స్థానిక సమస్యలు పరిష్కరించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య..
నర్సంపేట,నేటిధాత్రి:
స్థానిక సమస్యలపై సర్వేలు చేసి సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య అన్నారు.నర్సంపేట పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి గ్రామీణ ప్రాంత వర్క్ షాప్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.నాగయ్య మాట్లాడుతూ
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని మంచినీరు,రోడ్ల ధ్వంసం,డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు,కుక్కల,కోతుల బెడద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీల అమలు నెరవేర్చలేదని ఆరోపించారు.అందుకు జిల్లావ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, నమిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య మండల నాయకులు అక్కపెల్లి సుధాకర్, పుచ్చకాయల నర్సింహ రెడ్డి, ఎస్కె అన్వర్, పెండ్యాల సారయ్య, కందికొండ రాజు, కొంగర నర్సింహ స్వామి, కలకోట అనిల్, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ ఉదయగిరి నాగమణి బిట్ర స్వప్న గణిపాక విలియం కెరీ, జన్ను రమేశ్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.