నర్సంపేటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు.
సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మానం
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నర్సంపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఆ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఫోటోగ్రాఫర్లు, ఫ్లెక్సీ షాపులు డిజైనింగ్ షాపులు, ఫోటోగ్రఫీ అనుబంధ రంగాలకు చెందినవారు స్వచ్ఛందంగా షాపులు బంద్ పాటించి వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్ సమ్మయ్య, చిలువేరు సుదర్శన్ లకు శాలువా సన్మానించి మెమొంటోతో అందజేశారు. అధ్యక్షులు గిరగాని దుర్గేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం పతాకావిష్కరణ చేశారు. అనంతరం డాగురే పుట్టినరోజు సందర్భంగా చిత్రపటం ముందు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా దుర్గేశ్ గౌడ్ మాట్లాడుతూ ఫోటో రంగంలో ఉన్నవారు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఫోటోగ్రాఫి రాష్ట్ర సంఘం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకాన్ని వినియోగించుకొని మన కుటుంబాలకు భరోసాగా ఉండాలని అందరూ కుటుంబ భరోసా పథకంలో చేరాలని కోరారు.సాంప్రదాయ ఫోటో రంగం నుండి నూతన టెక్నాలజీ ఏఐ కి మారాల్సిన అవసరం ఉందని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసేశిక్షణ తరగతులలో పాల్గొనాలని కోరారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దొంతి సంతోష్ గౌడ్, కోశాధికారి సోమేశ్వర్, సహాయ కార్యదర్శి ఎస్ డి జావిద్,ప్రచార కార్యదర్శి బేతి కన్నయ్య,తాటికొండ శివ,ముఖ్య సలహాదారులు కుసుమ శంకర్,బేతి విశ్వబంధు,బండారి సురేష్,అలంపల్లి నరేష్,సతీష్,రాజు, గిన్నరపూ అనిల్, అమ్మ రాజు,కక్కెర్ల రంజిత్ కుమార్ గౌడ్,దయ్యాల బాలరాజు,అంబాల బిక్షపతితో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.