పంటలను పరిశీలించిన ఏడీఏ దామోదర్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో పసుపు మొక్కజొన్న బంతి పంటలను నర్సంపేట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు దామోదర్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి తో కలిసి సందర్శించారు. ఆయా పంటలు వేసిన నల్ల వెంకట్ రెడ్డి, చెన్నూరు అచ్చిరెడ్డి, యార ప్రతాప్ రెడ్డి రైతుల పంటల క్షేత్రాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ పంటల్లో వ్యవసాయ శాఖ సూచనల మేరకు మోతాదును మించకుండా మందులు పిచికారి చేయాలని తెలిపారు.పలుసూచనలు సలహాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ వి.విజయ్ నాయక్ పాల్గొన్నారు.