అమ్మవారి గుడి స్థలం ఆక్రమణ

అమ్మవారి గుడి స్థలం ఆక్రమణ

* ఎమ్మార్వోను కలిసి వినతి పత్రం అందజేసిన అల్లవాడ గ్రామస్తులు

నేటిధాత్రి, చేవెళ్ల :

 

గుడి స్థలాన్ని కబ్జాచేసి ఇంటి ప్రహరీ నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అల్లవాడ గ్రామస్తులు బుధవారం చేవెళ్ల ఎమ్మార్వోను కలిసి వినతి పత్రం అందజేశారు. చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో అదే గ్రామానికి చెందిన బోనగిరి సంజీవ అనే వ్యక్తి గ్రామంలో 50 ఏళ్లుగా పూజాలందుకుంటున్న మైసమ్మతల్లి అమ్మవారి గుడి స్థలాన్ని ఆక్రమించి ఇంటి ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని గుడి స్థలాన్ని కాపాడాలని గ్రామానికి చెందిన మలగళ్ల రామకృష్ణ, మలగళ్ళ శివశంకర్, గ్రామస్థులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ రాజేంద్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 50 ఏళ్లుగా అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుంటున్నామని, అమ్మవారికి గుడి లెనందున పెద్దమనుషుల సహకారంతో త్వరలో గుడి నిర్మాణం చేపట్టదలుచుకున్నామని, ఇంతలోనే సంజీవ అనే వ్యక్తి గుడి స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని ఆరోపించారు.

ఈ ఆక్రమణ పై గ్రామంలో పెద్దమనుషుల పంచాయతీ జరిగిందని, ఈ పంచాయతీలో గ్రామ సర్పంచి, ఉపసర్పంచులు మరికొంతమంది పెద్దమనుషులు చెప్పిన సంజీవ లెక్కచేయకుండా ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ మొండివైఖరి అవలంబిస్తూ ఆక్రమణ కు పాల్పడ్డాడని అన్నారు. ఈ విషయంపై వివాదం చెలరేగటంతో గత నాలుగు రోజుల క్రితం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు కూడా చేశామని రామకృష్ణ, శివశంకర్ తెలిపారు. వెంటనే ఆక్రమణకు గురైన అమ్మవారి గుడి స్థలాన్ని కబ్జాచేరలోంచి విడిపించి, సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ అల్లావాడ గ్రామ అధ్యక్షులు శివగాళ్ల విజయ్ కుమార్, ఎమ్మార్పిఎస్ గ్రామ అధికారప్రతినిధి బోనగిరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఖబడ్దార్ ఒంటెద్దు నరసింహారెడ్డి.

ఖబడ్దార్ ఒంటెద్దు నరసింహారెడ్డి.

ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే అర్హత నరసింహారెడ్డి, రఘు లకు లేదు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి

కోదాడ మండల అధ్యక్షులు తుమాటి వర ప్రసాద్ రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి :

 

రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని విమర్శించే అర్హత బిఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహరెడ్డి, పిల్లుట్ల రఘ లకు లేదని వారి స్థాయి మరిచి విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఊరుకోరని కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామి రెడ్డి, ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు భాష బోయిన భాస్కర్ లు ఖండించారు మంగళవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో వరప్రసాద్ రెడ్డి నివాస గృహములో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. హుజూర్నగర్ కు చెందిన పిల్లుట్ల రఘు అనే వ్యక్తి బిఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై దుర్మార్గంగా మాట్లాడడం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుందన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ మెజార్టీ వచ్చిందన్నారు. గ్రామంలో ఏమి చేయలేక ఒక ముఠాగా ఏర్పడి దోచుకున్న చరిత్ర ఒంటెద్దు నరసింహారెడ్డిది అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులపై అర్థరహిత విమర్శలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. కోదాడ నియోజకవర్గంలో హుజూర్నగర్ నియోజకవర్గాలలో వారి పర్యటనలు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొని తిరగనివ్వరని హెచ్చరించారు. ఈ ఇరువురు నాయకులు స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడాలని లేనిపోని విమర్శలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈడ్చి రోడ్డుకు కొడతారని హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి మచ్చలేని అనేక అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం 200 కోట్లతో నిర్మిస్తున్న 2160 ఇండ్లు కంటికి కనిపించట్లేదా, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లను అభివృద్ధి చేయడం కూడా దుర్మార్గమా అని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని మీరు దుర్మార్గులని ఇప్పటికైనా అబద్దపు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై చేసిన విమర్శలను తాము వదిలేది లేదని ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టు నోటీసులు కూడా అందిస్తామన్నారు. ఒంటెద్దు నరసింహారెడ్డి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒంటెద్దు నరసింహారెడ్డి పిల్లుట్ల రఘు లపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, ఉపసర్పంచ్ ఇర్ల జయసింహారెడ్డి, గణపవరం గ్రామ సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య, రామలక్ష్మీ పురం సర్పంచ్ తులసమ్మ గంగిరెడ్డి, కన్నా రెడ్డి, కూచిపూడి తండా సర్పంచ్ హాజీ నాయక్, దొరకుంట గ్రామ సర్పంచ్ పాలకి సురేష్, కాంగ్రెస్ నాయకులు మండలపు శేషు, ఇర్ల నరసింహారెడ్డి, పులి ఇస్సాకు, ప్రసాద్ రెడ్డి,ముకుంద,కాంగ్రెస్ పార్టీ గుడిబండ గ్రామ అధ్యక్షులు ఎస్కే రఫీ, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఖండన

 

Congress Leaders Strongly Condemn Remarks on Uttam Kumar Reddy

 

కోదాడ: రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పిల్లుట్ల రఘు చేసిన వ్యాఖ్యలను కోదాడ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

గుడిబండ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామిరెడ్డి, ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్ బోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారని, హుజూర్నగర్ మరియు కోదాడ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.

2160 ఇళ్ల నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధిని చూడలేని వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించిన నాయకులు, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

నిమ్జ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం…

నిమ్జ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో నిమ్జ్ తొలి దశలో స్వాధీనం చేసుకున్న భూముల సరిహద్దుల గుర్తింపు, పెంచింగ్ పనులు, సమీప రహదారుల అభివృద్ధి, నిమ్స్‌కు అనుసంధానించే ప్రధాన మార్గాల విస్తరణ వంటి అంశాలపై నిమ్జ్, టీజీఐఐసీ అధికారులు, సర్వే మరియు రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ తెలిపారు, నిమ్జ్‌లో మౌలిక వసతులు కల్పించడానికి ఎస్‌ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటివరకు సేకరించిన భూములను అప్పగించాలన్నారు.లే అవుట్ అభివృద్ధి కోసం పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలని, లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి భూములలో హద్దురాళ్ళను వేయాలని ఆదేశించారు.

మునుపు భూములు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించగా, పని ఆలస్యంగా ప్రారంభించకపోవడం వల్ల పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని కలెక్టర్ వివరించారు. ఇప్పుడు అభివృద్ధి పనులు ప్రారంభించనుండడంతో, పంటలు వేసిన ఉంటే కోతలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని, తదుపరి పంటలు వేయకుండా చూడమని తెలిపారు. సర్వే శాంతియుత వాతావరణంలో, ఏ ఆటంకం లేకుండా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సర్వే సమయంలో హద్దురాళ్లను ఎవరూ తొలగించరాని విధంగా హెచ్చరించారు;ఎవరైనా చేస్తే చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తాహిల్దార్లతో సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.అదనంగా, సంగారెడ్డి నియోజకవర్గంలోని మున్సిపల్ పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు కావాల్సిన పాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. పట్టణ పాఠశాలల వసతి గృహాల్లో సానిటేషన్, టాయిలెట్ సమస్యలపై కూడా ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. కలెక్టర్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పాస్టర్లపై దాడి: నిందితుడిపై కేసు నమోదుకు క్రైస్తవ సంఘాల డిమాండ్…

పాస్టర్లపై దాడి: నిందితుడిపై కేసు నమోదుకు క్రైస్తవ సంఘాల డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అనేగుంట గ్రామంలో శనివారం నాడు పాస్టర్ సంజీవ్, పాస్టర్ సురేష్ తమ బృందంతో కలిసి బహిరంగ సువార్త ప్రకటించడానికి వెళ్లారు. సువార్త ప్రకటిస్తున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి దైవ దూషణ చేస్తూ, సేవకులను బూతు మాటలతో దూషిస్తూ వారిపై దాడికి దిగాడు. క్రైస్తవ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడి, అగౌరవపరిచిన రాకేష్ పై భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, మత స్వేచ్ఛ హక్కులను కాలరాస్తూ దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, తగిన శిక్ష వేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు సోమవారం నాడు జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనేగుంట గ్రామంలో పాస్టర్లపై జరిగిన ఈ దాడి అమానుషమని వారు పేర్కొన్నారు.

తంగళ్ళపల్లిలో భూమి కబ్జాపై న్యాయం కోరిన యజమాని

నాకు ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఒక వ్యక్తి మాకు న్యాయం చేయాలంటూ.ప్లడ్ కార్డులతో. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ .బటాయించాడు. సందర్భంగా.వేములవాడకు చెందిన .కొండబత్తిని సత్యం. అనే ఇతను గతంలో లక్ష్యం పూర్ గ్రామంలో.సర్వేనెంబర్. 1170. నెంబర్లో. సబ్ స్టేషన్ పక్కన మూడు ఎకరాల ల్యాండ్ నా పేరు మీద ఉన్నది దానికి 2015. జనవరి 26 వ. సంవత్సరంలో బోరు వేయించడం జరిగింది. బోరును. నడవకుండా ఖరాబు.చేయడంతో పాటు. నన్ను చంపుతానని భయ ప్రాంతాలకు గురి చేస్తూ నా భూమిని కబ్జా చేసుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు వారితో నాకు ప్రాణ భయం ఉన్నది దయచేసి సంబంధిత అధికారులు దీనిపై తగు విచారణ చేసి నాకు సంబంధించిన మూడు ఎకరాల భూమి నాకు ఇప్పించవలసిందిగా అధికారులు కోరుచున్నాను ఇట్టి విషయమై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ బటాయించడం జరిగిందని. ఇందులో. గుర్రం అంజయ్య. ఆయన కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి. నాకు సంబంధించిన భూమిని కబ్జా చేసుకుని నన్ను చంపుతానని బెదిరిస్తూ. నాకు సంబంధించినజాగను. నాకు కాకుండా బెదిరిస్తున్నారు వీరితో మాకు ప్రాణ భయం ఉన్నందున పోలీసులు అయినా రెవెన్యూ అధికారులైన సంబంధిత భూమిపై విచారణ చేపట్టి అర్హులైన మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము

సీతారాంపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు అదృశ్యం

వ్యక్తి అదృశ్యం

* సీతారాంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యంచేవెళ్ల,

 

ఇంట్లో నుంచి బయటకువెళ్లిన వ్యక్తి అదృష్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చించేటి బాలయ్య వయస్సు ( 73) అనే వ్యక్తి గతనెలా డిసెంబర్ 30న ఉదయం 6గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. 24గంటలు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు. దీంతో కనిపించకుండా పోయిన తన తండ్రి ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఆయన కుమారుడు చించేటి గణేష్ జనవరి 1న షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఆచూకీ తెలియకపోవటంతో మరోసారి ఈ నెల 8న చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. బాలయ్య ఆచూకీ తెలిసినవాళ్ళు తమకు సమాచారం తెలపాలని కుటుంబసభ్యులు కోరారు. మొబైల్ నెంబర్: 9000692257,9133445503.

పోలీసు అధికారులపై డీజీపీకి పిర్యాదు…

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-03T114905.736.wav?_=1

 

పోలీసు అధికారులపై డీజీపీకి పిర్యాదు?

న్యాయవ్యవస్థపై నమ్మకం, అవసరానికేనా?

అప్పుడొక న్యాయం. ఇప్పుడొక తీర్పా?

కోర్టులో తేలాల్సిన విషయాలపై ముందస్తు ముద్రలు సరికాదని విమర్శలు

నేటిధాత్రి, వరంగల్

 

పోలీసులపై ఫిర్యాదు చేసిన సదరు నాయకుడి కుమారునిపై దాదాపు పదేళ్ల క్రితం నమోదు చేసిన కేసులో, న్యాయవ్యవస్థపై నమ్మకంతో కోర్టులో పోరాడి చివరకు నిరపరాధిగా తేలిన ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 23, 2025న కోర్టు ఆ కేసులో విముక్తి ప్రకటించడంతో అప్పట్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేసిన అదే నాయకుడు, ఇప్పుడు మాత్రం భిన్న వైఖరిని అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అప్పుడూ కోర్టే… ఇప్పుడూ కోర్టే కదా?

తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను, కోర్టు పరిధిలోకి వెళ్లకముందే “తప్పుడు కేసులు”గా ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ కుమారుడి విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందిన నాయకుడు, ఇప్పుడు ఇతరుల విషయంలో అదే న్యాయవ్యవస్థపై ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

డీజీపీకి లేఖలు… ఉద్దేశం ఏమిటి?

కేసులు నమోదైన వెంటనే వాటిని తప్పుడు కేసులుగా పేర్కొంటూ పోలీసు అధికారులపై విచారణ జరపాలని డీజీపీకి వినతిపత్రాలు ఇవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. చట్టబద్ధంగా విధులు నిర్వహించిన పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇబ్బంది పడేది ప్రజలే

తూర్పు నియోజకవర్గంలో సాగుతున్న ఈ రాజకీయ పంచాయతీల వల్ల చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెట్టిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నారు.

అభివృద్ధి ఎక్కడ? రాజకీయాలు ఎక్కడ?

వరద బాధితులు సహాయం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తుండగా, మరోవైపు తూర్పు నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. అన్ని కార్యాలయాలు హన్మకొండలోనే ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఈ అంశాలపై పోరాటం చేయాల్సిన నాయకులు గ్రూపు రాజకీయాల్లో మునిగిపోయారని విమర్శలు వస్తున్నాయి.

న్యాయవ్యవస్థను నమ్మితే, అందరికీ సమానంగా నమ్మాలి

న్యాయస్థానాల్లో తేలాల్సిన అంశాలపై ముందే తీర్పులు ఇవ్వడం, అదే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పుకునే నేతలకు శోభించదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాజకీయ పోటీలు ఉంటే నేరుగా తేల్చుకోవాలి కానీ, ప్రజల సమస్యలు, అభివృద్ధిని పక్కదారి పట్టించకూడదని స్థానికులు హితవు పలుకుతున్నారు.

ప్రజల కోసం పనిచేద్దాం… రాజకీయాలకు హద్దులు పెట్టేద్దాం

పక్క నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుండగా, వరంగల్ తూర్పు మాత్రం గ్రూపు రాజకీయాలు, సమావేశాలతోనే పరిమితమవుతుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా నాయకులు రాజకీయ లాభాలకన్నా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మండలంలో రెచ్చిపోతున్న కాపర్ దొంగలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-16T123609.288.wav?_=2

 

 

మండలంలో రెచ్చిపోతున్న కాపర్
దొంగలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మోడే పు వెంకన్న వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారాను మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫారాన్ని పగలగొట్టి కాపరు వైరుని ఎత్తుకెళ్లిన దొంగలు బాధితుడు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ రాజశేఖర్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి.తక్షణమే . పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెండు నెలల్లో వరుసగా మూడు దొంగతనాలు జరగడంతో రైతులు తమ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్పరాలను ఎన్ని పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు

మండలంలో కాపర్ దొంగలు హల్ చల్..

మండలంలో కాపర్ దొంగలు హల్ చల్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల మోతే గ్రామపంచాయతీ పరిధిలోని మోతే గ్రామ శివారులో , ఏల్లు సోమిరెడ్డి వాసిరెడ్డి రాజేందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారలను బుధవారం రోజు తెల్లవారుజామున పగలగొట్టి కాపరు వైరును ఎత్తుకెళ్లిన దొంగలు మండలంలో గతవారం మద్దలగూడెంలో జరగగా ఈ వారం మోతే శివారులో రెండోసారి వరుస కాపర్ దొంగలు పెరుగుతున్నారు రైతులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం నీళ్లు పెడదామని వెళ్ళగా స్టార్టర్ లో కరెంటు లేకపోవడంతో ట్రాన్స్ఫారం కాడికి పోయి చూడగా ట్రాన్స్ఫారం కిందపడి ఉండగా దానిలో ఉన్న కాపర్ వైర్ ను దొంగలించడం జరిగింది తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ పై కేసు నమోదు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T154456.333.wav?_=3

 

యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ పై కేసు నమోదు చేయాలి

ఎల్తూరి సాయికుమార్ స్వేరో

హన్మకొండ, నేటిధాత్రి:

 

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజున హనుమకొండ జిల్లా లో మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయపరంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కాంగ్రెస్ పథకాల వైఫల్యాలను ఎండగడుతూ ఆరోపించడం జరిగింది. దీనికి ప్రతి ఆరోపణగా యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వ్యక్తిగతంగా గుండు మీద బొచ్చు లేదు గుండు లోపల మెదడు లేదు అంటూ పలికిన మాటలను యావత్ తెలంగాణ రాష్ట్ర స్వేరోస్ ,అభిమానులు ,విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందున తోట పవన్ పై కేసు నమోదు చేయాలని హనుమకొండ ఎస్ హెచ్ ఓ ఇంచార్జ్ ఎస్ఐ సతీష్ కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అధ్యక్షులు చెట్టుపల్లి శివకుమార్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఒకేషనల్ కాలేజ్ నాయకులు రణధీర్ ,చరణ్ ,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్‌పై రెచ్చిపోయిన మహిళ.. చెప్పుతో చావు దెబ్బలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T125810.598.wav?_=4

 

జర్నలిస్ట్‌పై రెచ్చిపోయిన మహిళ.. చెప్పుతో చావు దెబ్బలు..

https://youtu.be/xGnaT5-iegs?si=6pBSk0-thejW7gk3

 

ఓ మహిళ న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌పై దాడి చేసింది. విచక్షణా రహితంగా అతడ్ని కొట్టింది. దాడి దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు సైతం దిగింది.

న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌కు దారుణమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళ అతడిపై చెప్పుతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టింది. బూతులతో రెచ్చిపోయింది. బెదిరింపులకు సైతం దిగింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత జర్నలిస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఫిరోజ్‌పూర్‌కు చెందిన రాహుల్ ఉపాధ్యాయ స్థానిక మీడియా సంస్థలో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతడు శుక్రవారం రాత్రి న్యూస్ కవర్ చేయడానికి సుభాష్ తిరహ ప్రాంతానికి వెళ్లాడు.
న్యూస్ కవర్ చేస్తున్న సమయంలో నాలుగు నుంచి ఐదుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడినంతా వీడియో తీయటం మొదలెట్టారు. ముస్కాన్ అనే మహిళ రెచ్చిపోయి ప్రవర్తించింది. రాహుల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా అతడిపై చెప్పుతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దాదాపు ఏడు సార్లు చెప్పుతో ముఖంపై కొట్టింది. దాడి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ముస్కాన్, ముస్కాన్ భర్త బెదిరింపులకు దిగారు.

కనబడటం లేదని భర్త ఫిర్యాదు…

కనబడటం లేదని భర్త ఫిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణములోని రామ్ నగర్ నందు నివాసం ఉంటున్న జీలనుద్ధిన్ తండ్రి జహిరుద్ధిన్ వయస్సు :29 సం.రాలు ,కులం :ముస్లిం ,వృతి. కూలి పని పిర్యాది గారి భార్య అయిన మహా భీష్ భర్త జీలనుద్ధిన్, వయస్సు: 19 సం.రాలు, వృతి:ఇంటిపని నివాసం రామ్ నగర్ జహీరాబాద్ గారిని అదృశ్యంపై జహీరాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీలనుద్ధిన్ ఫిర్యాదు ప్రకారం,తేది 05.11.2025 నాడు ఉదయం 11:30 గంటలకు రామ్ నగర్ లోని అద్దె ఉంటున్న ఇంటి వద్ద నుండి వెళ్లిపోయి ఇప్పటికి తిరిగి రాలేదని ఫిర్యాది తన భార్య గురించి బంధువుల, స్నేహితులు తెలిసిన వారి వద్ద అన్ని చోట్ల వెతుకిన ఎక్కడ కూడా ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు కె. వినయ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జహీరాబాద్ టౌన్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు…

 భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు

 

భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి.

మెదక్, నవంబర్ 6: భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్దమ్మ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్ధులు.. గ్రామ శివారులోని పొలం వద్ద సిద్దమ్మ సహా ఆమె కుటుంబీకులను తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తమను బెదిరించారని, కాల్చేస్తామంటూ బయపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘నాకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది.. నా ఛాంబర్ ఎక్కడా?’.. మహిళ హల్‌చల్…

‘నాకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది.. నా ఛాంబర్ ఎక్కడా?’.. మహిళ హల్‌చల్

 

తనకు కామారెడ్డి కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని, తన ఛాంబర్ ఎక్కడ అంటూ కలెక్టర్ కార్యాలయంలో మహిళ హడావిడి చేసింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలో హల్ చల్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయింది.

కామారెడ్డి, నవంబర్ 6: కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మహిళ.. తనకు కామారెడ్డి కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని, తన ఛాంబర్ ఎక్కడ అంటూ కలెక్టర్ కార్యాలయంలో హడావిడి చేసింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలో హల్ చల్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. దీంతో మహిళపై డిఆర్ఓ మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులతో కారులో బుధవారం మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద సదురు మహిళను గుర్తించారు. అదనపు కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాన్స్ఫార్మర్ పగల గొట్టి కాపర్ వైర్ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T134752.297.wav?_=5

 

ట్రాన్స్ఫార్మర్ పగల గొట్టి కాపర్ వైర్ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం లో దొంగల హల్చల్,వ్యవసాయ మోటార్లకు విద్యుత్ అవసరాల కొరకు ఏర్పాటు చేసినా ట్రాన్స్ఫార్మర్ ను పగులగొట్టి కాపర్ వైర్ దొంగిలించి ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు,

తెల్లవారుజామున గుర్తించిన స్ధానిక రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడం తో హెల్పర్ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చూసి పోలీసులకు పిర్యాదు చేసినా విద్యుత్ అధికారులు.

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T121752.081.wav?_=6

 

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం

నేటిధాత్రి, ఏనుమాముల

 

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. తమ స్థలానికి గోడ కట్టగా, దానిని కొంతమంది అన్యాయంగా కూల్చివేశారని భూ యజమాని చంద్రకళ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకుండా, దౌర్జన్యం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. తోట చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 189/బి మణికంఠ కాలనీ రోడ్డు 4లో తాము 2008 వ సంవత్సరంలో శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేశామని, ఇట్టి జాగపై వేరే వ్యక్తులతో తగాదా ఏర్పడటం వలన 2011వ సంవత్సరంలో కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.. కోర్టు తీర్పు 2018 లో తమకు అనుకూలంగా వచ్చిందని, వెంటనే చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళు జాగా మీధకు రాగా, అప్పుడు ఉన్న సిఐ రాఘవేంద్రరావు ఇరువురి సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఆ భూమి తమదేనని నిర్ధారించినట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుతం కొందరు భూ ఆక్రమణదారులు, ఓడిపోయిన వారి వద్ద నుండి అగ్రిమెంట్ పెట్టుకొని పది రోజుల క్రితం మా గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు అని అన్నారు. ఈ నెల 7వ తేదీన గోడను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలని ఏనుమాముల పోలీసు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన కూడా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాదితులు ఈ వివాదంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T143408.092.wav?_=7

 

నేటిధాత్రి”, బ్రేకింగ్.

 

హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం.._

కలెక్టరేట్‌లోనే తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్

నిందితుడి దాడి నుండి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు

కలెక్టరేట్‌లోనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటే అతనికి పై స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికుల ఆరోపణలు.

ఇర్ఫాన్ సోహెల్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్..

లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు

 రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు…

 రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

 

రహదారిపై క్రికెట్ ఆడితే.. తన ఇంట్లోని పిల్లలకు బంతి తగులుతుందంటూ ఒక మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కానిస్టేబుల్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసి.. దాడి చేశారు.ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు.. ఆ మహిళలపై దాడి చేశారు. దీంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడి భార్య పేరు హారిక. వీరి పిల్లలు.. రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు.

ఆ క్రమంలో ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కల్యాణి అనే మహిళలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయాన్ని ఆ పిల్లలు.. తమ తల్లిదండ్రులు హరినాథ్ దంపతులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన వారు.. కల్యాణిపై దాడి చేశారు. దీంతో ఆమె అనంతపురం నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న హరినాథ్ భార్య హరిక ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి ఆమెపై హరిక దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తనపై మరోసారి దాడి చేశారంటూ కల్యాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు వారు పురుగుల మందు డబ్బాతో సహా చేరుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

దాంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హరికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.

మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ చోరీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T120815.000.wav?_=8

 

మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ చోరీ

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి..
మండలంలోని పొన్నారం గ్రామంలో అర్థరాత్రి మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ ను దొంగలించిన దొంగ..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు..
గ్రామానికి చేరుకున్న మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్..

దొంగతనం ఘటన పై విచారణ చేస్తున్న పోలీసులు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version