కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
శనివారం రేగొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్బంగా పాఠశాలలోని విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి భోజనం, వసతి, విద్యా ప్రమాణాలు,బోధన గుణనిల్వ వంటి అంశాలపై విద్యార్థులను,ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు.గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని,విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు అని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేనీ వారు ఇప్పుడు హాస్టల్స్ సందర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.పాఠశాలలో కొరతలున్న వసతులు, మౌలిక సదుపాయాలపై స్పందించిన ఆయన, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి అని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి పాఠశాలల పరిరక్షణపై మరింత శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూటిజు కిష్టయ్య, పిఏసిఎస్ చైర్మన్ విజ్జాన్ రావు,సంబధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.