రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక…

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 17న వరంగల్ జిల్లా ఓ సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో టేకుమట్ల కేజీవిపి పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. .
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నిర్మల్ జిల్లాలో జరగనున్నాయి. ఈ విజయంపై కేజీవిపి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న విద్యార్థి చరణ్యను వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ను విద్యార్థిని తల్లిదండ్రులను  అభినందించారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.
మల్లాపూర్ అక్టోబర్ 14 నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సార రుత్విక్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనందున మల్లాపూర్ స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జారపు గంగాధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రిత్విక్ అనేక విజయాలు సాధించాలని, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే నేటి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ఎగ్యారపు శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శులు తిప్పర్తి కిషన్, సింహరాజు నరేష్, అలాగే సంఘ సభ్యులు తుమ్మనపల్లి శ్రీనివాస్, బెజ్జారపు తిరుపతి, బెజ్జారపు శ్రీనివాస్, కట్ట వీరేంద్ర చారి, గన్నరపు రమేష్, ఎగ్యారపు వెంకటరమణ, ద్రుశెట్టి రాజేష్, దురిశెట్టి శ్రీనివాస్, ఆకోజి వెంకటరమణ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134240.033.wav?_=1

 

— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్

నిజాంపేట: నేటి ధాత్రి

 

విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నాయిని..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నాయిని..

#అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఎమ్మెల్యే నాయిని..

హన్మకొండ, నేటిధాత్రి :

 

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అక్టోబర్ 16,17,18 తేదీలలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 5 వ ఓపెన్ అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు.
ఈ సందర్భంగా అథ్లెటిక్స్ కాంపిటీషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి,రాష్ట్ర అథ్లెటిక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,జిల్లా క్రీడా శాఖ అధికారి అశోక్ , జాయింట్ సెక్రటరీ సారంగం తదితరులు ఉన్నారు.

16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు…

జహీరాబాద్: 16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 16, 17 తేదీల్లో కబడ్డీ జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్టిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు జరుగుతాయి. పూర్తి వివరాలకు 99891 63793, 99892 18299 నెంబర్లను సంప్రదించవచ్చు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యోగులు.
ప్రతి సంవత్సరం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీలలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగు లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సిహెచ్ రఘు తెలిపారు.

 

 

ఖో ఖో క్రీడా లో సి హెచ్ ఆనంద్, ఫిజికల్ డైరెక్టర్ టేకుమాట్ల, కబడ్డీ క్రీడకు గాన సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ తాడిచర్ల, వాలీబాల్ క్రీడకు గాని కే జ్యోతి ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, మహా ముత్తారం, కే మమత ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, పెద్దాపూర్, పాపికొండలు జి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్, జి పూర్ణిమ ,ఫిజికల్ డైరెక్టర్, జడ్.పి.హెచ్.ఎస్, మహాదేవపూర్ గర్ల్స్, కే మమత ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ పెద్దాపూర్, అథ్లెటిక్స్ క్రీడకి గాను సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్, హెచ్ రమేష్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజామ్ నగర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చెస్ క్రీడకి గాను బీ.కొమలత, ఎస్ జి టి, ఎం పి పి ఎస్ కేశవాపూర్, స్పందన ,ఎస్ జి టి, ఎంపీపీ ఎస్ ఎల్కేశ్వరం.
జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఉద్యోగులకు క్రీడా శాఖ తరుపున అభినందనలు, జాతీయ స్థాయి లో జిల్లా కి క్రీడా లలో మంచి పేరు తేవాలి అని ఆకాక్షించారు.
సి హెచ్ రఘు, తెలిపారు

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

ఇంటర్నేషనల్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ లోని ఓసిటీ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థులు ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈనెల 20, 21న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీట్ హై స్కూల్ జరిగే పోటీలలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎ. చందన, 9వ తరగతికి చెందిన బి. రాంప్రసాద్ పాల్గొననున్నారు.రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో రాణించడం తమ లక్ష్యమని విద్యార్థులు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ ఫహీం సుల్తాన, కోచ్ రాజేష్, మధు, ప్రశాంత్ కుమార్, రియాజ్ లతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*అమరావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌..

*ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ ప్రారంభోత్స‌వంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T133904.551.wav?_=2

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 30:

ఆనాడైనా ఈనాడైనా క్రీడ‌ల అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న నేతృత్వంలో క్రీడ‌ల బ‌లోపేతానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు అన్నారు. తిరుప‌తిలోని శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ నిర్వ‌హిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌-2025(సీనియ‌ర్ మెన్ అండ్ ఉమెన్‌) పోటీల‌ను మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మతో
ఆయ‌న కలిసి ప్రారంభించారుతొలుత ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో బ్యాడ్మింట‌న్ ఆడి పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రారంభోత్స‌వ స‌భ‌లో క్రీడాకారుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. సీఎం చంద్ర‌బాబునాయుడు మొద‌టి నుంచి క్రీడ‌ల‌కు అధిక ప్రాధాన్యత‌ క‌ల్పిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లోనే అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేస్తార‌ని వివ‌రించారు. టీటీడీ, శాప్ నిధుల‌తో ఆనాడే శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సును ఆయ‌న నిర్మించార‌న్నారు. ఏపీ నుంచి అంత‌ర్జాతీయస్థాయి క్రీడాకారుల‌ను త‌యారుచేయాల‌నే సంక‌ల్పంతో అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు స్థ‌లాలనిచ్చి అకాడ‌మీల స్థాప‌న‌ల‌కు కృషి చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడని కొనియాడారు. గత ముప్పై ఏళ్లుగా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్, ఫెడ‌రేష‌న్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తూ బ్యాడ్మింట‌న్ క్రీడ‌ను ముందుకు తీసుకెళ్ల‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు సీఎం కృషి చేస్తున్నార‌న్నారు. అత్యుత్త‌మ క్రీడా విధానాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌న్నారు. అనంత‌రం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌లు అపార‌మైన కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న క్రీడాస‌దుపాయాలు, క్రీడా ప్రోత్సాహ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకుని క్రీడాకారులు భ‌విష్య‌త్తులో మ‌రింత మెరుగ్గా రాణించాల‌ని సూచించారు. సీఎం చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీఓ శ‌శి, బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక

మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )

 

స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీలు.

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం గురువారం క్రీడా పోటీలు నిర్వహించినట్లు ఎంఈవో లింగాల కుమారస్వామి తెలిపారు. మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పలు గ్రామాలకు చెందిన 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనగా వివిధ పోటీలు నిర్వహించి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో పోటీలు నిర్వహించమన్నారు. మండల స్థాయిలో అత్యంత ప్రతిభ చూపిన పదిమంది విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, సంతోష్. సుదర్శన్, అజయ్, శ్రావణి, ఉపాధ్యాయులు అంకుష్, మహేష్, ఎమ్మార్సీ సిబ్బంది వేణు, వసంత, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ.

తెలంగాణ ప్రభుత్వం
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ
రాజన్న సిరిసిల్ల జిల్లా 
తేది: 17-06-2025
పత్రికా ప్రకటన
shine junior college
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు, బాల బాలికలకు మరియు క్రీడాకారులకు తెలియజేయునది ఏమనగా లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ లో 2025-26 విద్యా సంవత్సరానికి పిజిడిఎస్సి, పిజిడిఎస్ఎస్సి, మరియు  డి ఎస్ సి, ఇతర కోర్సులలో ప్రవేశం పొందుటకు,  భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో సెలక్షన్ ట్రాయల్స్/( Admission Tests) ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. 
కోర్సుల వివరాలు:
1. Diploma in Sports Coaching (DSC)
2. Post Graduation Diploma in Sports Coaching (PGDSC)
3. Post Graduate Diploma in Fitness Management(PGDFM)
4. Post Graduate Diploma in Strength and sports Conditioning (PGDSSC)
కావున ఆసక్తిగల క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు  ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకోగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ రాందాస్  ఒక ప్రకటనలో తెలియజేశారు.
 అర్హత వివరాలకు ఈ క్రింది వెబ్సైట్ను సంప్రదించగలరు.
మిగితా వివరాలకు ఈ వెబ్ సైట్ www. Inipe.edu.in సంప్రదించగలరు. 
 (నోట్:-ఇట్టి ప్రకటనను  ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియానందు ప్రచురింపచేయగలరని మనవి
                                                           జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి(అ.భా)
                                              ( ఎ. రాందాస్ )
                                                              సెల్.నెం.94402 39783                                            
                                                         రాజన్న సిరిసిల్ల జిల్ల

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

Shine Junior Colleges

 

 

చిట్యాల మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు బుధవారం 18వ తేదీన చిట్యాల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కన్వీనర్ కొడెపాక రఘుపతి తెలిపారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలలు) చిట్యాల మండలంలో ఉన్న బాల బాలికలు క్రీడా పాఠశాలలో 4వ తరగతి అడ్మిషన్ కొరకు 1 – 9 – 2016 నుండి 31 – 08 – 2017 మధ్యలో జన్మించిన బాల బాలికలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలలో అడ్మిషన్ కొరకు చిట్యాల ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని తెలపడం జరిగింది ఇది క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ క్రీడా పాఠశాలల అడ్మిషన్ల ఎంపికలో షటిల్ రన్, మెడిసిన్ బాల్, వర్టికల్ జంప్, 800 మీటర్ల పరుగు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఎత్తు మరియు బరువు విభాగాలలో పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తామని ఈ మండల స్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల కోఆర్డినేటర్ సూదం సాంబమూర్తి ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది ఈ ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికెట్లు తీసుక రావాలి వివరాల కొరకు 9966992295 నెంబర్ లో సంప్రదించాలన్నారు

క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది.


క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది

ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి నేటిధాత్రి:

క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి విజేత తంగళ్ళపల్లి రెండో విజేత మూడ పల్లి గ్రామ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు…

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు…మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు..గతంలో విద్యార్థి దశలో ఉన్న
సమయంలో కోర్టు లైన్ పోసే వాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు..

ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు.. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు…

క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు.. సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిoదన్నారు..

మన ప్రాంతంలో కోరుట్ల, సిరిసిల్ల,వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియం లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూడటం జరిగిందనీ తెలిపారు..గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపoటి రామస్వామి, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, నాయకులు. బద్దం తిరుమలరెడ్డి, ప్రసాద్, బాణాల రవీందర్ పుల్కల్ లచ్చయ్య, మేకల గణేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ…

 

ప్రేమ‌లు హీరో నస్లెన్ మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా థియేట‌ర్లలో మంచి విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం ఓ రోజు ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చింది.

ప్రేమ‌లు హీరో నస్లెన్ (Naslen) మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana). తెలుగు క‌న్నా ముందే ఏప్రిల్ 10న కేర‌ళ‌లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సొంతం చేసుకుంది. గ‌తంలో టొవినో థామ‌స్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ కాంబోలో త‌ల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేర‌ళ‌ను షేక్ చేసిన ఖ‌లీద్ ర‌హ‌మాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. కేవ‌లం రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసి కేర‌ళ‌ నాట‌ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల త‌ర్వాత ముంద‌స్తుగా ప్ర‌క‌టించిన డేట్ క‌న్నా ఓ రోజు ఎర్లీగానే ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాకిచ్చింది.
సినిమా టికెట్లు

క‌థ విష‌యానికి వ‌స్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత‌, పెద్దోడు, చిన్నోడు, సెహ‌నావాస్ ఐదుగురు చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. అయితే ఇంట‌ర్ ఫలితాల్లో ఒక‌రు మాత్ర‌మే పాస్ అవుతారు.ఇక రెగ్యుల‌ర్‌గా కాలేజికి వెళ్లి చ‌దువుకోవ‌డం మ‌న వ‌ళ్ల‌ కానీ ప‌ని అని డిసైడ్ అయి కొత్త‌గా ఏదైనా ట్రై చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అందుకోసం బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కుల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఫ్లాన్ చేస్తారు. ఈక్ర‌మంలో స‌మీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడ‌మీలో శిక్ష‌ణ‌ కోసం చేరుతారు. ఈ నేప‌థ్యంలో ట్రైనింగ్ తీసుకునే క్ర‌మంలో వారు ఆ ప‌ని స‌రిగ్గా చేయ‌లేక, సీరియ‌స్‌నెస్ లేక‌ బాక్సింగ్‌ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట‌ చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు ఆపై డిస్ట్రిక్‌ లెవ‌ల్‌, స్టేట్ లెవ‌ల్ టోర్న‌మెంట్స్ ఆడాల్సి రావ‌డంతో చివ‌ర‌కు ఆ కుర్రాళ్లు ఏం చేశారు, చివ‌ర‌కు ఎలా ముగించార‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

కాగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫుల్ ఫ‌న్ మోడ్‌లోనే సాగుతూ ప్రేక్ష‌కుల‌కు తీరిక ఇవ్వ‌ని వినోదంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే మూవీలో ఫ‌లానా వాడు హీరో అని చెప్ప‌లేం. న‌స్లైన్ త‌ప్ప అంద‌రూ మ‌న‌కు ఏమాత్రం ప‌రిచ‌యం లేని మొహాలే అయినా ఐదుగురి పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది. వారి చుట్టే క‌థ తిరుగుతూ వారి న‌ట‌న‌, డైలాగులు, వ‌న్ లైనర్స్ వాటినన్నింటినీ మ‌రిచి పోయేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు ఫేమ‌స్ మీమ్స్ అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వ‌ద్ద జాత‌కం చూపించి చెప్పాలా వంటి వ‌న్ లైన‌ర్స్ తో కిక్ ఇస్తారు. ఫ‌స్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్‌, అమ్మాయిల‌కు సైట్ కొట్టే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌వ్విస్తారు.

ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ కోర్టులో యాక్ష‌న్ సీన్ల‌తో ఆటాడేసుకుంటారు. మిత్రులు ఒక్కొక్క‌రు బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లే ముందు తోటి మిత్రులు ఇచ్చే బిల్డ‌ప్‌లు, వ‌చ్చేపాట‌, డైలాగులు సీటులో కూర్చోనియ‌కుండా న‌వ్విస్తాయి. ఎక్క‌డా అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌ల‌కు చోటివ‌కుండా పాత్ర‌ల మ‌ధ్య సంద‌ర్భోచిత‌ కామెడీతో ఆల‌రిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో స‌న్నివేశం సినిమాకే హైలెట్‌. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 12 నుంచి సోనీల లివ్ (SONY LIV) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. చివ‌రి వ‌ర‌కు మంచిగా ఎలాంటి బాద‌ర‌బందీ లేకుండా హాయిగా మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెత‌క్కుండా కుటుంబం అంతా క‌లిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.

బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో శనివారం రోజున ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,

ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడా అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ ను అభినందించడం జరిగింది.

ఒకప్పుడు నేను కూడా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని అని ఈ క్రీడను చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు, అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడను విద్యార్థి దశలోనే అవగాహన కోసం అండర్ 14 బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం కూడా గొప్ప విషయమై కొనియాడారు,

ఈ క్రీడల్లో పాల్గొనడానికి దాదాపు 24 టీములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగిందని, అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో

 

Sports

 

 

ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అసోసియేషన్ తరపున ఇవ్వడం జరుగుతుందని అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించేందుకు విద్యార్థి దశ అండర్ 14 నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న క్రీడాభిమానులకు

ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు, ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ బాల్ బాడ్మిట్ ఉమ్మడిజిల్లా స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు,

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు గుట్ల తిరుపతి ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి బుచ్చిరెడ్డి స్వామి అంజద్ భాష కోశాధికారి రవీందర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా నాయకులు చిలకల రాయకుమురు టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ మండల్ నాయకులు బుర్ర శ్రీనివాస్ చిలుమల రాజమౌళి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసి యువత విద్య, క్రీడల పై దృష్టి పెట్టాలి.

ఆదివాసి యువత విద్య, క్రీడల పై దృష్టి పెట్టాలి

గుండాల సిఐ రవీందర్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏస్ పి రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఇల్లందు డి ఏస్ పి చంద్రభాను సూచన మేరకు బుధవారం గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని శంబుని గూడెం గ్రామంను గుండాల సిఐ లోడిగ రవీందర్, కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ సందర్శించి వారికి వాలీబాల్ కిట్టు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ ఆదివాసి యువత నక్సలిజానికి, అసాంఘిక శక్తులకి దూరంగా ఉండాలని, అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు. యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉంటూ విద్య వైపు తమ దృష్టిని మళ్ళించాలని, అప్పుడే ఆదివాసి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపపారు. అదేవిధంగా క్రీడలను తమ దైనందిక కార్యక్రమాలలో భాగంగా చేసుకోవాలని, దాని ద్వారా శారీరకకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన, అనుమానస్పద వ్యక్తులు వచ్చిన పోలీస్ వారికి వెంటనే తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అన్ని డాక్యూమెంట్స్ కలిగి ఉండాలని, మద్యం త్రాగి వాహనాలు నడపారాదని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని, అపరిచితులకు తమ యొక్క బ్యాంకు వివరాలు, ఓటీపీ నెంబర్ లు తెలుపవద్దని చెప్పారు. శంబుని గూడెం గ్రామస్తులు తమకు వాలీబాల్ కిట్టు ఇవ్వడం ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు.!

మై భారత్ నెహ్రు యువక కేంద్ర మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు,,,,,

కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసులు ఉపాధి ఆఫర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,,,,,

రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ నిర్వహణ,,,,

వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ సెటిల్ క్రీడల్లో పోటీలు,,,,

యువతలకు, యువకులకు 13 నుండి 29 సంవత్సరా లు,,,,,

కాలేజీ గ్రౌండ్లో 19 మార్చి నుండి 20 వరకు,,,

రామాయంపేట మార్చి18 నేటి ధాత్రి (మెదక్)

Sports

మైభారత్ యువభారత్ యువ ఉత్సవ్ యువతనుచైతన్య పంచడానికి క్రీడలు యువజన సర్వీసుల శాఖ స్వయం ఉపాధి అవేర్నెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని యువతకు ఆటల ద్వారా స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిద్దిపేట నెహ్రూ యువ కేంద్ర అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలుపుతూ రామాయంపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా క్రీడలకు ప్రోత్సహిస్తూ అనేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్న యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ కు మెదక్ జిల్లాస్థాయి స్పోర్ట్స్. మీట్ కార్యక్రమాన్ని నెహ్రూ యొక్క కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక యువజ్యోతి నిర్వహిస్తుందని తెలిపారు మెదక్ జిల్లా స్థాయి ఈ పోటీలలో వాలీబాల్ కబడ్డీ ఫుట్బాల్ బ్యాట్మెంటన్ సెటిల్ పోటీలను 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు యువకులకు బాలురకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉచిత గాని క్రీడాకారులకు క్రీడలు నిర్వహిస్తామన్నారు భోజన సదుపాయము కల్పించడంతోపాటు క్రీడల్లో పాల్గొన్న వారికి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ క్రీడల వారి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు క్రీడల్లో పాల్గొన్న వారికి అలాగే విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ మెమోటోస్ అందజేయడం జరుగుతుందన్నారు ఈ క్రీడల్లో పాల్గొనడానికి స్థానిక రామాయంపేట యువజ్యోతి కోఆర్డినేటర్ సత్యనారాయణకు పేర్లు అందజేయాలని కోరారు 9 0 00752850 ఫోన్ నెంబర్ కు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు 18 మార్చి చివరి తేదీ కాగా 19 20 తేదీల్లో క్రీడలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

మహిళా వాక్తాన్ కార్యక్రమం.!

యువజ్యోతి యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మహిళా వాక్తాన్ కార్యక్రమం,,,

యువభారత్ యువ ఉత్సవ్ కేంద్ర మంత్రుల శాఖ ఆధ్వర్యంలో నేడు ఉదయం 8 గంటల నుండి మహిళలకి వాక్తాన్ కార్యక్రమం,,,

రామాయంపేట మార్చి8 నేటిధాత్రి (మెదక్)

Women’s speech

ప్రపంచ మహిళా దినోత్సవం మరియు కేంద్ర యువజన సర్వీసులు క్రీడల అవగాహన ఉపాధి శాఖ ఆధ్వర్యంలో 9 నుండి 11 వ తారీకు వరకు యువ ఉత్సవ్ యువభారత్ అనే కార్యక్రమాలను జిల్లా నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన సందర్భంగా నేడు రామాంపేట స్థానిక యువజ్యోతి యూత్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళ యూత్ కార్యక్రమంలో వాక్ తాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యువ జ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఒక ప్రకటన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి సుమారు రెండు కిలోమీటర్లు మార్కెట్ యార్డ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 100 మంది మహిళ యూత్ యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమానికి యువజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రజల్లో శక్తిసామర్థ్యాలకు యువభారత్ నుండి జరిగే కార్యక్రమాలు ఆరోగ్యం మరియు అవగాహన స్ఫూర్తిని కలిగించడానికి సహకరించాలని ఆయన కోరారు అలాగే మెదక్ డిగ్రీ కాలేజ్ లో 11 వ తారీఖున జరిగే ఇవ్వోచ్చావ్ కార్యక్రమంలో 19 నుండి 29 వరకు మహిళలు యువతులు సైన్స్ ఫెయిర్ మరియు సాంస్కృత క వత్తుత్వవ్యాసాలకు రచన పోటీలకు పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకోవడానికి 9 0 0 0752850. ‌‌,, పేర్లు నమోదు చేసుకోగలరు అని ఆయన తెలిపారు

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

sports

జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాల ల్లో, కళాశాల ల్లో విద్యార్థులు శారీరికంగా దృఢంగా, మానషికంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అని వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధారెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఔట్ డోర్ గేమ్ లు అనై కబడి, కోకో ,క్రికెట్ వీటితో పాటు ఇండోర్ గేమ్స్ అయిన క్యారమ్స్, చెస్ లు, క్విజ్ పోటీలు నిర్వయించి ప్రతి విజేత టీమ్ కి విన్నర్ ప్రైజ్ లు మరియు రన్నర్ టీమ్ లకు కూడా కప్ లు పథకాలు ఇచ్చి విద్యార్థులకు ప్రోత్సాహిస్తారు. చదువు తో పాటు చక్కని క్రమ శిక్షణ నతో విద్యార్థులు ఎదగాలని అధ్యాపక బృందం కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మారుతి రావు పాటిల్, డైరెక్టర్ లు అమర్నాథ్, సంజీవ్ రావ్,శశికాంత్ ,శంకర్ రావు,సంగన్న,శ్రీనివాస్,తదితరులున్నారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version