బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో వచ్చే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవములు(జాతర) – 2025 గోడ పత్రికను ఈరోజు ఉదయం గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

 

రెండో తిరుపతిగా పేరుగాంచిన బుగులోని వెంకటేశ్వరస్వామి వారి జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. భక్తి, సేవ, సాంస్కృతిక పరంపరలను ప్రతిబింబించే ఈ జాతర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.200 లక్షల నిధులు కేటాయించినట్లు, అట్టి అన్ని పనులు పూర్తి కావస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version