కాకతీయుల పురావస్తు శాఖ ప్రభుత్వ భూములను కాపాడాలి

కాకతీయుల పురావస్తు శాఖ ప్రభుత్వ భూములను కాపాడాలి

పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయాలి

ప్రభుత్వ భూములను కబ్జా చేసే రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

కాకతీయుల కాలం కోట పురావస్తు ప్రభుత్వ భూములను రక్షించి పేదల స్వాధీనంలో ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేసి వివిధ రకాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి క్రయవిక్రయాలకు పాల్పడుతున్న రియాల్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.బుదవారం ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి బృందం గీసుకొండ మండలం మొగిలిచర్ల శివారు పోగుల ఆగయ్య నగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను అందులో నివసిస్తున్న పేదల నివాసాలను అక్రమంగా కూల్చివేసిన ఇండ్లను సందర్శించారు.

ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నీడకోసం వివిధ రకాల ప్రభుత్వ భూములను గుర్తించి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల పట్ల రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం యంత్రాంగం ఆ ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉండడం ఆందోళనకరమన్నారు.అనేక సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే ఇంటి పట్టాలు,కరెంటు, రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాల్సిందిపోయి దుర్మార్గంగా ఇండ్లనే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.పురావస్తు శాఖకు సంబంధించిన అనాటి కాకతీయుల కోట భూములను రక్షించకపోవడం వల్ల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు యెదేచ్ఛగా ఆక్రమించి క్రయవిక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసులు పెట్టిన నేటికీ నమోదు చేయకపోవడం,అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా తక్షణమే పేదల ఇండ్లను కూల్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని పేదలకు వారి ఇండ్లకు రక్షణ కల్పించి ప్రభుత్వ భూముల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే పేదలను సమీకరించి భూ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గణిపాక రేణుక,సదానందం,ఆకులపెళ్లి చంద్రమౌళి, గణిపాక అరుణ్, మిట్టపల్లి మరియా కుమారస్వామి, రాజేశ్వరి, శ్రీకాంత్, రవి, స్వప్న, వనమ్మ, వినోద తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version