కుంకుమేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి
ఆలయంలో దీపకాంతులతో ప్రత్యేక పూజలు
పరకాల,నేటిధాత్రి
కార్తీకపౌర్ణమి సందర్బంగా బుధవారం రోజున పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఆలయ ప్రాంగణం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిక్కిరిసి పోయింది.భక్తులు పవిత్ర స్నానాలు చేసి శివారాధన, దీపారాధన,కార్తీక నోములు నిర్వహించారు.హిందూ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా చెప్పుకుంటారు.ఈ రోజున శివుడికి భక్తులు ప్రత్యేక పూజలలతో ఆలయాలు దీపకాంతులతో వెలిగిపోతాయి,శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతాయి.ప్రత్యేక పూజలు,అభిషేకాలు, అనంతరం దీప వత్తులతో దీపాలను వెలిగించడం వంటి వైదిక కార్యక్రమాలలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేకంగా శివకేశవ పూజలను నిర్వహిస్తారు.కార్తీక పౌర్ణమి రోజు నదీ తీరాల్లో పవిత్ర స్నానం చేసిఉపవాసం ఆచరిస్తూ,దీపారాధన జరిపితే చాలు,శివుని కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు.
