రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…

రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…

మహిళలు, యువతులు అద్భుతమైన నృత్యాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాలను శనివారం నిమజ్జనం చేసేందుకు రామకృష్ణాపూర్ పట్టణంలోనీ దుర్గామాతలకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా మండపాల నిర్వాహకులు దుర్గమాత విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో, డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రుల సందర్భంగా సిహెచ్పి, బీజోన్ సెంటర్, ఏజోన్, రామాలయం, రాజీవ్ చౌక్, సూపర్ బజార్, సాయిబాబా మందిరం ల వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్ర కన్నుల పండువగా చేపట్టారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ఆనందోత్సవాల మధ్య భాజాభజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు.మహిళలు దాండియా, కోలాటం ఆడారు. అనంతరం భక్తులు సమీప గోదావరి నది వద్దకు దుర్గామాత నిమజ్జనానికై తరలి వెళ్లారు.

శరన్న నవరాత్రులలో భాగంగా మొగిలిపేట గ్రామంలో దుర్గాదేవి నీ దర్శించుకున్న.

శరన్న నవరాత్రులలో భాగంగా మొగిలిపేట గ్రామంలో దుర్గాదేవి నీ దర్శించుకున్న.
టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు
మల్లాపూర్ సెప్టెంబర్ 27 నేటి దాత్రి

మొగిలిపేట గ్రామంలో శరన్ననవరాత్రుల భాగంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు
ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్,మండల ఫిషర్మాన్ అధ్యక్షుడు రొడ్డ రాజు,మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు,మొగిలపేట విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్,మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, మసుల చిన్నయ్య,మిట్టపల్లి మహేష్, ఎండి సల్మాన్,సుద్దాల సతీష్, దేవ రవి,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,సింగరపు అశోక్,ఇప్పపెల్లి గణేష్,గోపిడి నరేష్, ఎట్టేం మల్లేశ్,పోతు గోపి,సమీర్ సర్కార్,నల్లపు పోతరాజు శ్రీకాంత్ దుర్గాదేవి కమిటీ సభ్యులు ,గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గ దేవి శరన్నవరాత్రోత్సవాలు…

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గ దేవి శరన్నవరాత్రోత్సవాలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని ధర్మారావుపేట శివాలయం వేదికగా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో అశ్విజ మాసం శుక్లపక్షం బహుళ పాడ్యమి సోమవారం రోజునా దుర్గమతాను ప్రతిష్టించి పూజ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది అని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. నవ దుర్గ వైభవంలొ భాగంగా మొదటి రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిందని పూజ కార్యక్రమంలొ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా అర్చకులు లంక కిషన్ శర్మ వచ్చిన భక్తులకు సంకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఇచ్చి అమ్మవారి తరుపున ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలొ సేవ సమితి సభ్యులు ఆకుల రవీందర్ వాలా నర్సింగరావు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు పూజారి కుమారస్వామి పనికెల శివకృష్ణ రత్నం మొగిలి పాలకుర్తి సాంబయ్య ఎల్లంకి రమేష్ గందే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట…

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట

చీఫ్ ఇంజనీర్ ప్రకాష్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లో బాగంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో కెటిపిపి దుర్గాదేవి ఉత్సవ కమిటీ వారు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ కెటిపిపి విద్యుత్ కేంద్రం లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు అన్ని కుటుంబాలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆడుతూ పాడుతూ విధులు నిర్వహించేలా క్షేమంగా ఉండేలా చూడాలని ఆ దుర్గాదేవి ని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్స్, దుర్గాదేవి ఉత్సవ

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version