వైభవంగా గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజలు ముగింపు

వైభవంగా గోదాదేవి అమ్మవారి కల్యాణం

ముగిసిన ధనుర్మాస పూజలు

మంగపేట, నేటి ధాత్రి

 

ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమా ల్లో భాగంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి కల్యాణ మహోత్సవం బుధవారం కమలాపురం శ్రీ సితారామ చంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేదమంత్రోచ్ఛాణల మధ్య వైభవంగా జరిగింది. స్వామివారిని కల్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తిరుప్పావై పారాయణంతో మేల్కొలిపి పూజించి ప్రసన్నం చేసుకుంటుందని ఆలయ పండితులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యులు తెలిపారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజే వేంకటేశ్వరుడితో గోదాదేవి పరిణయాన్ని చూసే భాగ్యం కలుగుతుందని.. గోదాదేవి కల్యాణోత్సవం సాక్షాత్తు తిరుమలలో జరుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొన్నారు. భక్తులు అమ్మవారికి, స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మార్మోగింది.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి.

అప్పాజీపల్లి లక్ష్మీ నరసింహ కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొనడం

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

తిమ్మాజీపేట మండలం అప్పాజీపల్లి గ్రామంలో లోని లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం నియోజవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని తెలిపారు గ్రామీణ ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికి అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తానే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వైభవంగా దత్త చండీయాగం…

వైభవంగా దత్త చండీయాగం

◆:- అంకురార్పణ చేసిన పీఠాధిపతులు

◆:- వైదిక సారథ్యం వహించిన పండితులు

◆:- యాగంలో పాల్గొన్న 108 మంది రిత్వికులు

◆:- యజ్ఞానికి హాజరైన దంపతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి క్షేత్రంలో ఈనెల 4 మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులుశ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి, ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం ఆధ్వర్యంలో 21 యజ్ఞ గుండమూలలో శ్రీ దత్తాత్రేయ యజ్ఞం,5 గుండములలో యజ్ఞములతో త్యాయాహ్నిక శ్రీ చండి హోమాన్ని వైదిక

మంత్రాలతో శాస్త్రోత్తంగా ప్రారంభమైంది. ఉదయం 10:24 గంటలకు ఆశ్రమ పీఠాధిపతులు యజ్ఞ వాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు, తొలి రోజు శ్రీ దత్త, చండీ మహాయాగం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. గురుపూజతో ప్రారంభమై గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, మంటపారాధన, ఆవాహిత దేవపూజ, శ్రీ యంత్రపూజ, శ్రీ చండీ పారాయణం, మహా మంగళహారతితో మధ్యాహ్నం 4: 05 కు పూర్ణాహుతితో తొలిరోజు యజ్ఞం భక్తిశ్రద్ధలతో ముగిసింది.

శ్రీ దత్త, గాయత్రి మంత్రాలతో బర్దిపుర్ పరిసర ప్రాంతాలు భక్తిపారవశ్యంతో ప్రతిధ్వనించాయి. యాగానికి సుమారు 100 మంది దంపతులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు హాజరై శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శించుకున్నారు. 3 రోజులపాటు యాగం కొనసాగనుంది. జహీరాబాద్ డిఎస్పి సైదా సిబ్బంది పూజలకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version