అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయం…

అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

అంతర్జాతీయ కార్యాశాల పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహించడం అభినందనీయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, రాజమండ్రి కందుకూరి వీరేశలింగం తియాటిక్ కళాశాల, సంయుక్తంగా ఈడుమెంట్ యు ఎడ్యుకేషనల్ ప్రో. వెంకట్స్ .టైమ్ అనే సంస్థల సౌజన్యంతో ఇంటర్నేషనల్ ఇంటెన్సీస్ థీసిస్ రైటింగ్ వర్క్ షాప్ అనే అంశంపై 15 రోజుల అంతర్జాతీయ కార్యాశాలను ఆన్లైన్ విధానంలో కొనసాగించే వర్క్ షాప్ పోస్టర్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నందుకు గాను చీఫ్ పాట్రన్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కన్వీనర్ ఎంఎంకే రహీముద్దీన్ ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా 100 శాతం అడ్మిషన్లు సాధించినందుకు గాను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తీసుకున్న చొరవ,ప్రణాళికలను మరింత పెంపొందించాలన్నారు. కళాశాలకు అవసరమైన అభివృద్ధిలో ముందుండి నడుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నవీన్ తో పాటు, అధ్యాపకులు ఎం ఎం కె రహీముద్దీన్,డాక్టర్ కందాల సత్యనారాయణ, ఎస్ కమలాకర్,
డాక్టర్ రాంబాబు,డాక్టర్ సోమయ్య,
ఎస్ రజిత పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో యోగాపై సర్టిఫికెట్ కోర్సు

డిగ్రీ కళాశాలలో యోగాపై సర్టిఫికెట్ కోర్సు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో యోగాలో 30 రోజుల సర్టిఫికెట్ కోర్సును యోగ అభ్యాసకులు ఎస్ కమలాకర్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలియజేశారు. నవీన్ మాట్లాడుతూ యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ కూడా యోగ పై మక్కువ పెంచుకుంటున్నాయన్నారు.ప్రాచ్య, పాశ్చాత్య అనే తేడా లేకుండా ప్రతి దేశం యోగా ఉపయోగాలు తెలుసుకొని తమ జీవనగమనంలో భాగం చేసుకున్నారని తెలిపారు.యోగ ప్రయోజనాల పట్ల తెలుసుకొని ప్రతిరోజు యోగాసనాలు ద్యానం కోసం సమయం కేటాయించాలని విద్యార్థులు సూచించారు.యోగ అభ్యాసకులు ఎస్. కమలాకర్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతో మేలు చేస్తుందని ముఖ్యంగా విద్యార్థులకు మానసిక ఏకాగ్రతకు శారీరక దృఢత్వానికి అందివ్వడానికే ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేశారు.ఈకార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, స్టాఫ్ సెక్రటరీ ఎంఎంకె రహీముద్దీన్,డాక్టర్ ఎం సోమయ్య, డాక్టర్ రాజీరు, డాక్టర్ సంధ్య, రజిత,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version