సభ్యులందరికీ సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్ట్ లు అందజేత
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ లో కేసరి మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపానికి యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని గణనాధుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు కాంగ్రెస్ మండల నాయకులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసరి మిత్ర యూత్ సభ్యులు, విలేజ్ కేసముద్రం గ్రామ ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు ఆ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం లడ్డు పాట వేలం వేయగా లడ్డు, కలశం, పంచ కండువాలు చీటీ డ్రా సమ్మి గౌడ్ చేతుల మీదుగా తీసి గణపతి లడ్డు గెలుచుకున్న కొలిపాక గోపి,కలశం గెలుచుకున్న వేల్పుల శ్రీ హర్ష,పంచ,కండువా గెలుచుకున్న నార బోయిన రమేష్ లకు అందజేయడం జరిగింది.అన్నా అంటూ ఆదరిస్తున్న కేసరి యూత్ సభ్యులు అడిగిన వెంటనే స్పందించి వారికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్టులను అందజేశారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ… మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మా అన్న సమన్నకు ఎల్లవేళలా మేము తోడుంటామని, అదేవిధంగా ఆ ఏకదంతుని ఆశీస్సులు సమ్మి గౌడ్ అన్నకు తన ఆశయాలు నెరవేర్చడంలో తోడ్పడాలని కోరుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డొనికల రాజు, కొమ్ము నరేష్,ఎస్కే తాజా,ఎస్ కే యాకూబ్, నాగరాజు,సందీప్, సాయి,దాసరి సందీప్,సిహెచ్ సురేష్, శ్రీనాథ్,ఈశ్వర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం
నర్సంపేట,నేటిధాత్రి:
గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో గణనాథున్ని ప్రతిష్ఠించుకొన్న కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు.శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టగా గణనాథుడికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు వీడ్కోలు పలికారు.కాగా ఎమ్మెల్యే దొంతి కుమార్తె అనన్యరెడ్డి హన్మకొండ పద్మాక్షమ్మగుట్ట వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24 అవార్డు కారల్ మార్క్స్ కాలనీలో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో గోపికృష్ణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.సంఘం అధ్యక్షుడు డబ్బేట మల్లేశం మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక. ఇలాంటి సమయాల్లో అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవ, సౌహార్దం పెంపొందుతుంది. గ్రామంలో సామాజిక స్ఫూర్తిని పెంచడం గోపికృష్ణ పద్మశాలి సంఘం ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. మహా అన్నదానంలో గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ
* శివరాజ్ యాదవ్ కుటుంబ సభ్యులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, నియోజకవర్గ పట్టణ పరిధిలో కాంతా రెడ్డి కాలనీ బాలాజీ నగర్ సమీపంలో గల ఓం శ్రీ సాయిఅగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం దగ్గర మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కాంతారెడ్డి కాలనీకి చెందిన శివరాజ్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఈ అన్నదానం కేవలం ఆహారం అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్య కార్యమని, అన్నదానం ద్వారా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుంది. అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని అదేవిధంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సాను కూలతను తీసుకు వస్తాయి. అన్నదానం ద్వారా ఇతరులకు ఆహారం అందించడం ద్వారా వారి జీవితాన్ని ఇచ్చే అవకాశం లభిస్తుంది అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు తలారి సందీప్, ఉప్పరి మహేందర్, బి. సంతోష్, తరుణ్, ధనరాజ్, వినయ్ కుమార్, ఉప్పరి దత్తు, సాయి కుమార్, సాయి చరణ్, ప్రణీత్ కుమార్, లడ్డు, తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో మహిళలు ఆరవ రోజు గణపతికి అంగరంగ వైభవంగా దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని 200 మంది వరకు మహిళలు పాల్గొని గణపతికి 2000 దీపాలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
గణనాథుని లడ్డు వేలం పాటలో 16 వేల పలికిన మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల మల్గి గ్రాములోని హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును 16 వేలకు మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి కురుమ దక్కించుకోవడం జరిగింది గ్రామంలో పలు చోట్ల వెలిసిన గణనాథులు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి. చెరువులో నిమజ్జనం చేశారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి గణనాథులు నిమజ్జనం చేశారు,
గణపయ్య పూజలో పాల్గొన్న లైన్ మెన్ బోగీ ఐలయ్య దంపతులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సాంబమూర్తి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని అక్కడ కొలువు దీరిన గణనాదున్ని లైన్ మెన్ బోగీ ఐలయ్య సునీత దంపతులు సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలను సమర్పించారు. ఈ సందర్భంగా లైన్ మెన్ ఐలయ్య మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే వినాయకుడి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని, గణనాథుడి ఆరాధనతో ప్రతి ఇంటా సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధి నిండుగా ఉండాలని ఆ గణనాథుడిని వేడుకుంటున్నట్లు ఐలయ్య తెలిపారు. వినాయక చవితి పండగ మనలో భక్తి, శక్తి మాత్రమే కాక ఐకమత్యం,స్నేహభావాన్ని పెంపొందిస్తుందన్నారు.
శ్రీ సాయి గణేష్ మండలి గణపతి వద్ద సామూహిక కుంకుమార్చన…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
గణపతి నవరాత్రోత్సవాల సమయంలో కుంకుమపూజ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం, అందులో భాగంగానే క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డ్ గద్దెరాగడి లో శ్రీ సాయి గణేష్ మండలి గణపతి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో పసుపు, కుంకుమ ముఖ్యమైనవి, ఇవి గణేశుడికి, గౌరీదేవికి అలంకరణలో భాగంగా ఉపయోగిస్తారు.హిందూ సంప్రదాయంలో, పసుపు, కుంకుమ అనేవి పూజా ఆచారాలలో ఒక భాగం. ఇవి సౌభాగ్యాన్ని,శ్రేయస్సును సూచిస్తాయి.గణపతి నవరాత్రోత్సవాల్లో, గణేశుడికి పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని శ్రీ సాయి గణేష్ మండలి సభ్యులు తెలిపారు.
జహీరాబాద్ పట్టణంలోని అతిది హోటల్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్పా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ సీనియర్ నాయకులు నారాయణ నర్సింహ గౌడ్ సురేష్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
కరంజ ప్రాజెక్ట్ని తలపిస్తున్న నిమ్జ్ రహదారి పరిసర పంట పొలాలు
◆:- పంట పొలాల్లో వరద నీటితో లబోదిబోమంటున్న పరిసర రైతులు
◆:- రోడ్డు నిర్మాణంలో ప్రణాళిక రహితంగా – నిర్మాణం చేపట్టడంతో రైతులకు తీవ్ర నష్టం
◆:- ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతుల వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానిఫెకచరింగ్ జోన్ నిర్మాణంలో భాగంగా జహీరాబాద్ మండల పరిధిలోని ఉగ్గేల్లి గ్రామ శివారు నుంచి బర్దిపూర్ గ్రామ శివారు వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మించిన విషయం తెలిసిందే. రోడ్డు నిర్మాణంలో సంబంధిత అధికారులు ప్రణాళిక రహితంగా నిర్మాణం చేపట్టడం, భారీ వర్షాలు కురిస్తే వరద నీరు పోవడానికి ఎలాంటి మార్గాలు చూపెట్టకపోవడంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డుకి ఇరువైపుల వరదనీరు నిలిచిపోవడంతో పంటలు నీట మునిగి రైతులు పెద్దమొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
నిమ్జ్ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. నిర్మాణ పనుల్లో ప్రణాళిక రహితంగా వ్యవహరించిన అధికారులు, గుత్తేదార్లపై చర్యలు తీసుకొని వర్షాలు కురిస్తే పొలాల్లో నీరు నిలిచిపోకుండా వరద నీటిని వాగులు, వంకలకు కనేక్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిలిచిపోయిన వరద నీటి వల్ల పంట పొలాలు కర్ణాటక రాష్ట్రంలోని కరంజ ప్రాజెక్టును తలపిస్తుందని రైతులు, కూలీలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన ప్రజల సమస్యలు తెలుసుకున్న మెదక్ ఎంపీ మాధవిని రఘునందన్ రావు..
రామాయంపేట ఆగస్ట్ 28 నేటి ధాత్రి (మెదక్)
ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవిని రఘునందన్ రావు రామాయంపేట పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను కూడా వివరాలు అడిగి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున సహాయం అందించడానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పట్టణంలో నీటి పారుదల సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్శన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిలం అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలరాజ్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా నాయకులు వెలుముల సీద్దరాములు, శంకర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం ప్రశాంత్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు జొన్నల భరత్, భాసం అనిల్, కడెం సిద్ధార్థ, లావణ్య, కటిక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు లోని గంగమ్మ దేవాలయం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహానికి సిరిసిల్ల గంగ పుత్రులు ప్రత్యేకంగా గంగమ్మకు శాంతి చేకూరాలని బోనాలతో మరియు అమ్మవారి విగ్రహ పల్లకి సేవతో ఊరేగింపుగా బయలుదేరి మానేరు గంగమ్మ నీటిలో ప్రత్యేక కుంకుమ పూజలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణకు సంబంధించిన గంగపుత్రులు మరియు పరిసర గ్రామాల గంగపుత్రులు అంగరంగ వైభవంగా వెళ్లి మానేరు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.
నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప్పు సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మండల ప్రజలందరికీ యువ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మీ కందరికీ సకల శుభాలు కలగాలని జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని గణనాథుని వేడుకుంటూ విగ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలన్నారు,
గణేష్ గురించి మనందరికీ తెలుసు. ఆయన ఉల్లాసభరితమైన ప్రవర్తన, ఆయన స్వచ్ఛమైన ఆత్మ, మరియు ముఖ్యంగా, ఆయన దయగల హృదయం మనల్ని ఆయనను ప్రేమించేలా చేస్తాయి. గణేష్ పార్వతి దేవి మరియు శివుడి కుమారుడు. ప్రతి పూజలో మొదట పూజించబడేది గణేష్ అనే వరం లేదా ఆశీర్వాదంతో కూడా ఆయన ఆశీర్వదించబడ్డాడు. గణేష్‌ను అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో కొన్ని గజానన్, గణపతి మరియు ఏకదంత వంటి పేర్లు ఉన్నాయి.
గజానన్ మరియు గణపతి అనే పేర్లు అతని ఏనుగు తలతో సంబంధం కలిగి ఉన్నాయి. అయితే, ఏకదంత అనే పేరు గురించి మీకు తెలుసా? ఏక్ దంత్ అంటే ఏమిటి? ఏకదంత అనే పేరు ఒకే ఒక దంతం ఉన్న వ్యక్తి యొక్క అర్థాన్ని సూచిస్తుంది. ఇది గణేష్ కు ఒకే ఒక దంతం ఉందనే వాస్తవానికి సంబంధించినది.
గణేశుడు ఏకదంతుడు కావడం గురించిన కథలు
గణేశుడి దంతాలను ఎవరు విరిచారనే దాని గురించి ఆంగ్లంలో మూడు ప్రాథమిక పౌరాణిక గణేష్ కథలు ఉన్నాయి మరియు గణేశుడిని ఏకదంత అని ఎందుకు పిలుస్తారు? గణేశుడి ఒకే దంతానికి సంబంధించిన పురాణాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంటే, దాని కోసం మొత్తం బ్లాగును చదవండి. అంతేకాకుండా, మీరు మన ప్రభువుల గురించి ఇలాంటి ఆసక్తికరమైన కథలను చదవాలనుకుంటే, ఇన్‌స్టాఆస్ట్రో వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి లేదా వాటి కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ, మీరు దేవుళ్ల గురించి మరియు ఇతర అంశాల గురించి ఇలాంటి అద్భుతమైన కథలను చదవవచ్చు. ఇప్పుడు, గణేశునికి ఒకే ఒక దంతం ఎందుకు ఉందో తెలుసుకుందాం.
ఏకదంత: ఋషి పరశురాముని కోపం
గణేశుడిని ఏకదంత లేదా ఒక దంతము కలిగినవాడు అని పిలుస్తారు మరియు దీనికి సంబంధించిన అనేక జానపద కథలు ఉన్నాయి. జానపద కథలలో మరియు గణపతి విగ్రహాలలో చిత్రీకరించినట్లుగా, ఎల్లప్పుడూ కనిపించని ఒక దంతము ఉంది. మొదటిది పరశురాముని కోపం, ఇది ఈ ప్రమాదానికి కారణమైంది. ఒక రోజు, శివుడు తన మధ్యవర్తిత్వ గదిలోకి వెళ్లి, చిన్న గణేశుడిని తన సంరక్షకుడిగా చేసుకున్నాడు. దేవుడు తన సమావేశం ముగిసే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని అతనిని కోరాడు. ఇంతలో, పరశురాముడు శివుని ఆశీర్వాదం కోసం వచ్చాడు.
అతను దేవుని ధ్యాన గదుల తలుపు వైపు ముందుకు సాగుతుండగా, గణేశుడు జోక్యం చేసుకుని లోపలికి అడుగు పెట్టకుండా ఆపాడు. ఇది ఋషిని కోపగించుకుంది, మరియు అతను తన గొడ్డలిని గణేశుడిపై విసిరాడు. దైవిక దృష్టి ద్వారా, ఆ చిన్న దేవుడు ఆ గొడ్డలి తన తండ్రి ఇచ్చిన బహుమతి అని మరియు దాని శక్తులు గౌరవాన్ని కోరుతున్నాయని తెలుసుకున్నాడు. అందువల్ల, ఆయుధాన్ని తప్పించుకునే బదులు, అతను గొడ్డలిని అతనిని కొట్టనిచ్చాడు. ఆ దెబ్బ అతని దంతానికి తగిలింది, అది విరిగిపోయింది మరియు అప్పటి నుండి, గణేశుడు ‘ఏక్దంత’ అని పిలువబడ్డాడు.
ఏకదంత: చంద్ర దేవ్‌పై గణపతికి కోపం
విరిగిన దంతం గురించి రెండవ కథ ఇలా ఉంది. ఒక రోజు, బొద్దుగా ఉన్న ఆ గణపతి చంద్ర దేవ్ (చంద్ర దేవుడు) ఇచ్చిన విందు నుండి తిరిగి వస్తున్నాడు. అతను చాలా తిని పూర్తిగా నిండిపోయాడు. దారిలో, ఒక పాము పొదల్లో నుండి బయటకు వచ్చింది, దీని వలన గణపతి తన వాహనం నుండి పడిపోయాడు. అతను పడిపోతుండగా, అతని కడుపు విరిగి, అతని విలాసవంతమైన విందులో ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. చంద్ర దేవ్ దీనిని చూసి పగలబడి నవ్వాడు.
ఆ నవ్వు చూసి కోపగించిన గణేశుడు తన దంతాన్ని విరిచి కోపంతో అతనిపైకి విసిరాడు, దాని ముఖం మీద పెద్ద గుర్తు పెట్టాడు. చంద్రుడు ఎప్పటికీ ప్రకాశించకూడదని శపించాడు. దీని వల్ల ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఇది చూసిన చాలా మంది దేవతలు మరియు దేవతలు గణేశుడిని శాంతింపజేయడానికి మరియు అతనితో తర్కించడానికి ప్రయత్నించారు. చివరగా, ఒక దంత దేవుడు చీకటి నుండి లేవడానికి అనుమతించడం ద్వారా అతని శాపాన్ని తగ్గించడానికి అంగీకరించాడు. ఇప్పుడు చంద్రుడు ప్రతి 28 రోజులకు ఒకసారి క్షీణిస్తున్న మరియు క్షీణిస్తున్న దశను దాటవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఆ విధంగా గణేశుడు ‘ఏకాదంత’ అని పిలువబడ్డాడు.
ఏకదంత: మహాభారతం రాయడం
గణేశుడి నమ్మకం తెగిపోవడంతో ముడిపడి ఉన్న మరో ప్రసిద్ధ కథ మహాభారత రచనకు సంబంధించినది. వేద వ్యాసుడు సహాయం కోరుతూ శివుడి వద్దకు వెళ్ళాడు. వేద వ్యాసుడు తన మాటలతో మహాభారతాన్ని ఎవరైనా రాయాలని కోరుకున్నాడు. అయితే, ఆ వ్యక్తి దానిని రాయడం ఆపకూడదని మరియు సాహిత్యం ఒకే స్రవంతిలో పూర్తవుతుందని ఒక షరతు ఉంది. మొదట శివుడు అయోమయంలో పడ్డాడు, కానీ తరువాత గణేశుడు ఈ పనిని చేయగలడని సూచించాడు. గణేశుడు దీనిని అంగీకరించి, ఇతిహాసాన్ని నిరంతరం రాశాడు.
అయితే, అతను ఇతిహాసం రాస్తున్నప్పుడు, దానిని రాయడానికి ఉపయోగించిన ఈక విరిగిపోయింది. గణేశుడు దానిని ప్రవాహంలో వ్రాసే పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. అందువలన, అతను తన దంతాలలో ఒకదాన్ని విరిచి, ఇతిహాసాన్ని పూర్తి చేయడానికి దానితో ఉపయోగించాడు. పురాణాల ప్రకారం, గణేశుడు మరియు వేద వ్యాసుడు ఇతిహాసాన్ని పూర్తి చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టిందని చెప్పబడింది. అందువలన, అతను ఏక్ దంత్ గణేష్ అని పిలువబడ్డాడు.
ముగింపు
గణేశుడి దంతానికి సంబంధించిన ఈ 3 కథలు పురాతన గ్రంథాలు మరియు పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. అయితే, గణేశుడి ఒకే దంతానికి కారణం ఏది అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. అయితే, మరోవైపు, ఈ కథలు మనకు గణేశుడి నుండి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. వీటిలో పెద్దలను గౌరవించడం మరియు పూర్తి భక్తి మరియు దృష్టితో ఒకరి విధిని నిర్వర్తించడం ఉన్నాయి. మీరు ఈ బ్లాగును ఇష్టపడితే మరియు ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన బ్లాగులను చదవాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాఆస్ట్రో వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి లేదా దాని కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ, మీరు భారతదేశంలోని ఉత్తమ జ్యోతిష్కులతో కూడా మాట్లాడవచ్చు, వారు మీ అన్ని ప్రశ్నలు మరియు సమస్యలకు పరిష్కారాలు మరియు సమాధానాలను అందిస్తారు.
1. గణేశుడు రచించిన ఇతిహాసం ఏది?
మహాభారతాన్ని గణేష్ రాశాడు. వేద వ్యారుడు మహాభారత కథను చెప్పాడు, మరియు గణేశుడు దానిని రాశాడు. రాసేటప్పుడు, గణేశుడు తన దంతాన్ని ఉపయోగించి ఇతిహాసాన్ని పూర్తి చేశాడని నమ్ముతారు.
2. గణేశుడు పరశురాముడిని ఎందుకు లోపలికి అనుమతించలేదు?
గణేష్ కథ ప్రకారం, అతని తండ్రి శివుడు, ధ్యానం కోసం లోపలికి వెళుతుండగా తలుపును కాపలాగా ఉంచమని అడిగాడు. గణేష్ అలా వెళుతుండగా, పరశురాముడు శివుని ఆశీర్వాదం కోసం లోపలికి వచ్చాడు. అయితే, ఎవరినీ లోపలికి రానివ్వవద్దని అతని తండ్రి కోరడంతో, అతను పరశురాముడిని ఆపాడు.
3. గణేష్ కు ఏనుగు తల ఎందుకు ఉంటుంది?
పార్వతి మాత గణేశుడిని తయారు చేసింది. ఆమె స్నానం చేస్తుండగా తలుపుకు కాపలాగా ఉండమని కోరింది. అయితే, శివుడు వచ్చాడు, గణేశుడు అతన్ని లోపలికి రానివ్వలేదు. కోపంతో, శివుడు గణేశుడి తలను నరికివేశాడు. అయితే, తరువాత తన తప్పును గ్రహించి, అతను ఏనుగు తలను కనుగొని, దానిని తిరిగి కలిపి గణేశుడిని బ్రతికించాడు.
4. గణేశుడి భార్య ఎవరు?
చాలా చోట్ల గణేశుడిని బ్రహ్మచారిగా చిత్రీకరించారు. అయితే, కొన్ని ప్రదేశాలలో అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారని చూపించారు. వీరిలో రిద్ధి మరియు సిద్ధి ఉన్నారు. రిద్ధి మరియు సిద్ధి బ్రహ్మ దేవుని కుమార్తెలుగా చెబుతారు.
5. గణపతి అసలు తల ఇప్పుడు ఎక్కడ ఉంది?
గణేశుడి అసలు తల చంద్ర మండలంలో ఉందని నమ్ముతారు.
6. గణేశుడి పిల్లలు ఎవరు?
గణేశుడిని వివాహితుడిగా చూపించే కొన్ని సంప్రదాయాల ప్రకారం, అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారని చెబుతారు. వీరిలో ఆయన కుమారులు శుభ్ మరియు లాభ్ మరియు ఆయన కుమార్తె మాతా సంతోషి ఉన్నారు.
వరంగల్ కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో, రాబోవు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఉత్సవాల వేదిక నిర్మాణ పనులకు వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. గత 34 సంవత్సరాల నుండి కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు, ప్రతిరోజు సాయంత్రం పూజ అనంతరం ప్రసాద వితరణ చేస్తారు. కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సంఘo సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని గుండేటి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, వడిచర్ల సదానందం, మండల శ్రీరాములు, గుల్లపల్లి రాజ్ కుమార్, డాక్టర్ గోనె జగదీశ్వర్, బిట్ల చక్రపాణి, ఓరుగంటి కొమరయ్య, వంగరి లింగయ్య, మాటేటి విద్యాసాగర్, గుత్తికొండ నవీన్, బండారి శ్రీనివాస్, కుసుమ నగేష్, బోడకుంట్ల వైకుంఠం, కందగట్ల రాజు, గుండు సత్యనారాయణ, అలాగే ప్రతి సంవత్సరం ఉత్సవాలకు సేవలందిస్తున్న లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి మండల సురేష్, దుస్స కృష్ణ, దాసి శివకృష్ణ, మండల చందు, పసునూటి శ్రీకాంత్, క్యాతం రవీందర్, బండారి భాస్కర్, క్యాతం శ్రీనివాస్, బండారి రాజు, గాజుల రాజేష్, సిందం కృష్ణ, కోడం శరత్, కానుగంటి పవన్, బండారి లక్ష్మణ్, చిలగాని రమేష్, దాసరి దేవేందర్, ముడుతనపల్లి శ్రీనివాస్, గాదే సతీష్, వంగ ఐలయ్య ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సంకష్ట చతుర్థి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో సోమవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు, సింధూర లేపనం, అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర యుక్తముగా పూజలు జరిపారు. తొలి మొక్కల దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
సంగారెడ్డి: ఝరాసంగం మండలం బర్దిపూర్లోని శ్రీదత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి భగవత్ ఖాభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు మాతృశ్రీ అనసూయ మాత, శ్రీఅవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వరానందగిరి ఆధ్వర్యంలో రథోత్సవం భక్తుల సందోహంతో రమణీయంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, నృత్యాలతో రథోత్సవం ఆకట్టుకుంది.
బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ఆత్మీయ ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలుపుకున్న హిందూ ముస్లింలు పరకాల, జూన్ 07 బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని కలిగి ఉండాలని, పేదలకు సాయం చేస్తే అల్లాకు సేవ చేసినట్లేనని మత పెద్దలు బోధించారు.
న్యాల్కల్..
న్యాల్కల్ : మండలంలో శనివారం బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేయించారు. అనంతరం పేదలకు దానం చేశారు. పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాల్లో సందడి నెలకొంది.
ఝరాసంగం..
Muslims
ఝరాసంగం : మండలంలో బక్రీద్, తొలిఏకాదశి వేడుకలు శుక్రవారం ఇరు వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. హిందువుల పండుగ తొలిఏకాదశి, ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. హిందువులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేయగా, ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలయ్ బలయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ బి. ఆర్. ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ టి ఆర్ యస్ టౌన్ ప్రెసిడెంట్ ఏజాస్ బాబా మాజీ ఎంపీటీసీ సంతు రజినిప్రియ అల్లం గిరి మస్జిద్ సదర్ సయ్యద్ మజీద్ మాజీ సదర్ షేక్ మహబూబ్ అశ్రాఫ్ అలీ ఇస్మాయిల్ సాబ్ మాజీ వార్డ్ మెంబర్ సజావుద్దీన్ సద్దాం సాధాత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మొగుడంపల్లి..
మొగుడంపల్లి : మండల వ్యాప్తంగా హిందువులు తొలి ఏకాదశి, బక్రీద్‌ను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త దుస్తులు ధరించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హిందువులు, ముస్లింలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తొలిఏకాదశి సందర్భంగా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు హాజరై పూజ చేశారు. రెండు పండుగలు ఒకేరోజు రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
కోహీర్..
కోహీర్ : మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు మసీదు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింలు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. .
జహీరాబాద్..
జహీరాబాద్ : మండలంలోని ముస్లింలు ఈద్-ఉల్-ఆదా వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ముస్లింలు శుక్రవారం ప్రత్యేక వంటకాలు చేసి తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని కోరుతూ ఫాతీహాలు ఇచ్చి కుటుంబాల సమేతంగా సామూహిక భోజనాలు చేశారు. ఈద్గాల వద్ద మత గురువులు, ఇమామ్‌సాబ్‌ల సారథ్యంలో ప్రత్యేక నమాజులు చదివారు. ప్రార్థనల అనంతరం ఖబరస్థాన్‌లకు వెళ్లి పూర్వీకుల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు.
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని, ఆలయ రజతోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజారుల మంత్రోచ్ఛారణ 108 కళాశాలతో వాయు పుత్రునికి అభిషేకం నిర్వహించారు.
Hanuman Jayanti
భక్తుల శ్రీరామ నామ స్మరణ నడుమ 108 కళాశాలలోని పంచామృతాలు, పండ్ల రసాలు, వివిధ జలాలు పంచామృతాలతో స్వామి వారికి జరిపించిన అభిషేకం చూసి భక్త జనులు పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా జరుగుతున్న రామాయణ హోమం ఈరోజుతో ముగిసింది. అంతకుముందు ఆలయం పై భాగంలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.