోరీలకు పాల్పడ్డాలన్న దొంగలకు బాయం ఉంటుందని దీంతో చోరీలకు
చెక్ పెట్టవచ్చని వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.పోలీస్ అధికారుల చొరువతో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.అలాగే గ్రామంలో సోలార్ విద్యుత్ స్తంభం బ్యాటరీలను దొంగతనం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను విన్నవించారు.

నరకయాతన… కంకర రోడ్లపై ప్రయాణం..!

నరకయాతన… కంకర రోడ్లపై ప్రయాణం..!

#అన్నదాతలకు, ప్రజలకు తప్పని తిప్పలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల ప్రజలకు, అన్నదాతలకు కంకర రోడ్లతో కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మండల వ్యాప్తంగా పలు లింకు రోడ్లకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయగా కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని కొంత మేరకు పనులు చేపట్టారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారి పనులు నిలిచిపోయాయి. దీంతో కంకర తేలిన రోడ్లపై అన్నదాతలు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. నడక సైతం నరకప్రాయంగా మారిన దుస్థితి నెలకొంది. మండలంలోని గుండ్ల పహాడ్ నుండి మేడేపల్లి వరకు, నారక్క పేట నుండి నర్సంపేట మండలం రామ్ నగర్ వరకు, ముచింపుల నుండి నందిగామ వరకు, నల్లబెల్లి ఆర్ అండ్ బి రోడ్డు నుండి అనుములోని పల్లె వరకు, కొండాలపల్లి నుండి గుంటూరు పల్లె వరకు అక్కడి నుండి పెద్ద చెరువు కట్ట చివరి వరకు. తారు రోడ్ల నిర్మాణం కోసం 2023 జనవరిలో ఎం ఆర్ ఆర్ గ్రాంటు కింద నిధులు మంజూరు అయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఫార్మేషన్ పూర్తి చేసి కంకర వేసి తొక్కించారు. ఆ సమయంలోనే సాధారణ ఎన్నికలు రాగా పనులు ఆపివేశారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటి నుండి రెండేళ్లగా కంకర తేలిన రోడ్లపైనే రైతులు, ప్రజలు ప్రయాణం సాగించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకరపై నడవవలసి వస్తుండడంతో దుక్కి టేద్దులు కాళ్లు పగిలిపోయి అనారోగ్యం పాలవుతున్నాయి. పలుమార్లు కాళ్లకు రక్త గాయాలైన కొన్ని దుక్కి టేద్దులు కంకర రోడ్లపైకి తీసుకువస్తే బెంబేలెత్తి పారిపోతున్న దుస్థితి చోటుచేసుకుంది. రోడ్ల పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. ఏది ఏమైనాప్పటికీ కంకర రోడ్లపై తక్షణమే తారు రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని పనులు కొనసాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

#సకాలంలో బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తి చేస్తాం.
కాంట్రాక్టర్లు ఫార్మేషన్, కంకర పనులు పూర్తి చేయగా బీటీ పనులు మాత్రమే మిగిలాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోనే పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి ఆదేశాల మేరకు పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

రజనీకాంత్, స్పెషల్ ఏఈ, పిఆర్ శాఖ.

ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై రామానుజాచార్యులు పర్యవేక్షణలో పొడిచేటి శేషాచార్యులు ముడుంబై శ్రీకరాచార్యులు కార్యక్రమాన్ని చేపట్టారు.ఆలయ చైర్మన్ ఎర్ర జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13 న ఉదయం 10 గంటలకు సుదర్శన నరసింహ యాగము లోక కళ్యాణార్ధం జరుపనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా.!

స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం స్థానిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలో భాగంగా నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గుడ్డెలుగులపల్లి గ్రామంలో 16 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ధిని తుంగలో తొక్కి అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి చేసి ప్రజలను పట్టించుకోలేదని నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ మండల పార్టీ నిత్యం ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రసిడెంట్ ఓలిగే నర్సింగరావు, గ్రామ క్లస్టర్ ఇంచార్జ్ బొల్లాపెల్లి రాము గౌడ్ ,క్లస్టర్ ఇంచార్జ్ మట్ట రాజు యాదవ్, మండల కార్యదర్శి అమ్మ రోహిత్,ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్,కోశాధికారి జంగిలి రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు జంగిలి నగేష్, మండల యూత్ నాయకులు తోరూరి రవి, గుండకారి సునీల్,కొలుగూరి సుమంత్,గ్రామ నాయకులు రమేష్, నరసయ్య, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుగా గన్న రాజేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్స్,మంచిక హరీష్,పెండ్యాల స్వామి,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,అధికార ప్రతిధులుగా బుస శ్రీశైలం,దారావత్ మహేందర్,ఉపాధ్యక్షులు భాషబోయిన ప్రవీణ్,కర్దూరి హరీష్,కొంగర మురళీ,ఆల్లె రాజు,గజ్జి రాము,సహాయ కార్యదర్శులు జినుకల అఖిల్,పుట్ట అఖిల్,బయ్య నవీన్,చెరిపెల్లి రాజు,కోశాధికారి అజ్మీర నరేష్,కార్యవర్గ సభ్యులు చిలుక నరేందర్,దరావత్ రాజు,వాంకుడోతు అక్షయ్ కుమార్,
మోటం హరీష్,నునావత్ పవన్ కుమార్,భూక్య సుమన్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు.మండలం లోని అన్ని గ్రామాల నుండి ఎన్నిక చేయడం జరిగిందని మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,క్లస్టర్ ఇన్చార్జి మోటురి రవి,సీనియర్ నాయకులు బోల్లం బక్కయ్య,గడ్డం రాజు,బగ్గి రాజు,జై కిసాన్,బాణోత్ రవి,చిప్ప ప్రశాంత్,సమ్మెట రంగయ్య తదతరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version